Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Sub Court: రామన్నపేట సబ్ కోర్టు తరలిస్తే ఉద్యమం

Sub Court:ప్రజా దీవెన రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట (Ramannapet) మండల కేంద్రంలో మంజూరైన సబ్ కోర్టును (Sub Court) వెంటనే ప్రారంభించాలని అఖిలపక్షం డిమాండ్ (All-party demand) చేసింది. రామన్నపేటకు మంజూరైన సబ్ కోర్టును (Sub Court) వేరే ప్రాంతానికి తరలిస్తే ఉద్యమం తప్పదని హెచ్చరించింది. సోమవారం రామన్నపేట కేంద్రంలో అఖిలపక్షాల ఆద్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా అఖిలపక్ష నాయకులు మాట్లాడుతూ సిపిఎం, బిఆర్ఎస్ ,బిజెపి, కాంగ్రెస్, సిపిఐ, టిడిపి, బిఎస్పి పార్టీల నాయకులు (CPM BRS BJP Congress CPI TDP BSP Parties) అఖిలపక్షంగా ఏర్పడి సమావేశం రామన్నపేట లోనే వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో నాయకులు మేక అశోక్ రెడ్డి, జమీరుద్దీన్, బందేల రాములు వేమవరపు సుధీర్, కందుల హనుమంత్, జల్లల పెంటయ్య, బొడ్డుపల్లి వెంకటేశం, ఎస్కే చాంద్, దుర్గయ్య, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.