–రేపటి క్యాబినెట్ లో బీసీ రిజ ర్వేషన్లపై స్పష్టతనివ్వాలి
–అఖిలపక్షంతో సీఎం ఢిల్లీకి వెళ్లే తేదీని ప్రకటించాలి
–రిజర్వేషన్లు పెంచిన తర్వాతే స్థాని క ఎన్నికల నిర్వహించాలి
–ఈనెల 11న భవిష్యత్ కార్యాచర ణ ప్రకటిస్తాం
–బీసీ సంక్షేమ సంఘం జాతీయ అ ధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్
President Jajula Srinivas Goud : ప్రజా దీవెన హైదరాబాద్:బీసీ రిజ ర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం నాన్చివే త ధోరణి అవలంబించకుండా రేపు జరిగే రాష్ట్ర క్యాబినెట్ సమావేశం లో స్పష్టతనివ్వాలని, కేంద్ర ప్రభు త్వంపై ఒత్తిడి పెంచడానికి సీఎం నే తృత్వంలో ఢిల్లీకి వెళ్లి అఖిలపక్ష తే దీని క్యాబినెట్ సమావేశంలోనే నిర్ణ యించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివా స్ గౌడ్ ఒక ప్రకటనలో కాంగ్రెస్ ప్ర భుత్వాన్ని డిమాండ్ చేశారు. స్థాని క ఎన్నికలపై రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పు కొద్ది సమయమే ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వం తమ చర్యల్ని వేగ వంతం చేయవలసినటువంటి అవ సరం ఉన్నదని, ఎన్నికలు సమీపి స్తున్న కొద్ది జీవోల పేరుతో కాలయా పన చేయకుండా చట్టబద్ధమైన బీ సీ రిజర్వేషన్లు కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చర్యలకు ఉప క్రమించాలని శ్రీనివాస్ గౌడ్ డిమాం డ్ చేశారు.
ఇటీవల హైదరాబాద్ పర్యటనకు ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రెటరీ కేసి వేణుగోపాల సమక్షంలో బీసీ రి జర్వేషన్లు పెంచిన తర్వాతనే స్థాని క సంస్థల ఎన్నికలు నిర్వహించాల ని జరిగిన సమావేశాల్లో నిర్ణయం తీసుకున్నారని కానీ ఇందుకు విరు ద్ధంగా ప్రతిరోజు మీడియాలో ఒక రోజు జీవో అని ఇంకొక రోజు పార్టీ పరంగా 42 శాతం రిజర్వేషన్లు అ మలు చేస్తామని వస్తున్నందున తె లంగాణ రాష్ట్రంలోని బీసీలు గంద రగోళానికి గురవుతున్న దృశ్య ఈ గందరగోళానికి తెరదించాలంటే గురువారం జరిగే రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో బీసీ రిజర్వేషన్లపై రా ష్ట్ర ప్రభుత్వం స్పష్టతని ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
బీసీ రిజర్వేషన్ల పెంపు విషయంలో కాంగ్రెస్ బిజెపి రెండు పార్టీలు బా ధ్యత తీసుకోవాలని బీసీల రిజర్వే షన్ల విషయంలో రాజకీయం చేయ కుండా నిబద్ధతతో నిజాయితీతో వ్యవహరించి బీసీ రిజర్వేషన్ల పెం పుకు సహకరించాలని శ్రీనివాస్ గౌడ్ కోరారు.
బీసీ రిజర్వేషన్ల విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచడా నికి ఈనెల 11వ తేదీన హైదరాబా దులో బిసి కుల సంఘాలతో విస్తృ తస్థాయి సమావేశం ఏర్పాటు చేసి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామ ని ఆయన తెలిపారు.