ప్రజాదీవెన, హైదరాబాద్: మొన్నటివరకు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మంచు ఫ్యామిలీ వివాదం చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. అయితే ఈ వివాదాన్ని కవరేజీ చేసేందుకు వెళ్లిన మీడియాపై మోహన్ బాబు దాడి చేశాడు. టీవీ9 మీడియా రిపోర్టర్ రంజిత్ పై దాడి చేయడంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో మోహన్ బాబుపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. దాడి అనంతరం రెండు రోజులు ఆసుపత్రిలో ఉన్న మోహన్ బాబు ఆ తర్వాత డిశ్చార్జ్ అయి ఇంటికి చేరుకున్నారు. ఆ తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లారు.
మీడియాపై దాడి కేసులో మోహన్ బాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ను కోర్టు కొట్టేసింది. ఈ కేసులో మోహన్ బాబు వాంగూల్మం రికార్డ్ చేయడానికి వెళ్లిన పోలీసులకు ఆయన కనిపించలేదు. దీంతో మోహన్ బాబు కోసం ప్రత్యేక బృందాలతో పోలీసులు గాలిస్తున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం నడిచింది. తాజాగా తన గురించి వస్తున్న వార్తలపై మోహన్ బాబు సోషల్ మీడియా వేదికగా రియాక్ట్ అయ్యాడు.
ఎక్స్ వేదికగా ఆసక్తికర పోస్ట్..
సోషల్ మీడియాలో మోహన్ బాబు మిస్సింగ్ అంటూ హంగామా నడుస్తున్న సమయంలో ట్విట్టర్ వేదికగా ఆసక్తికర పోస్ట్ చేశారు . “నేను ఎక్కడికీ వెళ్లిపోలేదు. నాపై తప్పుడు ప్రచారం జరుగుతుంది. ముందస్తు బెయిల్ తిరస్కరించలేదు. ప్రస్తుతం ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్నాడు. తన గురించి అసత్యపు వార్తలు రాయకండి అని రిక్వెస్ట్ చేస్తున్నాను” అంటూ ట్వీట్ చేశాడు.
నేను ఎక్కడికి పారిపోలేదు – మోహన్ బాబు
తన మీద తప్పుడు ప్రచారం జరుగుతోంది అని సోషల్ మీడియా నెట్వర్కింగ్ సైట్ ఎక్స్ వేదికగా మోహన్ బాబు పేర్కొన్నారు. పుకార్లకు చెక్ పెట్టారు. తనకు ముందస్తు బెయిల్ రాలేదని, తన బెయిల్ రిజెక్ట్ అయిందని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని ఆయన తెలిపారు. ప్రస్తుతం తాను సొంత ఇంటిలో ఉన్నానని, మెడికల్ కేర్ (చికిత్స) తీసుకుంటున్నానని మోహన్ బాబు వివరించారు. నిజానిజాలు తెలుసుకుని మీడియా ప్రజలకు చెప్పాల్సిందిగా తాను విజ్ఞప్తి చేస్తున్నానని మోహన్ బాబు పేర్కొన్నారు.