NEET Examination : ప్రజాదీవెన, సూర్యాపేట :నీట్ పిజి పరీక్ష నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ రాంబాబు తెలిపారు.గురువారం ఐడిఓసి కార్యాలయంలో అదనపు కలెక్టర్ చాంబర్ లో నీట్ పీజీ పరీక్ష నిర్వహణ, ఏర్పాట్లుపై సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఆగస్టు 3వ తేదీన ఉదయం 9 గంటలు నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరుగనున్న పరీక్షకు రెండు కేంద్రాలు శ్రీ వెంకటేశ్వర ఇంజినీరింగ్ కళాశాల అమరావతి నగర్, కోదాడలో సన ఇంజినీరింగ్ కళాశాలలో
నీట్ పిజి పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు.
వెంకటేశ్వర ఇంజినీరింగ్ కళాశాల అమరావతి నగర్ లో 180, కోదాడలో సన ఇంజినీరింగ్ కళాశాలలో
50 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరవుతున్నట్లు ఆయన తెలిపారు. అభ్యర్థులను నిశిత తనిఖీ తదుపరి పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించాలని సూచించారు. ఉదయం 7 గంటల నుండి 8.30 వరకు అనుమతి ఇస్తారని ఆ తదుపరి అనుమతి ఉండదన్నారు. విద్యుత్ అతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేయాలని విద్యుత్ అధికారులకు సూచించారు.
పరీక్షా కేంద్రాల్లో అత్యవసర వైద్య సేవలతో పాటు ఓ ఆర్ ఎస్ పాకెట్స్ అందుబాటులో ఉంచాలని అన్నారు. అత్యవసర సేవలకు గాను అంబులెన్స్ అందుబాటులో ఉంచాలని సూచించారు. అభ్యర్థులకు మంచినీరు అందించాలన్నారు. పరీక్షా కేంద్రాల్లో వ్యర్దాలు లేకుండా పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించి పరిశుభ్రంగా ఉంచాలని మున్సిపల్ కమిషనర్ ను ఆదేశించారు.
అభ్యర్థులు సకాలంలో పరీక్షా కేంద్రానికి సూచించారు.
నీట్ పి.జి. ప్రవేశ పరీక్ష నిర్వహణలో భాగంగా అభ్యర్థులు, సిబ్బంది
పరీక్ష కేంద్రాల్లోకి సెల్ ఫోన్, టాబ్స్ , బ్లూటూత్, స్మార్ట్ వాచ్, ఇయర్ ఫోన్, ఇతర ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ అనుమతి లేదని, షూస్, బెల్ట్, ఆభరణాలు ధరించవద్దని తెలిపారు.
ఫుల్ హ్యాండ్ షర్ట్స్ ధరించి రావొద్దని సూచించారు. పరీక్షా కేంద్రాలలో విద్యార్థులకు అవసరమైన అన్ని రకాల వసతులు కల్పించాలని అధికారులకు సూచించారు. ఎటువంటి మాల్ ప్రాక్టీస్ కు అవకాశం లేకుండా పకడ్బందీగా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. సీసీటీవీ మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేసి పరీక్షను క్షుణ్ణంగా పర్యవేక్షించాలని అన్నారు.
8.30 గంటలకు పరీక్ష కేంద్రం గేట్ మూసివేస్తామని, గేటు మూసిన తర్వాత ఎవ్వరిని లోపలికి అనుమతించరని, అభ్యర్థులు సకాలంలో పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని కలెక్టర్ సూచించారు. పరిక్షా కేంద్రాల సమీపంలో 163 సెక్షన్ అమల్లో ఉంటుందని, సమీపంలోని జిరాక్స్ కేంద్రాలు మూసేయ్యాలని కలెక్టర్ స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో ఏఎస్పీ రవీందర్ రెడ్డి, విద్యుత్ శాఖ ఎస్ ఈ విద్యా భాస్కర్, జిల్లా వైద్యాధికారి పి చంద్రశేఖర్, ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్ ఎన్ జయలత, పరీక్ష కేంద్రాల ప్రిన్సిపాల్ లు ఆర్టీసీ డిఎం లక్ష్మీనారాయణ, సూర్యాపేట తహసిల్దార్ సిహెచ్ కృష్ణయ్య, మున్సిపల్ కమిషనర్ హన్మంత రెడ్డి తదితరులు పాల్గొన్నారు