Mahatma Gandhi University : ప్రజా దీవెన నల్లగొండ: మహాత్మా గాంధీ యూనివర్సిటీ పరిధిలోని ఉ మ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్త బి ఎ డ్, ఎంఎడ్, డిపిఈడి ఎంపీఈడి, బీపీఈడి కళాశాలలకు అప్లికేషన్లు అందజేసేందుకై ఈనెల 19 నుంచి 23 వరకు ఎంజియూ ఉపకులపతి ఆచార్య ఖాజా అల్తాఫ్ హుస్సేన్ ఆదేశాల మేరకు ఆయా కళాశాల లను తనిఖీ చేశారు. తనిఖీలు చే సినట్లు మహాత్మా గాంధీ యూనివ ర్సిటీ అకాడమిక్ ఆడిషన్ డైరెక్టర్ వై. ప్రశాంతి తెలిపారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడు తూ బీఈడీ, బీపీఈడి, యు జి డి పి డి, ఎంఈడి, ఎంపిఈడీ కళాశా లలో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సీని యర్ ప్రొఫెసర్, బోర్డ్ ఆఫ్ స్టడీస్ చై ర్మన్ తో కలిసి తనిఖీ చేసామని తె లిపారు. సమాజానికి పట్టుకొమ్మలు విద్యా శిక్షణ కళాశాలలోని వీటిలో నే భావి ఉపాధ్యాయులు తయార వుతారని తెలిపారు. అందుకే మా రుతున్న కాలానికి అనుగుణంగా బోధనా విధానంలో మార్పులతో ఛాత్రోపధ్యాయులకు( బీఈడీ ట్రై నింగ్ టీచర్ స్టూడెంట్) టిఎల్ఎం ఉపయోగించి బోధన సాగించాల న్నారు. అదేవిధంగా డిజిటల్ తర గతులను డిజిటల్ ఈ లెర్నింగ్ రి సోర్స్ ని ఉపయోగించి విద్యార్థుల ను అన్ని విధాలుగా సంపూర్ణంగా తయారు చేయాలన్నారు.
ప్రతి కళాశాలలో నూతన కరిక్యు లం అనుగుణంగా ల్యాబ్స్ అప్డేట్ చేయాలని, కళాశాల గ్రంథాల యం లో పుస్తకాలు అందుబాటులో ఉం చాలన్నారు. ఎన్సీఈఆర్టీ తోపాటు ఇతర ముఖ్యమైన అంశాల జనర ల్స్ తెప్పించాలన్నారు. టీచింగ్ ప్రా క్టీస్ ను విధిగా నిబంధనల మేరకు అమలు చేయాలని సూచించారు.
విద్యార్థులకు బయోమెట్రిక్ హాజరు అమలు చేయాలని, కంప్యూటర్ ల్యాబ్ ను ప్రస్తుత పరిస్థితులకు అ నుగుణంగా ఆధునీకరణ చేయాల న్నారు. కరియులంతోపాటు కో పరి క్రం యాక్టివిటీస్ సామాజిక అంశా లు టీచర్ లెర్నింగ్ మెటీరియల్స్ పైన అవగాహన కల్పించాలన్నారు.
యూనివర్సిటీ వీసీ, రిజిస్ట్రార్ ఆదే శాలను విధిగా పాటించాలని సూ చించారు. అధ్యాపకులకు ఓరియం టేషన్ శిక్షణ కార్యక్రమాలు చేయ డంతో పాటు నూతన విద్యా విధా నం ఘనంగా విద్యార్థులకు బోధిం చేలా సిద్ధం కావాలని కోరారు. కళా శాలల తనిఖీలలో ఓయూ సీనియ ర్ విశ్రాంత ప్రొఫెసర్, ఎంజియూ వి ద్యావిభాగం డీన్ ప్రొఫెసర్ రామ కృ ష్ణ, బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్ బి సు జాత, ఎంజియూ ఆడిట్ సెల్ అసి స్టెంట్ డైరెక్టర్ డాక్టర్ ఎం జయంతి తదితరులు పాల్గొన్నారు.