విద్యార్థులు ప్రాధమిక పాఠశాల నుండే తెలుగు,ఇంగ్లీషులో పట్టు సాధించాలి.
అంగన్వాడీ కేంద్రాలలో పరిశుభ్రత పాటించాలి.
సూర్యాపేట మండలం బాలెంలలో ఆకస్మిక తనిఖీలు చేసిన
జిల్లా కలెక్టర్ *తేజస్ నంద్ లాల్ పవార్ *
District Collector Tejas Nand Lal Pawar : ప్రజాదీవెన, సూర్యాపేట : సీజనల్ వ్యాధుల పట్ల వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. శుక్రవారం బాలెంల పల్లె దవాఖాన ను తనిఖీ చేసి రికార్డు లను పరిశీలించారు ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ హాస్పిటల్ లో సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలని సూచించారు.వైద్య సిబ్బంది సమయపాలన పాటిస్తూ ప్రజలకి అందుబాటులో ఉండాలని అన్నారు.రక్త హీనతతో భాధపడుతున్న పేషెంట్స్ ఎంత మంది ఉన్నారు వాళ్ళ చికిత్స గురించి అడిగి తెలుసుకున్నారు. హాస్పిటల్ ఆవరణలోని వాటర్ ట్యాంక్ ని పరిశీలించి సాధ్యమైనంత త్వరగా క్లీన్ చేయాల్సిందిగా గ్రామ కార్యదర్శిని అదేశించారు.వ్యాధి నిరోధక టీకాలు వేసే రోజు పేషెంట్స్ వచ్చినపుడు కూర్చోడానికి కూడా వీలు ఉండట్లేదు అని డాక్టర్ చెప్పగా వెంటనే వెయిటింగ్ షెడ్ నిర్మించాలని గ్రామ కార్యదర్శిని అదేశించారు ఇట్టి నివేదికను రెండు రోజులలో ఇవ్వాలని ఆదేశించారు.
తదుపరి బాలెంల ప్రాధమిక పాఠశాల సందర్శించి సిబ్బంది అటెండెన్స్ రిజిస్టర్ పరిశీలించి నాలుగవ తరగతి క్లాస్ లోకి వెళ్లి సుశాంత్ అనే విద్యార్థిని ఇంగ్లీష్, అనుష్క అనే బాలికను తెలుగు చదివించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రాథమిక పాఠశాల స్థాయి నుంచి తెలుగు, ఇంగ్లిష్ భాష లలో పట్టు సాధించాలని అన్నారు. టాయిలెట్స్ శుభ్రంగా ఉంచుకోవాలని నీరు నిల్వ లేకుండా చూడాలని, నీరు నిల్వ ఉండే గుంటలను మట్టి పోయించాలని పంచాయతీ సెక్రెటరీని ఆదేశించారు.
తదుపరి అంగన్వాడి కేంద్రం సందర్శించి సెంటర్లో ఎంత మంది పిల్లలు ఉన్నారు వారికి అందుతున్న మెనూ వివరాలు తెలుసుకున్నారు. తదుపరి పిల్లల చేత పదాలు చదివించారు కలెక్టర్ మాట్లాడుతూ మోడల్ అంగన్వాడి కేంద్రంగా మార్చుటానికి ప్రతిపాదనలు పంపాలని , టాయిలెట్స్ ఎత్తు పెంచుకోవాలని, వాటర్ ట్యాంక్ నిర్మాణం చేయవలసిందిగా ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో మెడికల్ అధికారి మణిరత్నం, ప్రాథమిక పాఠశాల హెడ్మాస్టర్ నీరజలత, ఉపాధ్యాయులు రేణుక, ఎల్లమ్మ అంగన్వాడీ టీచర్ నాగమ్మ, పంచాయతీ సెక్రెటరీ శ్రీనివాసరాజు, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.