–నిర్మాణంలో ఉండగానే ఉన్నఫలంగా కుప్పకూలిన వైనం
–ఆ సమయంలో కార్మికులెవ రూ లేకపోవడంతో తప్పిన ప్రమాదం
–ప్రమాదం జరిగి వారం గడిచినా గోప్యత పాటించిన అధికారులు
Sunkishala Accident: ప్రజా దీవెన, నాగార్జున సాగర్: రాష్ట్ర రాజధాని హైదరాబాదు మహా నగరానికి భవిష్యత్ తాగు నీటి అవసరాలకు అనుగుణంగా నాగార్జున సాగర్ ప్రాజెక్టు (Nagarjuna Sagar Project) వద్ద నిర్మిస్తున్న సుంకిశాల ప్రాజెక్టులో ప్రమాదం సం భవించింది. డెడ్ స్టోరేజ్ నుంచి హైదరాబాద్ నగరానికి నీటిని తరలించేందుకు నల్లగొండ జిల్లా సుంకిశాల వద్ద నిర్మాణంలో ఉన్న గోడ కుప్ప కూలిoది. ఆగస్టు నెల ప్రారంభంలో భారీ ప్రమాదం జరిగితే సదరు విషయం బయటకు పొక్క కుండా అధికారులు గోప్యత పాటిం చడం పట్ల అనుమానాలు వ్యక్త మవుతున్నాయి. అయితే షిప్టు మా రుతున్న సమయంలో ప్రమాదం జరగడంతో భారీ ప్రాణనష్టం తప్పింది. ఈ నెల ఒకటో తేదీన ప్రమాదం జరిగినప్పటికీ అధికారులు గుట్టుగా ఉంచడానికి కారణమేమిటో అని పలువురు అనుమానం వ్యక్తం చేస్తు న్నారు. దాదాపు రూ. 2215 కోట్ల తో సుంకిశాల ప్రాజెక్టు (Sunkishala project)పనులు ప్రారంభమయ్యాయి. గోడ కూల డంతో మరో ఏడాది వరకు పనులు చేపట్టే అవకాశం లేకపోవడం గమనార్హం.
ప్రమాదం జరిగిన తీరు ఇలా…
నాగార్జున సాగర్ డెడ్ స్టోరేజ్ (Nagarjuna Sagar Dead Storage)నుం డి నీటిని సుంకిశాల పంప్ హౌస్ లోకి తరలించేందుకు టన్నెల్ కు అడ్డుగా గోడను నిర్మిస్తున్నారు. ఎగువ ప్రాంతం నుండి వచ్చిన వరద నీరు నిర్మాణంలో ఉన్న గోడపై ప్రవహించిందని, ఆ నీటి ఉధృతికి రిటైనింగ్ వాల్ కూలిపోయిందని తెలుస్తోంది. దీంతో సొరంగం ద్వా రా భారీగా నీరు పంప్ హౌస్ లోకి చేరుకుంది. నీటి ఉధృతికి పనులు కోసం ఉంచిన హిటాచీలు, ఇతర వాహనాలు సాగరంలోకి కొట్టుకు పోయాయి. కూలీలు షిఫ్ట్ మారిన సమయంలో అకస్మాత్తుగా రిటైనింగ్ వాల్ కూలిపోవడంతో భారీ ప్రాణ నష్టం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కాగా హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లైకి సాగర్ నుండి 270 బిలియన్ గ్యాలన్ల నీటిని ఏ ఎంఆర్పీ ద్వారా జలాలను తరలి స్తున్నారు. అయితే సాగర్‌లో నీటి నిల్వ తక్కువగా ఉన్న సమయంలో నీటిని తరలించే విషయంలో ఇబ్బం దులు తలెత్తుతుండడంతో డెడ్ స్టోరేజ్ నుండి హైదరాబాదుకు నీటి ని తరలించేందుకు సుంకిశాల వద్ద పనులను చేపట్టింది. గత ప్రభుత్వం హయాంలో రూ. 2215 కోట్లతో సుంకిశాల ప్రాజెక్టు పనులు ప్రారం భమయ్యాయి. సాగర్‌లో 480 అడుగుల డెడ్ స్టోరేజ్ లో నీటి నిల్వ ఉన్నప్పటికీ టన్నెల్ ద్వారా సుంకిశాల పంప్ హౌస్ ( pump house)లోకి ఆ నీటిని చేరుస్తారు.
అక్కడి నుండి మోటార్ల ద్వారా తోడి పైప్‌లైన్ (Pipeline) ద్వారా కోదండపూర్ కి నీటిని తర లిస్తారు. అక్కడి నుండి హైదరాబా ద్ నగరానికి కృష్ణా జలాలను తర లిస్తారు. ఈ క్రమంలో సొరంగం ద్వా రా పంపు హౌస్ లోకి నీరు రాకుం డా అడ్డుగా రిటైనింగ్ వాల్ నిర్మి స్తున్నారు. నిర్మాణంలో ఉన్న ఆ గోడే ప్రస్తుతం కూలిపోయింది. ఇదిలా ఉండగా ఈ నెల ఒకటవ తేదీన సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలిపోయినా విషయం బయటికి పొ క్కకుండా హెచ్ఎండబ్ల్యూఎస్ అధికారులు గుట్టుగా ఉంచారు. అక్కడ పనిచేసే కూలీలలో కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో విషయం బయ టకు పొక్కింది. సుంకిశాల పనులు జరుగుతున్న ప్రాంతం దట్టమైన అటవీ ప్రాంతంలో ఉండడంతో ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడం గమనార్హం.