suicide : ప్రజా దీవెన ఖమ్మం: ఖమ్మం గుమ్మంలో ఘోరం జరిగింది. కుటుంబ పెద్ద చేసిన తప్పుకు తమకు తాము శిక్ష వేసుకున్నారు కుటుంబంలోని మిగిలిన వారు. చేయనితప్పుకు ఖమ్మం జిల్లా మ ధిర మండలం నిదానపురంలో ఇద్దరు కుమార్తెలతో సహా తల్లి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
పోలీసులు తెలిపిన వివరాల మేరకు ఓ దొంగతనం కేసు లో భర్తను పోలీసులు అరెస్టు చేయడంతో అవమాన భారంతో ఆత్మహత్య చేసుకున్నట్లు బంధువులు తెలిపారు. సమాజం చీదరించుకునే దొంగతనం కేసులో భర్త అరెస్టు కావడంతో పరువు పోతుందన్న తొందరపాటు ఆలో చనతో భార్య ప్రేజా, కుమార్తెలు మెహక్, మెనురూల్ లు ఉరి వేసు కుని అసువులుబాసారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్న తర్వాత చెబుతు న్నారు.