–హాస్టల్ ఎదుట కుటుంబ సభ్యు లు, బంధుమిత్రుల ఆందోళన
Student Died: ప్రజా దీవెన, కోదాడ: సూర్యాపేట జిల్లా ఆత్మకూరు (ఎస్)మండల కేంద్రంలోని సాంఘీక సంక్షేమ హాస్టల్ (Social Welfare Hostel) లో ఉంటూ 7వ తరగతి చదువుతున్న విద్యార్థి (student) అనుమానాస్పద స్థితిలో బుదవారం తెల్లవారు జామున మృతి చెందిన సంఘటన చోటు చేసుకుందిఈ మృతిపై బాలుడి తరుపు బందు వులు, విద్యార్థి సంఘాల నాయకు లు ఏరియా ఆసుపత్రిలో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు.ఈ మృతి పట్ల బందు వులు తెలిపిన వివరాల ప్రకారం జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ కాలనీకి చెందిన మెల్లం శ్యామ్ కుమార్ (13) ఆత్మకూ రు(ఎస్)లోని ఎస్సి హాస్టల్ లో (hostels) ఉంటూ మోడల్ స్కూల్లో (Model School)చదువు కుంటున్నాడు.
ఇతను చిన్నతనం లోనే తల్లిదండ్రులను కోల్పోవ డంతో ఆ కాలనీలోని తన పెద్దమ్మ చల్లప్ప సైదమ్మ ఇంట్లో ఉంటున్నా డు. 2023 లో 6వ తరగతిలో ఎస్సి హాస్టల్ లో చేరాడు.ప్రస్తుతం 7వ తరగతి చదువుతున్నాడు. కాగా మంగళవారం సాయంత్రం. శ్యామ్ కుమార్ తనకు హెల్త్ ఏదోలా ఉందని తన తోటి విద్యార్థులతో చెప్పినట్లు సమాచారం. రాత్రి సుమారు 12 గంటల సమయంలో మూత్రం పోయడానికి లేచినట్లు బందువులు చెప్పారు.కానీ తెల్లవారికే సరికి విగతజీవిగా పడి ఉండటాన్ని విద్యార్దులు చూసి హాస్టల్ వార్డెన్ కి సమచారం ఇచ్చినట్లు తెలిపారు.ఆ సమచారమే వార్డెన్ (warden)మాకు ఇచ్చాడని, మేము హాస్టల్ దగ్గరికి వెళ్ళే సమయం లోపే మా బాబుని వార్డెన్ ఏరియా ఆసుపత్రికి తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు. తామూ వెంటనే ఏరియా ఆసుపత్రికి వచ్చి చూడగా నోటి నుండి నురగలు వచ్చినట్లు చెప్పారు.దీనితో బాబుని పలిశీలించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు చెప్పారు.గత 5 ఏళ్ల కిందట అనారోగ్యoతో మృతుడి తల్లి చనిపోగా,అతని తండ్రి 2 ఏళ్ల క్రితం చనిపోయాడు.
అప్పటికి నుండి ఆ బాలుడిని తన పెద్దమ్మ సాదుకుంటోంది.నాటి నుండి అల్లారు ముద్దుగా పెంచుకున్న నా బాబు ఇలా అకారణంగా చనిపోయాడoటూ బోరున విలపిస్తుoడంతో స్థానికులను కన్నీరు తెప్పించింది.విషయంలో తెలుసుకున్న సూర్యాపేట ఆర్డీఓ (Suryapet RDO) ఆర్.వేణు మాధవ రావు,డిఎస్పి జి. రవిలు ఏరియా ఆసుపత్రికి చేరుకుని బాలుడి మృత దేహాన్ని పరిశీలించి పోస్టు మార్టం నివేదిక అందాక పూర్తి వివరాలు వెల్లడిస్తామని,అందుకు ఎవరైనా బాధ్యులని తేలితే శాఖ పరమైన చర్యలు ఉంటాయని తెలిపారు.కాగా ఏరియా ఆసుపత్రిలో పలు విద్యార్థి సంఘాల నాయకులు విద్యార్థి మృతిపై(Death of a student) ఆందోళన వ్యక్తం చేస్తూ మీడియాతో మాట్లాడారు.ఈ మృతి బాధాకరం అని,చాలా అనుమానాస్పదంగా ఉందని, అందుకు బాలుడి కుటుంబానికి న్యాయం చేసి భాద్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.కాగా గత ఏడాది క్రితం ఇదే మండల కేంద్రంలోని గురుకుల పాఠశాలలో చదువుతున్న ఓ బాలుడు తన గదిలోకి ఫ్యాన్ కి ఉరేసుకొని మృతి చెందిన విషయం తెలిసిందే. మండల కేంద్రంలోని సాంఘీక సంక్షేమ హాస్టల్ వార్డెన్ గా ఉన్న పెరుమాళ్ల రవి సుమారుగా గత మూడేళ్లుగా అక్కడే విధులు నిర్వర్తిస్తున్నారు.అయినప్పటికీ అతను ఉద్యోగ రీత్యా హాస్టల్ కి సమయానికి వెళ్ళడని, విద్యార్దులను అస్సలు పట్టించుకోడనే బలమైన ఆరోపణలు ఉన్నాయి. మెనూ ప్రకారం భోజనం కూడా పెట్టించడని విశ్వసనీయంగా తెలిసింది.విధుల పట్ల నిర్లక్యంగా వ్యవహరించినందుకు గాను గతంలోనూ శాఖ పరంగా రెండు షోకాజ్ నోటీసులు కూడా అందుకున్నట్లు సమచారం. అందుకు విద్యార్థి సంఘాల నాయకులు ఆయనను బాలుడి మృతికి కారణమైన హాస్టల్ వార్డెన్ ని తక్షణమే విదుల నుండి తొలగించాలని డిమాండ్ (demand)చేశారు.