Suicide : ప్రజా దీవెన, భద్రాద్రి కొత్తగూడెం: పాఠశాలల్లో అప్పర్ ప్రైమరీ విద్య నభ్యసిస్తున్న విద్యార్ధుల జీవితాల ను సెల్ ఫోన్ ఛిద్రం చేసింది. ఏడవ తరగతి చదువుతున్న బాలికతో 9వ తరగతి చదివే బాలుడు వా ట్సాప్‌లో చాట్ చేసిన పాపానికి ప్రాణాలు పణంగా పెట్టాల్సి వచ్చిం ది. వాట్సాప్ చాటింగ్ ను గమనిం చిన బాలిక కుటుంబసభ్యులు బా లుడిని బెదిరించడంతో భయపడ్డ బాలుడు ఆత్మహత్య చేసుకొన్నా డు. వివరాల్లోకి వెళ్తే..భద్రాద్రి కొత్త గూడెం జిల్లా మంచుపల్లి మండ లంలోని చుంచుపల్లి తండాకు చెం దిన తొమ్మిదో తరగతి చదువు తు న్న మనోజ్(15) అనే బాలుడికి, తన స్కూల్లోనే ఏడవ తరగతి చ దువుతున్న విద్యార్ధినితో చనువు ఏర్పడింది.
ప్రతి రోజు మనోజ్, తన తో వాట్సాప్‌లో చాటింగ్ చేసే వా డు. ఇది గమనించిన ఆమె కుటుం బసభ్యులు మనోజ్‌కు ఫోన్ చేసి బెదిరించారు. దీంతో భయపడిన మనోజ్ ఇంట్లో ఉన్న గడ్డి పురుగుల మందు తాగగా గమనించిన కు టుంబసభ్యులు ఖమ్మం ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.