Suresh: ప్రజా దీవెన, కోదాడ: కోదాడ సబ్ కోర్ట్ జడ్జిగా కే సురేష్ (Suresh) బుధవారం బాధ్యతలు స్వీకరించారు. సూర్యాపేట కోర్టు నందు జూనియర్ సివిల్ జడ్జిగా చేస్తూ పదోన్నతిపై సబ్ జడ్జిగా (Sub Judge) కోదాడ కోర్టుకు వచ్చిన సందర్భంగా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్వాగతం పలుకుతూ పుష్పగుచ్చాలు అందజేసి శాలువాతో ఘనంగా సన్మానించారు.సీనియర్ సివిల్ జడ్జి కోర్టుకు రెగ్యులర్ జడ్జిగా రావడం పట్ల బార్ అసోసియేషన్ సభ్యులు (Bar Association Presidents) సంతోషకరం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి భవ్య, సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ సత్యనారాయణ, బార్ అసోసియేషన్ అధ్యక్షులు (Bar Association Presidents) ఎస్ ఆర్ కె మూర్తి, ఉపాధ్యక్షులు గట్ల నరసింహారావు, సెక్రటరీ చింతకుంట్ల రామిరెడ్డి, పబ్లిక్ ప్రాసిక్యూటర్ సిలువేరు వెంకటేశ్వర్లు, సీనియర్ న్యాయవాదులువై సుధాకర్ రెడ్డి, పాలేటి నాగేశ్వరరావు, ఎడ్లపల్లి వెంకటేశ్వర్లు, తమ్మినేని హనుమంతరావు, శరత్ బాబు, ఈదుల కృష్ణయ్య, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ శ్రీధర్, వెంకటేశ్వర్లు, నవీన్, హేమలత, తదితరులు పాల్గొన్నారు.