Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

MLC Nellikanthi Satyam : జిల్లా సమగ్ర అభివృద్ధికి బలమైన ఉద్యమాలు

–జిల్లాలో పెండింగ్ సాగు నీటి ప్రాజెక్టులను
పూర్తిచేయాలి

–దివిస్ లాంటి పార్మా కంపెనీలకు వ్యతిరేకంగా ఉద్యమం

–తెలంగాణ కు అన్యాయం చేయడానికి బనకచర్ల ప్రాజెక్టు

–అయిల్ పామ్ ఫ్యాక్టరీ నెలకొల్పాలి

–విలేకరుల సమావేశంలో సిపిఐ నూతన జిల్లా కార్యదర్శి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం

MLC Nellikanthi Satyam : ప్రజాదీవెన నల్గొండ : నల్లగొండ జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం బలమైన ఉద్యమాలు నిర్వహిస్తామని సిపిఐ జిల్లా కార్యదర్శి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం పేర్కొన్నారు. బుధవారం సిపిఐ నల్లగొండ జిల్లా కార్యాలయం ముక్దూం భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అయన మహాసభ వివరాలు వెల్లడించారు. సిపిఐ నల్లగొండ జిల్లా 23వ మహాసభ దేవరకొండ పట్టణంలో ఈనెల 15వ తేదీ మంగళవారం విజయవంతంగా నిర్వహించడం జరిగిందని తెలిపారు. మహాసభలో జిల్లా కార్యదర్శి గా నెల్లికంటి సత్యం, సహాయ కార్యదర్శులు పల్లా దేవేందర్ రెడ్డి, లోడంగి శ్రవణ్ కుమార్ లతోపాటు 45మంది కౌన్సిల్ సభ్యులు, 13మంది కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని తెలిపారు. నల్లగొండ జిల్లాలోని పెండింగ్ సాగునిటీ ప్రాజెక్టు లను పూర్తి చేయడానికి నిర్ణీత కాలవ్యవధిని ప్రకటించి అందుకు సరిపడా అధిక నిధులు కేటాయించి యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాని కోరారు.

 

కరువు పీడిత ప్రాంతాలైన మునుగోడు, దేవరకొండ నియోజకవర్గాలను సస్యశ్యామలం చేయడం కోసం ఆనాడు కేసిఆర్ డిండి ఎత్తిపోతల పథకానికి హడావుడిగా శంకుస్థాపన చేశారు తప్ప, ప్రాజెక్టు నిర్మాణంలో భూములు కోల్పోయిన నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించకుండా ప్రాజెక్టు డిపిఆర్ ఆమోదించకుండా, ప్రాజెక్టుకు ఎక్కడినుండి నీరు తెస్తారో దానిపై స్పష్టత లేకుండా చేశారని ఆరోపించారు. తెలంగాణ కు తీవ్ర అన్యాయం చేసి నీటిని తరలించుకుపోయేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బనకచర్ల ప్రాజెక్టు నిర్మించడానికి కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. బనకచర్ల ప్రాజెక్టును సిపిఐ తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్ కరువు పీడిత సమ స్యలతో అనేక ఇబ్బందులు పడ్డ ప్రజలకు ఇప్పుడు ఫార్మా కంపెనీల ద్వారా కాలుష్యంతో అనారోగ్యలాకు గురై ప్రాణాలను పనంగా పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మునుగోడు ప్రాంతంలోని కిష్టాపురం గట్టుప్పల చిట్యాల మండలంలోని వెలిమినేడు, పిట్టంపల్లి ప్రాంతాలలో విచ్చలవిడిగా ఫార్మ కంపెనీ నెలకొల్పేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయని వాటిని తీవ్రంగా వ్యతిరేకించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

 

చౌటుప్పల్ ప్రాంతంలోని దివిస్ ఇలాంటి కెమికల్ కంపెనీ ద్వారా వెలువడే కాలుష్యం తో ఆ ప్రాంతం ప్రజలు తీవ్రమైన అనారోగ్యాలకు గురవుతున్నారని ఆ ప్రాంతంలో ఎక్కడ బోర్ వేసిన కెమికల్ ఆయిల్ తో కూడిన రంగు మారిన కెమికల్ నీరే వస్తుందని పేర్కొన్నారు. అలాంటి దివిస్ కంపెనీకి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలు చేపడతామన్నారు. నల్గొండ జిల్లా వ్యవసాయ రంగంపై ఆధారపడి ఉన్నదని ప్రస్తుత పరిస్థితులలో రైతులు ఆయిల్ ఫామ్ పంటల సాగుకు మొగు చూపుతున్న నేపథ్యంలో ప్రభుత్వం జిల్లాలో ఆయిల్ ఫామ్ పరిశ్రమలను నెలకొల్పాన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థ ఎన్నికలలో 42 శాతం రిజర్వేషన్లు, ఎస్ సి వర్గీకరణ లాంటి అంశాలను సిపిఐ స్వాగతిస్తుందన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే వెంటనే తమిళనాడు రాష్ట్రం తరహాలో 42 శాతం రిజర్వేషన్ లను తొమ్మిదో షెడ్యూల్లో చేర్చి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ
విలేకరుల సమావేశంలో జిల్లా సహాయ కార్యదర్శులు పల్లా దేవేందర్ రెడ్డి, లోడంగి శ్రవణ్ కుమార్, కార్యవర్గ సభ్యులు పబ్బు వీరస్వామి, బొల్గురి నర్సింహా, గురిజ రామచంద్రం, నల్ప రాజు రామలింగయ్య, టి. వెంకటేశ్వర్లు, ప్రజ్యానాట్యమండలి రాష్ట్ర అధ్యక్షులు కురుమిద్ద శ్రీనివాస్, పట్టణ కార్యదర్శి కె ఎస్. రెడ్డి లు పాల్గొన్నారు.