Surya Shilpa: ప్రజా దీవెన, శాలిగౌరారం: పౌష్టికాహారం (Nutritious food) తోనే ప్రతి ఒక్కరు ఆరోగ్యoగా ఉంటారని శాలిగౌరారం మండల వైద్యాధికారి డాక్టర్ సూర్య శిల్ప (Surya Shilpa) అన్నారు.శాలిగౌరారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో 9వ వారం గర్భిణీ స్త్రీలకు (pregnant women) పౌష్టికాహారాన్ని అందజేశారు. ఈ సందర్బంగా డాక్టర్ సూర్య శిల్ప మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలు నెల నెల ఆరోగ్య పరీక్షలు చేయించుకొని పుష్టికరమైన పౌష్టికాహారాన్ని తీసుకుని ఆరోగ్యాంగా ఉండా లన్నారు. ఈ కార్యక్రమం లో పౌష్టికాహర దాతలు మద్ది హరినాథ్ రెడ్డి, మద్ది వెంకటరెడ్డి -సునిత దంపతులు, పిహెచ్ఎన్ రాములమ్మ,సూపర్ వైజర్లు దయామణి, మరియా,సీనియర్ అసిస్టెంట్ కంచర్ల జగన్నాధరెడ్డి,లయన్స్ క్లబ్ చార్టర్ ప్రసిడెంట్ బుడిగె శ్రీనివాసులు,క్లబ్ సభ్యులు దునక వెంకన్న, దామెర్ల శ్రీనివాస్,క్లబ్ కోశాధికారి వడ్లకొండ బిక్షం,ఎఎన్ఎం లు, ఆశా వర్కర్లు (Asha workers)వివిధ గ్రామాల గర్భిణీ స్త్రీలు పాల్గొన్నారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.