Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Sunburns : భానుడి భగభగలు, బెంబేలెత్తుతో న్న తెలుగు ప్రజలు

Sunburns: ప్రజా దీవెన, హైదరాబాద్: వేసవి కాలం ప్రారంభం లోనే భానుడి భగభగలతో తెలుగు రాష్ర్టాల ప్రజలు బెంబేలెత్తుతు న్నారు. మార్చిలోనే ఇలా ఉంటే మే వచ్చే సరికి సూర్యని ప్రతాపం తారాస్థా యికి చేరుకొని ప్రజా ఆరోగ్యం ప్రభవితమయ్యే పరిస్థుతులు స్పష్టంగా కనబడుతున్నాయి. ఎండల తీవ్రత పట్ల నిర్లక్ష్యం వహిస్తే అంతే సంగతులు అంటున్నారు కాలమిస్ట్ యస్వర్ధన్. ఆయన సూ చిస్తోన్న కొన్ని సూచనలు ఆయ న మాటల్లోనే…రెండు తెలుగు రా ష్ట్రాలలో వేసవి కాలం మొదటి లోనే ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతున్నాయి. మార్చిలోనే ఇలా వుంటే ముందు ముందు ఇంకా ఎండలు తారాస్థాయికి చేరే అవకాశం ఉంది. దీంతో మే నెలలో వేసవిని ఎలా ఎదుర్కోవాలన్న భయాందోళన ప్రజలను వెంటాడోతుంది. గత ఏడాది ఇదే సమ యంలో గరిష్ట ఉష్ణోగ్రతలు 41 డిగ్రీలకు మించ లేదు. అయితే ప్రస్తుతం గరిష్ట ఉష్ణోగ్రత 43 డిగ్రీలు నమోదైంది. దీంతో ఇంట్లోంచి బయటకి రావా లంటే జనం భయపడి పోతున్నా రు. ఇళ్లలో కూడా ఉక్కపోతకు గురవుతు న్నా రు.

ఎండ తీవ్రత సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుండటం తో రోడ్లపై జనం పలచబడుతున్నారు. రోజువారి పనులు సైతం కొందరు ప్రజలు ఉదయమే వీలైనంత త్వరగా పనులు పూర్తి చేసుకుని ఇళ్ల కు పరి మితమవుతున్నారు.వేసవిలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల వల్ల వడ దెబ్బ, వ్యాధులు, వాటి లక్షణాలు, నివా రణ పై అప్రమత్తంగా ఉం డాలి. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ప్రాణాంతకంగా మారవచ్చు. పరి స్థితికి అనుగుణంగా ఆహారం, తాగునీరు తీసుకోవాలి. వడదెబ్బ బా రిన పడకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాలి.

ఎండ తీవ్రంగా ఉన్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

– ఎండ ఎక్కువగా ఉన్న రోజుల్లో గొడుగు తప్పనిసరిగా వాడాలి

– దూదితో నేయబడిన తెలుపు / లేత రంగు గల పలుచటి. వస్త్రాలను ధరించాలి.

* తల పై టోపి లేదా రుమాలు పెట్టుకోవాలి.

* ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు నీరు ఎక్కువగా సేవించాలి.

– ఉప్పు కలిపిన మజ్జిగ / చిటికెడు ఉప్పు కలిపిన గ్లూకోజు నీరు / ఓరల్ రీహైడ్రేషన్ ద్రావణము త్రాగవచ్చును.

– వడదెబ్బకు గురైన వారిని శీతల ప్రాంతానికి వెంటనే చేర్చాలి.

– వడదెబ్బకు గురైన వారివి చల్లని నీటిలో ముంచిన తడిగుడ్డతో శరీరం అంతా తుడుస్తూ ఉండాలి. శరీర ఉష్ణోగ్రత 101 డిగ్రీల కంటే తక్కువ స్థాయికి వచ్చేవరకు ఈ విధంగా శరీరాన్ని తుడుస్తూ ఉండాలి. ఫ్యాన్ క్రింద ఉంచాలి.

– వడదెబ్బకు గురైన వారి ఆరోగ్య పరిస్థితిలో ఆశించిన మార్పు లేనిచో శీతల వాతావరణంలో దగ్గర్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించాలి.

ఎండ తీవ్రంగా ఉన్నప్పుడు చేయకూడనివి.

– సూర్య కిరణాలకు, వేడి గాలికి ఎక్కువ గురి కాకూడదు.

– వేడిగా ఉన్న సూర్యకాంతిలో గొడుగు లేకుండా తిరగరాదు.

– వేసవిలో నలుపు/ముదురు రంగు దుస్తులు మందంగా ఉండే దుస్తులు ధరించరాదు.
– నెత్తిన టోపీ లేక రుమాలు లేకుండా సూర్యకాంతిలో తిరగరాదు.
– వడదెబ్బకు గురైన వారిని వేడినీటిలో ముంచిన గుడ్డతో తుడవరాదు.
– దగ్గర్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చేర్చుటలో ఏ మాత్రం ఆలస్యం చేయరాదు.

వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు పెరగడంతో పలు రకాల ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. దాహం, డీహైడ్రేషన్, వడదెబ్బ, జీర్ణ సమస్యలు, చర్మ వ్యాధులు వంటి సమస్యలు వేడికి సంబంధించిన ప్రతికూల ప్రభావాలుగా కనిపిస్తాయి.

వేసవి కాలంలో ఎక్కువగా వచ్చే ఆరోగ్య సమస్యలు

డీహైడ్రేషన్ & వడదెబ్బ :అధిక ఉష్ణోగ్రతల వల్ల శరీరంలో నీటి శా తం తగ్గిపోతుంది, దాంతో శరీరానికి అవసరమైన ఎలక్ట్రోలైట్స్ లో పించి వడదెబ్బ వచ్చే అవకాశం ఉంటుంది.ఎండలో ఎక్కువసేపు ఉన్నప్పుడే కాకుండా, తగినంత నీరు తాగకపోయినా డీహైడ్రేషన్ సమస్య ఏర్పడుతుంది.

 

వడదెబ్బ లక్షణాలు :తలనొప్పి, తల తిరగటం, తీవ్రమైన జ్వరం కలిగియుండటం, మత్తునిద్ర, కలవరింతలు, ఫిట్స్, పాక్షిక లేదా పూర్తి అపస్మారక స్థితి

ఆస్తమా & ఊపిరితిత్తుల సమస్యలు :వేసవిలో గాలి పొల్యూషన్ ఎక్కువగా ఉండడం వల్ల ఆస్తమా & శ్వాసకోశ వ్యాధులు ఎక్కువగా ప్రభావితం అవుతాయి.ధూళి, పొగ, పొల్యూషన్ ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో ఉండటాన్ని నివారించాలి.ఆస్తమా ఉన్నవారు తమ వెంట ఇన్హేలర్ & మెడిసిన్స్ తప్పనిసరిగా ఉంచుకోవాలి.

చర్మ సమస్యలు & అలర్జీలు :చెమట అధికంగా కారడం వల్ల చర్మం మురికితో ముడిపడి ఫంగల్ ఇన్ఫెక్షన్లు, రాషెస్ ఏర్పడతాయి.శోభి మచ్చలు (తినియా వెర్సికలర్) వేసవిలో అధికంగా ప్రబలతాయి. యూవీ రేడియేషన్ కారణంగా చర్మం కమిలిపోవడం, సన్‌బర్న్, మ చ్చలు ఏర్పడే ప్రమాదం ఉంది.

విరేచనాలు & కలరా :వేసవిలో భోజనం త్వరగా పాడవడం, నీటి కాలుష్యం పెరగడం వల్ల విరేచనాలు, కలరా వంటి సమస్యలు వ స్తాయి.రహదారి పక్కన ఉన్న ఆహారం, కలుషితమైన నీరు తాగడం వల్ల బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశముంది.

మూత్రనాళ ఇన్ఫెక్షన్లు & కిడ్నీ సమస్యలు:వేసవిలో నీటి తగ్గుదల వల్ల మూత్రంలో మలినాలు పేరుకుని యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లు సోకే అవకాశం ఉంటుంది.తగినంత నీరు తాగకపోతే కిడ్నీ రాళ్లు ఏర్పడే అవకాశం కూడా ఎక్కువ.

వేసవి జాగ్రత్తలు & నివారణ చర్యలు

– రోజూ కనీసం 3-4 లీటర్ల నీరు తాగాలి.
– ఒకసారి ఉడికించిన లేదా ఫిల్టర్ చేసిన నీరు తాగాలి.
– పొడిగా, వేడిగా ఉండే ఆహారాన్ని తగ్గించి, పండ్లు, కూరగాయలు ఎక్కువగా తినాలి.
– పొల్యూషన్ ఎక్కువగా ఉన్న ప్రదేశాలకు వెళ్లినప్పుడు మాస్క్ ధరించడం ఉత్తమం.
– పొడిపోతే ఊపిరితిత్తుల సమస్యలున్నవారు వైద్యుల సూచనల ప్రకారం ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి.
– కిడ్నీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎక్కువ నీరు తాగాలి, ఎక్కువ ఉప్పు ఉన్న ఆహారాన్ని తగ్గించాలి.
– ఎండలో ఎక్కువసేపు ఉండడం వల్ల సన్‌బర్న్, డీహైడ్రేషన్ సమస్యలు వస్తాయి, కాబట్టి సన్‌స్క్రీన్ వాడడం, హాట్ టైమ్‌లో బయటికి వెళ్లకుండా ఉండటం మంచిది.
– హైడ్రేటింగ్ ఫుడ్స్ (కాకర, దోసకాయ, ముజ్జిగ, కొబ్బరి నీరు) తినడం వల్ల వేడి తగ్గుతుంది.

వేసవిలో ప్రకృతి :వేసవి కాలం ప్రకృతిలో కూడా అనేక మార్పులను తీసుకొస్తుంది. చెట్ల ఆకులు పచ్చగా ఉండి, పశువులు నీటి ప్రదేశా లకు చేరుకోవడం, పక్షులు చెట్ల కింద విశ్రాంతి తీసుకోవడం వంటి దృశ్యాలను మనం చూస్తాం. వేసవిలో ప్రజలు ప్రకృతి ప్రేమను మ రింత అనుభూతి చెందుతారు, అదే సమయంలో ప్రకృతిని కాపాడు కునేందుకు చర్యలు తీసుకోవాలి.

సూర్యుడి వేడి ప్రభావం వేసవిలో మానవుని ఆరోగ్యానికి పెద్ద ము ప్పు కావచ్చు. దీన్ని నివారించేందుకు జాగ్రత్తలు తీసుకోవడం అవ సరం. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సరైన జాగ్రత్తలు పాటించడం, సురక్షితమైన వేళల్లో బయటకు వెళ్లడం చాలా ముఖ్యం. అలాగే ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహించకండి.