Suryapet Collector Tejas Nandalal Pavar : టీబీ రహిత జిల్లాగా మార్చేందుకు ప్రతి ఒక్కరు భాగస్వామ్యులు కావాలి: జిల్లా కలెక్టర్
Suryapet Collector Tejas Nandalal Pavar : ప్రజా దీవెన, కోదాడ: టీబీ రహిత జిల్లాగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ డియం అండ్ హెచ్ ఓ కోట చలం అన్నారు ప్రపంచ క్షయ నివారణ దినోత్సవం పురస్కరించుకొని సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో టీబీ నిర్మూలనపై అవగాహన టిబీ వ్యాధి తగ్గించుటలో కృషిచేసిన వైద్య సిబ్బందికి ప్రశంసా పత్రాలు మెమొంట్ లు అందజేసే కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి వారు ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు టీబీ వ్యాధి నిర్మూలనకు ప్రభుత్వం ప్రతి సంవత్సరం ప్రత్యేక కార్యక్రమాలుతో ప్రజలను చైతన్య పరుస్తూ టీబీ ని తగ్గించేందుకు పటిష్ట ప్రణాళికలు తీసుకుంటుందని తెలిపారు టీబీ సోకిన రోగులు ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లి పరీక్షలు చేయించుకొని ప్రభుత్వం అందించే మందులను వాడి టీబీ ని తగ్గించుకోవాలని తెలిపారు.
అనంతరం టీబీ నివారణకు కృషిచేసిన వైద్యులకు ప్రశంసా పత్రాలు మెమొంటాలను అందజేశారు ఈ కార్యక్రమములో డిప్యూటీ డిఎంహెచ్వో జయ మనోహరి, చాతి వైద్య నిపుణులు పాపిరెడ్డి, సూపర్డెంట్ శ్రీనివాసులు, ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ శ్రీశైలం డాక్టర్ అశ్రీతారెడ్డి ,తదితరులు పాల్గొన్నారు