Surya Vamshi Sensation :ప్రజా దీవెన, హైదరాబాద్: పద్నా లుగేళ్లకే పరుగుల వరద కురి పిం చాడు ఈ నూనూగు మీసాల నవ యువకుడు. అసలు 14 ఏళ్లకే ఐపీ ఎల్ ఆడటమంటేనే అదొక సంచల నం. అలాంటిది ఈ చిచ్చర పిడుగు ప్రత్యేకంగా సెంచరీ చేశాడు. అది కూడా అలా ఇలా కాదు. సిక్సర్లతో విధ్వంసం సృష్టించాడు. 35 బంతు ల్లోనే శతకం చేశాడు. రాహుల్ ద్రా విడ్ నమ్మకాన్ని నిలబెట్టాడు. అత డే వైభవ్ సూర్యవంశీ ఇండియన్ క్రికెట్‌లో ఇప్పుడు సరికొత్త సంచల నం.14 ఏళ్ల 23 రోజుల వయసులో నే ఐపీఎల్‌లోకి అరంగేట్రం చేసిన ‘వైభవ్ సూర్యవంశీ’ ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించాడు. 35 బంతుల్లో నే మూడంకెల మార్కు అందుకు న్నాడు. కనీవినీ ఎరుగని రీతిలో విధ్వంసం సృష్టించాడు.
హేమాహేమీ బౌలర్లను సైతం ఉతి కారేస్తూ.. ఐపీఎల్ చరిత్రలోనే రెం డో ఫాస్టెస్ట్ సెంచరీని నమోదు చేశా డు. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో వైభవ్ ఈ ఫీట్ సాధించాడు. ఐపీఎల్‌లో అడుగుపె ట్టిన వైభవ్ లక్నో సూపర్ జెయిం ట్స్‌తో తొలి మ్యాచ్ ఆడగా 20 బం తుల్లో రెండు ఫోర్లు, మూడు సిక్సర్ల తో 34 పరుగులు చేశాడు. అయితే ఆ మ్యాచ్‌లో స్టంపవుట్ అయిన వైభవ్ పెవిలియన్ చేరే సమయం లో ఏడ్చుకుంటూ వెళ్లటం అందరి నీ కదిలించింది. ఈరోజు మాత్రం తన కసిని, అసలైన సత్తాను చూ పించాడు వైభవ్. వైభవ్ చెలరేగి పోతుంటే, ముచ్చటపడ్డాడో ఏమో మరో ఎండ్‌లో యశస్వి జైశ్వాల్ అతడికి చక్కగా సహకరించాడు.
210 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్‌కు వైభవ్ సూర్యవంశీ అదిరే ఆరంభం ఇచ్చా డు. మహమ్మద్ సిరాజ్, ఇషాంత్ శర్మ, ప్రసిద్ధ్ కృష్ణ, రషీద్ ఖాన్ లాం టి బౌలర్లను ఊచకోత కోశాడు. 17 బంతుల్లో హాఫ్ సెంచరీ కొట్టిన ఈ కుర్రాడు.. మరో 18 బంతుల్లో మరో సారి ఫిఫ్టీ మార్కు అందుకున్నాడు. దీంతో 35 బంతుల్లోనే సెంచరీ చేసి ఐపీఎల్ చరిత్రలో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన భారతీయ క్రికెటర్‌గా నిలిచా డు. తన ఇన్నింగ్స్‌లో ఐపీఎల్ చరి త్రలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానా న్ని దక్కించుకున్నాడు. చివరకు 38 బంతుల్లో 101 రన్స్ చేసి ఔట్ అయ్యాడు.
ఐపీఎల్ మొదలయ్యేనాటికి పుట్టనేలేదు 2011లో బీహార్ లోని తాజ్‌పుర్ గ్రామంలో సూర్య వంశీ జన్మించాడు. ఎంఎస్ ధోనీ సా రథ్యంలో భారత క్రికెట్ జట్టు వన్డే ప్రపంచకప్ విజేతగా నిలిచిన నా టికి వైభవ్ వయస్సు కేవలం 5 రో జులు. ఐపీఎల్ 2008లో ప్రారంభం కాగా అప్పటికింకా వైభవ్ పుట్టనే లేదు. ఐపీఎల్ ప్రారంభమైన మూ డేళ్లకు పుట్టాడు. సూర్యవంశీ తం డ్రి ఒక రైతు. నాలుగేళ్ల వయసులో నే వైభవ్ క్రికెట్ బ్యాట్ పట్టడం చూ సిన అతడి తండ్రి. ప్రత్యేకంగా మై దానాన్ని తయారు చేయించారు.
ఆ తర్వాత క్రికెట్‌లో రాణిం చిన వైభవ్.. పదేళ్లు కూడా నిం డకుండానే అండర్-16 జట్టులోకి వచ్చేశాడు. ఈ ఏడాది చెన్నైలో ఆ స్ట్రేలియాతో జరిగిన భారత్ అం డర్-19 యూత్ టెస్టులో 62 బం తుల్లో 104 పరుగులు చేసి క్రికెట్ ప్రపంచాన్ని తన వైపునకు తిప్పుకు న్నాడు. దీంతో అండర్-19 టెస్టు క్రికెట్‌లో వేగవంతమైన సెంచరీ కొ ట్టిన భారతీయుడిగా నిలిచాడు. తాజా ఇన్నింగ్స్‌తో మరోసారి ప్ర పంచం దృష్టిని ఆకర్షించాడు.
నిజానికి వైభవ్ సూర్యవంశీ ఐపీ ఎల్ 2025 మెగావేలంలోనే చరిత్ర సృష్టించాడు. 13 ఏళ్ల వయసులో నే సూర్యవంశీ వేలంలోకి వచ్చా డు. అతడి ప్రతిభను మెచ్చిన ఫ్రాం ఛైజీలు అతడి కోసం పోటీ పడ్డా యి. రాజస్థాన్ రాయల్స్ కోచ్ రా హుల్ ద్రవిద్ అతడిని ఏరి కోరి తీ సుకున్నాడు. రూ. 30 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చిన వైభవ్‌ను రాజస్థాన్ రాయల్స్ రూ. 1.10 కోట్ల కు సొంతం చేసుకుంది. మేనేజ్ మెంట్ అంచనాలను అందుకుం టూ అతడు సత్తా చాటుతున్నా డు.
వైభవ్ సూర్యవంశీ మెరుపు శత కంతో విరుచుకుపడటంతో ఈ మ్యాచ్‌లో 210 పరుగుల లక్ష్యాన్ని రాజస్థాన్ రాయల్స్ 15.5 ఓవర్ల లోనే కేవలం 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. వైభవ్ సూర్యవంశీ (101)తో పాటు యశస్వి జైశ్వాల్ (70 పరుగులు, 40 బంతుల్లో, నా టౌట్) బ్యాట్ ఝుళిపించడంతో ఘన విజయం సాధ్యమైంది. అంత కుముందు తొలుత బ్యాటింగ్ చే సిన గుజరాత్ టైటాన్స్.. 4 వికెట్ల నష్టానికి 209 రన్స్ చేసింది. ఈ మ్యాచ్‌లో గెలిచి పాయింట్స్ టేబు ల్‌లో అగ్రస్థానానికి దూసుకెళ్లాలనే గుజరాత్ టైటాన్స్ ఆశలకు రాజస్థా న్ కళ్లెం వేసింది.