SP Narasimha : ప్రజాదీవెన, సూర్యాపేట: నషా ము క్త్ భారత్ అభియాన్, మాదకద్ర వ్యాల రహిత భారతదేశ నిర్మాణం కార్యక్రమంలో భాగంగా బుధవారం సూర్యాపేట పట్టణంలో గల జయ పాఠశాల నందు విద్యార్థులకు అవ గాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా డ్రగ్స్ నిర్మూలనలో భాగస్వామ్యం అవుతామని, దృఢ మైన సమాజ నిర్మాణంలో భాగస్వా మ్యం అవుతామని, చెడు అలవాట్ల కు దూరంగా ఉంటామని విద్యార్థు లచే ప్రతిజ్ఞ చేయించడం జరిగినది.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మన ఆలోచనలను, అలవాట్లను నియంత్రనలో ఉంచుకోవాలని, వి ద్యార్థులు స్వీయ నియంత్రణ కలిగి ఉండాలని అన్నారు.
మాదకద్రవ్యాల రహిత సమాజం గా తీర్చిదిద్దడంలో విద్యార్థులు, పౌ రులు ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉం డాలని తెలిపారు. పోలీసు ప్రజా భ రోసా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్ర జలను చైతన్య పరుస్తున్నామని అ న్నారు. యువత జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగడానికి కష్టపడి చద వాలని తల్లిదండ్రులు గురువుల మాటలు వింటూ వారి బాటలో ప యనిస్తూ తమ ఆశయ సాధన కో సం యువత కృషి చేయాలని అ న్నారు, ప్రముఖ ఆర్థికవేత్త అమ ర్త్యసేన్ చెప్పినట్లుగా దేశ భవిష్య త్తు యువత మీద ఆధారపడి ఉం దన్నారు, ఆలాంటి యువత డ్రగ్స్ మత్తులో భవిష్యత్తు కోల్పోతున్నా రు డ్రగ్స్ మత్తులో యువశక్తి నిర్వి ర్యం అవుతందన్నారు.
దేశ ప్రగతికి యువత పునాదని అ న్నారు. యువత కష్టపడి చదవా లని తల్లిదండ్రుల ఆశయ సాధన కో సం కృషి చేయాలని, చెడు మార్గం లో పయనించవద్దని కోరారు. డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, డ్రగ్స్ కు బానిసలు కా వద్దని ఎవరైనా చెడు మార్గంలో వె ళ్తున్నప్పుడు తల్లిదండ్రులు దండిస్తా రని, వారి మాటల విని చెడు స్నేహా లను వదులుకోవాలని అన్నారు. యువత కష్టాలను ఎదుర్కొని వి జయాలు సాధించడానికి కృషి చే యాలని అన్నారు. ప్రముఖ శాస్త్ర వేత్త అబ్దుల్ కలాం ఏపీజే అబ్దుల్ కలాం గారి జీవితం సాధించిన వి జయాల గురించి వివరించి విద్యా ర్థులను మోటివెట్ చేశారు.
జీవితంలో ఒక ఉన్నత లక్ష్యాలు పె ట్టుకొని వాటి సాధన కోసం నిరంత రం కూడా కృషి చేయాలని ఆయన అన్నారు. మనం ఏదైనా సాధించా లంటే ముందుగా ప్రణాళిక సిద్ధం చేసుకుని క్రమశిక్షణతో కష్టపడాలని నీకు నీవే యుద్ధానికి తయారు కా వాలని, మీ అందరిని మంచి పౌ రు లుగా చూడాలన్నది మా ఆశ ఆకాం క్ష అన్నారు. విద్యాబుద్ధులు నేర్పి ఉ న్నతమైన పౌరులుగా తీర్చిదిద్దే బా ధ్యత గురువులది అయితే, సమా జంలో నేర ప్రవృత్తి కలిగిన వారిని సత్ప్రవర్తన కలిగిన పౌరులుగా మార్చడం పోలీసుల విధి అన్నారు.
మాదకద్రవ్యాల ప్రభావము సోషల్ మీడియా ప్రభావము రోడ్డు ప్రమా దాలు ఇలా సామాజిక అంశాలపై పోలీసు కళాబృందం పాటలతో అ వగాహన కల్పించారు.ఈ కార్యక్ర మంలో స్థానిక ఎస్సైలు ఏడుకొండ లు శివతేజ పాఠశాల యజమాన్యం ప్రిన్సిపాల్ ఉపేందర్ ఉపాధ్యాయు లు విద్యార్థులు సిబ్బంది పాల్గొన్నా రు.