— జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి
District Collector Tripathi : ప్రజా దీవెన నల్గొండ : విద్యార్థులకు నాణ్యమైన భోజనం, గుణాత్మక విద్యను అందించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. బుధవారం ఆమె నల్గొండ జిల్లా, నిడమనూరు కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.
కేజీబీవీ ఆవరణను, మౌలిక వసతులు, వంటగది, డ్రైనేజీ సిస్టం, స్టోర్ రూమ్, అన్నింటిని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడి వారి విద్యా సామర్ధ్యాలను తెలుసుకోవడమే కాకుండా, వివిధ సబ్జెక్టులపై ప్రశ్నలువేసి జవాబులను కాబట్టి వారిని చైతన్యవంతం చేసి చాక్లెట్లు పంచారు.
విద్యాసంస్థల్లో విద్యార్థులకు అందిస్తున్న భోజనం విషయంలో రాజీ పడవద్దని, ఎక్కడా అపరిశుభ్రతకు తావివ్వవద్దని, మధ్యాహ్నం భోజనం నాణ్యతగా ఉండాలని, అదే విధంగా గుణాత్మక విద్యను అందించాలన్నారు. తాజా కూరగాయలు వాడడమే కాకుండా, ఎప్పటికప్పుడు వ్యక్తిగత పరిశుభ్రత పాటించే విధంగా విద్యార్థులను చైతన్యం చేయాలని, పాఠశాల ఆవరణలో శుభ్రంగా ఉంచుకోవాలని, వంటగది శుభ్రంగా ఉండాలని, తాగునీరు, భోజనం కలుషితం కాకుండా చర్యలు తీసుకోవాలని, ఎట్టి పరిస్థితుల్లో రాత్రి భోజనం మరుసటి రోజు విద్యార్థులకు పెట్టవద్దని చెప్పారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వంట గదిలోని వంట సరుకులను తనిఖీ చేశారు.
స్థానిక సంస్థల ఇన్చార్జ్ అదనపు కలెక్టర్, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, నిడమనూరు తహసిల్దారు, ఎంపీడీవో ,ఎంఈఓ, ఏఈ, తదితరులు ఉన్నారు.