Suicide: ప్రజా దీవెన, హైదరాబాద్: హైదరాబాద్‌లోని హబ్సిగూడ లో తీవ్ర విషాదం నెలకొంది. ఇద్దరు పిల్లలను చంపి దంపతులు ఆత్మ హత్య చేసుకున్న సంఘటన సం చలనగా మారింది. స్థానికుల సమా చారంతో విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన సంఘ టనస్థలికి చేరుకొని వివరాలు ఆరా తీశారు. మృతదేహాలను ఆసుపత్రి తరలించారు. కుటుంబం బలవన్మ రణానికి ఆర్థిక ఇబ్బం దులే కారణ మని పోలీసులు అనుమానిస్తు న్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
హైదరాబాదులోని హబ్సిగూడ లో నలుగురు కుటుంబ సభ్యులు ఆత్మహత్య చేసుకున్న సంఘటన కలకలం రేపింది. మొదట ఇద్దరు పిల్లలను చంపిన భార్యాభర్తలు ఆ తర్వాత ఉరేసుకున్నారని తెలు స్తోంది. విధిలేక చనిపోతున్నాం.. క్షమించండి అంటూ చనిపోయిన చంద్రశేఖర్ రెడ్డి ఇంట్లో సూసైడ్ లేఖ కలకలం రేపింది. ఓయూ పీఎస్ పరిధిలోని హబ్సిగూడ స్ట్రీట్ నెంబర్ 8లో ఈ ఘటన జరిగింది.
ఆర్థిక సమస్యలే కారణమై ఉండొచ్చని స్థానికులు అనుమానం వ్య క్తం చేస్తున్నారు.చoద్రశేఖర్ రెడ్డి కుటుంబం మొత్తం ఆత్మహత్య చే సుకుందని ఓయూ సీఐ రాజేందర్ పేర్కొన్నారు. హబ్సిగూడలోని ర వీంద్రనగర్ కాలనీలో ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకుందని రాత్రి 9:30కు సమాచారం వచ్చిందన్నారు ఓయూ సీఐ రాజేందర్. భార్యా భర్తలిద్దరూ ఉరి వేసుకున్నారు.
గతంలో ఓ ప్రైవేట్ కాలేజీలో జూ నియర్ లెక్చరర్‌గా పని చేసి ఉద్యో గం మానేసిన చంద్రశేఖర్ రెడ్డి కుమార్తె, కుమారుడికి ఉరి వేసినట్లు ప్రాథమికంగా తేలిందని చె ప్పారు. ఆర్థిక కష్టాల వల్లే ఆత్మహత్య చే సుకున్నట్లు సూసైడ్ నోట్లో పేర్కొన్నారన్నారు ఓయూ సీఐ రాజేం దర్. చనిపోయిన వారిలో చం ద్రశేఖర్ రెడ్డి, భార్య కవిత, కూతురు శ్రీత రెడ్డి 9వ తరగతి, కుమా రుడు విశ్వాన్ ఐదో తరగతి చదువు తున్నట్లు పోలీసులు గుర్తిం చారు.
పెరుగుతోన్న బలవన్మరణాలు….కొన్ని రోజుల క్రితం బెంగళూరులో అప్పుల బాధతో కుటుంబం ఆత్మ హత్య చేసుకోగా, ఇటీవల తమిళ నాడులోనూ ఇలాంటి ఘటనే చో టుచేసుకుంది. ఆన్లైన్ రమ్మీ ఆట కారణంగా ఓ కుటుంబం బలైం ది. అధికారులు, పోలీసులు ఎన్ని అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నా ఇలాంటి ఘటనలు రోజు కో చోట వెలుగుచూస్తూనే ఉండడం బాధాకరమన్న వ్యాఖ్యలు వినవ స్తున్నాయి.