–జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్
–అకస్మికంగా వాడపల్లి పోలీస్ స్టేషన్ తనఖీ
District SP Sarath Chandra Pawar :ప్రజాదీవెన నల్గొండ :ఇతర రాష్ట్రాల నుండి దాన్యం అక్రమంగా రవాణా చేస్తే కఠించిన తీసుకుంటామని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ హెచ్చరించారు. బుధవారం మిర్యాలగూడ సబ్ డివిజన్ లో గల వాడపల్లి పోలీస్ స్టేషన్ ను సందర్శించి పలు రికార్డులను తనిఖి చేసి సిబ్బంది వివరాలు, వారి పని తీరు, పోలీస్ స్టేషన్ స్థితిగతులు తెలుసుకొని, స్టేషన్ రైటర్, లాక్ అప్, ఎస్.హెచ్. ఓ రూమ్ తదితర ప్రదేశాలను పరిశీలించడం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ స్టేషన్ లో ఎల్లప్పుడు అందుబాటులో ఉంటూ ప్రజలకు సమర్థవంతమైన సేవలు అందించాలని అన్నారు. పోలీస్ స్టేషన్ కి వచ్చే బాధితులతో మర్యాదపూర్వకంగా మాట్లాడుతూ వారి పిర్యాదులు క్షేత్రస్థాయిలో పరిశీలించి బాధితులకు సత్వర నాయం జరిగే విధంగా పనిచేయాలని తెలియజేశారు. సామాన్యుడు పోలీస్ స్టేషన్ కి వస్తే తగిన న్యాయం జరుగుతుందనే భరోసా కల్పించే విధంగా పనిచేయాలని అన్నారు. అలాగే గ్రామ పోలీసు అధికారులు ప్రతి రోజు వారికి కేటాయించిన గ్రామాలను సందర్శిస్తూ ప్రజలతో మమేకం అవుతూ కొత్త వ్యక్తుల కదలికలు, సైబర్ నేరాలపట్ల అవగాహన సిసిటివిల ప్రాముఖ్యత పట్ల అవగాహన పరుస్తూ నేరాల నియంత్రణ అదుపుకు కృషి చేయాలని అన్నారు.
దొంగతనాలు జారగకుండా రాత్రి, పగలు గస్తీ నిర్వహించాలని పేర్కొన్నారు. జిల్లా సరిహద్దు ప్రాంతం నుంచి అక్రమగా గంజాయి, పీడియస్ బియ్యం, అక్రమ ఇసుక రవాణా, జూదం లాంటి అసాంఘిక కార్యకలాపాల పైన పటిష్ఠ నిఘా ఏర్పాటు చేయలని అన్నారు. అనంతరం వాడపల్లి వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ తనికి చేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు లబ్ధి చేకూర్చాలని ఉద్దేశంతో సన్న వడ్ల పైన ఇస్తున్న బోనన్ ఆసరాగా తీసుకుని కొంతమంది దళారుల, మిల్లర్లు రైతుల పేరిట ఇతర రాష్ట్రాలనుండి దిగుమతి చేసుకుంటున్నారు వారిని ఇప్పటికే అక్రమంగా ధాన్యం తరలిస్తున్న 7 లారీలను గుర్తించి ఏడు కేసులు నమోదు కేసులు చేయడం జరిగిందని అన్నారు.మన జిల్లా సరిహద్దు ప్రాంతం అయిన వాడపల్లి, విజయపురి సాగర్ వద్ద చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేసి సీసీ కెమెరాలు ద్వారా రెవిన్యూ అధికారులు సమన్వయంతో ప్రతి వాహనాన్ని తనిఖీ చేయడం జరుగుతుందని ఎవరైనా దళారులు,ఏజెంట్లు ఇతర రాష్ట్రాల నుంచి ధాన్యం అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవనీ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ వెంట మిర్యాలగూడ డిఎస్పి రాజశేఖర రాజు, సిఐ పియన్డి ప్రసాద్, వాడపల్లి యస్ఐ శ్రీకాంత్ రెడ్డి, పోలీస్ స్టేషన్ సిబ్బంది ఉన్నారు.