విద్యార్థుల చేతుల్లోనే దేశ భవిష్యత్తు
–నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి
ప్రజా దీవెన, నకిరేకల్: దేశ భవిష్యత్తు విద్యార్థుల చేతుల్లోనే ఉంద ని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు.సోమవారం ఆమె నల్గొండ జిల్లా నకిరేకల్ మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్థానిక శాసనసభ్యులు వేముల వీరేశంతో కలిసి అదనపు తరగతి గదులను ప్రారంభించారు. విద్యార్థులకు బూట్లు పంపిణీ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లా డుతూ విద్యార్థులు బాగా చదు వుకొని సొంత ప్రాంతం తో పాటు, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని అన్నారు.
విద్యార్థుల భవిష్యత్తు కోసం స్థానిక శాసన సభ్యులు విద్యా వాలంటీ ర్లతో పాటు, ప్రత్యేకంగా టీచర్లను ఏర్పాటు చేయడం సంతోషమని అన్నారు. విద్యార్థులు టాయిలెట్స్ ను కోరగా వెంటనే మంజూరు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యపై అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నదని, ఇందులో భాగంగా మధ్యాహ్న భోజనం చార్జీలు పెంచడం జరిగిందని, ఉపాధ్యాయులు విద్య,భోజనం పై ఎక్కువగా దృష్టి కేంద్రీకరించి నాణ్యమైన భోజనాన్ని అందించడంతో పాటు, మంచి విద్యను విద్యార్థులకు అందించాలని అన్నారు.
ఇంగ్లీష్ మీడియంలో సైతం విద్యార్థులకు బాగా భోదించాలని, అలా గే అన్ని అంశాలలో నూటికి నూరు శాతం విద్యార్థులను తీర్చి దిద్దా లని,మద్యాహ్న భోజనానికి సంబంధించి ఏమైనా సమస్యలు ఉన్నట్ల యితే డివిజన్ వారిగా కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేస్తున్నామని, సమస్యలను కంట్రోల్ ఏర్పాటు చేసిన ఫోన్ నెంబర్లకు తెలియజేస్తే తగు చర్య తీసుకుంటామని తెలిపారు. విద్యార్థులు చెడు అలవా టులకు దూరంగా ఉండాలని, చదువుపైనే దృష్టి పెట్టాలని కోరారు.
శాసనసభ్యులు వేముల వీరేశం మాట్లాడుతూ విద్యాపరంగా నకిరే కల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 2 వ స్థానంలో ఉందని, పాఠశా ల మరింత అభివృద్ధికి జిల్లా కలెక్టర్ పాఠశాలను దత్తత తీసుకోవా లని కోరారు. నకిరేకల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను గొప్పగా తీర్చిదిద్దేందుకు తనవంతు సహకారం అందిస్తానని తెలిపారు.
ఉచిత కంటి వైద్య శిబిరం…అనంతరం ఉద్దీపన ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పుష్పగిరి ఆసుపత్రి వారి ద్వారా స్థానిక ఆసుపత్రిలో 3 రోజుల పాటు నిర్వహిం చనున్న ఉచిత కంటి వైద్య శిబిరాన్ని జిల్లా కలెక్టర్ ఎమ్మెల్యే తో కలిసి ప్రారంభించారు. ఈ సం దర్భంగా మాట్లాడుతూ త్వరలోనే నకరికల్ ఏరియా ఆసుపత్రిని ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెప్పారు. రాష్ట్ర ప్రభు త్వం ఆరోగ్యశ్రీ పరిమితిని 5 లక్షల నుండి 10 లక్షలకు పెంచిందని తెలిపారు.
ఉచిత కంటి వైద్య శిబిరంలో కండ్లకు సంబంధించి షుగర్, గ్లూకోమా వంటి అన్ని రకాల టెస్టులు చేయడం జరుగుతుందని, కిడ్నీ సమస్య వల్ల కూడా కంటిచూపు సమస్య వస్తుందని, అందు వల్ల అందరూ పరీక్షలు చేయించుకుని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. స్థాని క శాసనసభ్యులు ఉచితంగా కంటి అద్దాలు అందించేందుకు ముం దుకు రావడం సంతోషమని అన్నారు.ఉచిత వైద్య శిబి రంతో పాటు అవసరమైన వారికి ఉచితంగా విటమిన్- ఏ టాబ్లెట్లు అందించేం దుకు పుష్పగిరి ఆసుపత్రి వారు ముందుకు రావాలని ఆమె కోరారు.
శాసనసభ్యులు వేముల వీరేశం మాట్లాడుతూ పుష్పగిరి ఆసుపత్రి మంచి కార్యక్రమాలను చేపట్టడం సంతోషమని అన్నారు. ఇప్పటివ రకు 25వేల కంటి ఆపరేషన్లు నిర్వహించారని, నకిరేకల్ లో ఏర్పా టుచేసిన ఉచిత కంటి వైద్య శిబిరం ద్వారా ప్రతిరోజు 40 మందికి చొప్పున కంటి ఆపరేషన్లు చేసి ఇంటి దగ్గర దిగబెడతారని, అందు వల్ల అంద రూ ఈ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. డిసిహెచ్ ఎస్ మాతృ ,పుష్పగిరి కంటి ఆసుపత్రి నుండి గోవిందా హరి ,తదితరులు ఈ కార్యక్రమాలలో పాల్గొన్నారు.
Stimulus education