Sudhir Babu: ప్రజా దీవెన, నేరెడ్ మెట్: రాచకొండ పోలీస్ కమిషనరేట్ లో సీసీఎస్ విభాగంలో సబ్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తూ ఈ రోజు పదవీ విరమణ పొందిన శ్రీ ఏ. బాధ్యాకు సీపీ శ్రీ సుధీర్ బాబు (Sudhir Babu) ఐపీఎస్ గారు తన కార్యాలయంలో సన్మానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా సీపీ గారు మాట్లాడుతూ ఇన్ని రోజులు పోలీసుశాఖలో (Police Department) సమర్థవంతంగా క్రమశిక్షణతో పనిచేసి సేవలు అందించినందుకు అభినందించారు. పదవీ విరమణ (retirement) అనంతరం విశ్రాంత జీవితాన్ని ప్రశాంతంగా గడపాలని, ఆరోగ్యం పట్ల అధిక శ్రద్ధ చూపాలని, పెన్షన్ మరియు ఇతర ఆర్థిక అంశాల పట్ల క్రమశిక్షణ పాటించాలని సూచించారు. వారికి రావాల్సిన అన్ని రకాల ప్రయోజనాలు త్వరగా వచ్చే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమములో శ్రీమతి పి.ఇందిర, డీసీపీ అడ్మిన్, పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షులు సీహెచ్ భద్రా రెడ్డి, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.