–ఆరేళ్ల కొడుకును బావిలోకి తోసి తాను దూకిన తల్లి
— వికారాబాద్ జిల్లా గేటువనంపల్లి లో దుర్ఘటన
ప్రజా దీవెన, వికారాబాద్: వికారా బాద్ జిల్లాలో దారుణం జరిగింది. ఓ మహిళ ఆరేళ్ల వయస్సు ఉన్న తన కన్నకొడుకును బావిలోకి తో సేసి అనంతరం ఆమె కూడా బావి లోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఆ మహిళ తొలుత తన కూతురిని బావిలోకి నెట్టాలని ప్రయత్నించ గా.. ‘‘అమ్మా నన్ను చంపొద్దు ప్లీజ్’’ అని వేడుకోవడంతో ఆ చిన్నారిని వదిలేయడంతో ఆ బాలికతో ప్రాణాలతో మిగిలింది. వికారాబాద్ జిల్లా, నవాబ్‌పేట మండలం, గేటు వనంపల్లి గ్రామంలో ఈ ఘటన జరిగింది. పోలీసులు, కుటుంబ సభ్యులు, గ్రామ ప్రజల కథనం ప్రకారం.. గేటువనంపల్లికి చెందిన గుల్ల రాములు మోమిన్‌పేట మం డలం టేకులపల్లికి చెందిన అరుం ధ(32)ను 2008లో రెండో వివా హం చేసుకున్నాడు.
రాములు మొదటి భార్య అప్పటికే మరణిం చింది. రాములు, అరుంధ దంపతు లకు కూతురు ప్రజ్వల(11), కొడు కు రిత్విక్(6) ఉన్నారు. వ్యవసా య పనుల నిమిత్తం రాములు శని వారం పొలానికి వెళ్లగా గేటువ నంపల్లికే చెందిన శేఖర్ అనే వ్యక్తి తో అరుంధ ఫోన్‌లో మాట్లాడింది. అనంతరం సాయంత్రం నాలుగు గంటలప్పుడు ప్రజ్వల, రిత్విక్‌ను వెంటబెట్టుకుని పొలానికి బయలు దేరింది. దారిలో ఓ బావి వద్ద ఆగి శేఖర్‌తో మరోసారి ఫోన్‌లో మాట్లా డి గుడ్ బై చెప్పింది. ఆ తర్వాత ప్రజ్వలను బావిలోకి నెట్టేందుకు యత్నించగా చంపవద్దని ఆమె ఏడవడంతో వదిలేసింది.
అనం తరం రిత్విక్‌ను బావిలోకి తోసేసి ఆమె కూడా దూకేసింది. ఘటనా స్థలి నుంచి గ్రామానికి వచ్చిన ప్రజ్వ ల జరిగిన విషయం కుటుంబస భ్యులకు చెప్పగా బావి వద్దకు చేరుకున్నారు. అప్పటికే తల్లీకొ డుకులు చనిపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆదివా రం ఉదయం మృతదేహాలను వెలికి తీయించారు. మృతదేహాల ను పోస్టుమార్టం నిమిత్తం వికారా బాద్ ఆస్పత్రికి తరలించి అరుంధ తల్లి కమలమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేప ట్టారు.