Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Uttam Kumar Reddy: చిన్న లిప్టుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి

పాక్షికంగా ఉన్న చిన్న లిఫ్టుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని దీని ద్వారా రాష్ట్రంలో ఆరు లక్షల ఎకరాల సాగు భూమి సాధ్యమవుతుందని ,తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి అన్నారు.

చిన్న లిఫ్టుల ద్వారా రాష్ట్రంలో ఆరు లక్షల ఎకరాల సాగు భూమి
కోదాడ హుజూర్నగర్ నియోజకవర్గాలలో ఉన్న లిఫ్ట్లో అభివృద్ధికి కృషి చేస్తా
అలసత్వం వహించే అధికారులపై చర్యలు

ప్రజా దీవెన, కోదాడ: పాక్షికంగా ఉన్న చిన్న లిఫ్టుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని దీని ద్వారా రాష్ట్రంలో ఆరు లక్షల ఎకరాల సాగు భూమి సాధ్యమవుతుందని ,తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Telangana State Irrigation Department Civil Supplies Minister Uttam Kumar Reddy) అన్నారు. సోమవారం పట్టణంలో స్థానిక గునుగుంట్ల అప్పయ్య కళ్యాణమండపంలో ఇరిగేషన్ అధికారుల ఉన్నత స్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశానికి మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రములో పాక్షికంగా ఉన్న చిన్న లిఫ్టుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని దీనివలన రాష్ట్రంలో ఆరు లక్షల ఎకరాల భూమి సాగు అవుతుందని తెలిపారు.

కోదాడ హుజూర్నగర్ లో ఉన్న లిఫ్టుల అభివృద్ధికి (Development of lifts) కృషిచేసి సాగునీరు అందిస్తానని తెలిపారు పెద్ద లిప్ట్లకు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేసే బదులు క్రింది స్థాయి లిప్ల అభివృద్ధికి కృషిచేసి రైతులకు నీరందించి మేలు చేయవచ్చని తెలిపారు కృష్ణ మూసి గోదావరి పాలేరు సాగర్ ఆయకట్లపై ఉన్న విప్లను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తామని తెలిపారు తక్కువ ఖర్చుతో తక్కువ సమయంలో ఎక్కువ ఆయకట్టు ప్రణాళికను రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని తెలిపారు అధికారులు నివేదికలు తయారు చేయాలని ఇరిగేషన్ విభాగంలో(Irrigation Department) అలసత్వం వహించిన అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. త్వరలోనే లిఫ్ట్ కాలవలపై పొరుగు సేవల ద్వారా ఉద్యోగాలు భర్తీ చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కోదాడ శాసనసభ్యురాలు నలమాధ పద్మావతి రెడ్డి సూర్యాపేట జిల్లా కలెక్టర్ వెంకట్రావు జిల్లాఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులు రైతులు తదితరులు పాల్గొన్నారు.

State Govt efforts on development of small Lifts