Suicide : ప్రజా దీవెన ఖమ్మం: ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బుగ్గపాడు రావి చెరువులో దూకి వృద్ధ దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన శనివారం చోటు చేసుకుంది.స్థానిక పోలీసులు తెలి పిన వివరాల ప్రకారం బుగ్గపాడు గ్రామానికి చెందిన, పంతంగి కృష్ణారావు,(60) సీత (55) దంప తులు పిల్లలందరికీ వివాహం చేశా రు.ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్న కృష్ణారావు కుటుంబాని కి ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యా యి, దీంతో మనస్థాపానికి గురైన వృద్ధ దంపతులు చెరువులో శవ మై కనిపించారు.
శనివారం తెల్లవా రు జామున పొలానికి వెళ్తున్న రైతులు గ్రామానికి శివారులోని రావి చెరువులో రెండు మృతదేహా లను గుర్తించి పోలీసులకు సమా చారం అందించారు. ఘటనా స్థలా నికి చేరుకున్న పోలీసులు మృతదే హాలను స్థానికులు సహాయంతో బయటకు తీశారు. అనంతరం ఇద్దరి మృతదేహాలను పోస్టుమా ర్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.