Road incidents :ఘోర రోడ్డు ప్రమాదాల్లో పది మంది మృత్యువాత
లంగాణలో బుధవారం జరిగిన రెండు వేర్వేరు ఘోర రోడ్డు ప్రమాదాలలో పదిమంది మృత్యు వాత పడ్డారు.
సూర్యాపేట, వరంగల్ జిల్లాల్లో వేర్వేరు సంఘటనలు
ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగాణలో బుధవారం జరిగిన రెండు వేర్వేరు ఘోర రోడ్డు ప్రమాదాలలో పదిమంది మృత్యు వాత పడ్డారు.సూర్యాపేట జిల్లా(Suryapet district) కోదాడ పట్టణంలోని దుర్గాపురం స్టేజి సమీపంలో హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారిపై తెల్లవారుఝామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు అసువులు బాయగా, వరంగల్ జిల్లా వర్ధన్న పేట పట్టణ శివారు ఆకేరు వాగు వంతెన వద్ద చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదoలో నలుగురు ప్రాణా లోదిలారు.
ఈ రెండు రోడ్డు ప్రమా దాలలో మొత్తంగా పది మంది మృత్యువాత పడడం ఆయా కుటుంబాలను శోక సముద్రంలో ముంచింది. సూర్యాపేట జిల్లా కోదాడ(Kodada) సమీపంలో లారీని వెనక నుండి కారు ఢీకొట్టడంతో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు మృతి అక్కడికక్కడే మరణించారు. కారు లో నలుగురు పురుషులు, ఒక మహిళ, పాప ప్రయాణిస్తుండగా వీరంతా హైదరాబాదు నుండి విజయవాడ వెళుతున్నట్టు సమాచారం. లారీ బ్రేక్ డౌన్ కావడంతో లారీ రోడ్డుపై హైవే పక్కనే నిలబడంతో ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు తెలిపారు.
గడిచిన మూడు, నాలుగు రోజుల క్రితం కూడా ఇదే తరహాలో టిప్పర్ కారు ఢీకొనడంతో యువ జంట మృతి చెందిన సంఘటన జరిగింది. ఆ సంఘటన మరువకముందే మరోసారి కోదాడ ప్రాంతంలో ప్రమాదం జరగడం అందరినీ కలిచివేసింది. ఎండాకాలం కావ డంతో సుదూర ప్రాంతాలకు ప్రయా ణించే వాళ్ళు రాత్రిపూట ప్రయా ణాలు సాగిస్తుండడం, రోడ్డుపై ఆగి ఉన్న వాహనాలను గమనించకపో వడంతో ఈ ప్రమాదాలు జరుగుతు న్నాయి. కాగా సూర్యాపేట జిల్లాలో రోడ్డు ప్రమాదంలో ఆరుగురు అక్క డికక్కడే మరణించారు. మరో ఇద్ద రికి తీవ్రగాయాలయ్యాయి. ఆగి ఉన్న లారీని వేగంగా వచ్చిన కారు ఢీకొట్టడoతో ఈ దుర్ఘటన సూర్యా పేట జిల్ల కోదాడ దుర్గాపురం వద్ద చోటుచేసుకుంది.
హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళుతుం డగా ఈ ప్రమాదం చోటు చేసు కుంది. అతి వేగం, నిద్రలేమి కారణంగానే ప్రమాదo చోటుచే సుకుందని పోలీసులు నిర్ధారించా రు. పోలీసులు ఘటన స్థలికి చేరు కుని మృతదేహాలను ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తంతరలించారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిoచారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.
వరంగల్ జిల్లాలో విషాదం..
వరంగల్ జిల్లాలో(Warangal district) మరో విషాధ సంఘటన చోటుచేసుకుంది. ఇంటర్మీడియట్ ఫలితాల తర్వాత పాసయ్యామన్న ఆనందం పంచు కుందామని అనుకున్న వారికి కొద్ది క్షణాల్లోనే ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. బైక్‌ను ప్రైవేటు బస్సు ఢీకొనడంతో నలుగురు ఇంటర్ విద్యార్థులు మృతి చెందారు. ఈ ఘటన వర్ధన్నపేట పట్టణ శివారు ఆకేరు వాగు వంతెన వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
వరంగల్ జిల్లా వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై బైక్‌ను(Bike) ప్రైవేట్ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మరణిం చగా మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ప్రమా దంలో మరణించిన నలుగురు ఇంటర్ విద్యార్థులేనని పోలీసులు తెలిపారు. ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలిం చారు.వర్ధన్నపేటకు(Vardhanna peta) చెందిన పొన్నం గణేశ్, ఇల్లంద గ్రామానికి చెందిన మల్లేపాక సిద్ధు, వరుణ్ తేజ్, పొన్నాల రనిల్ కుమార్‌లు ఒకే బైక్పై ఇల్లంద నుంచి వర్ధన్నపేట వైపు వెళుతుండగా ఎదురుగా వస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ కొట్టింది.
ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే చనిపోగా తీవ్రంగా గాయపడిన ఓ విద్యార్థి ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. వీరిలో గణేశ్ ఇంటర్ ఫలితాల్లో ఉత్తమ మార్కు ల తో పాస్ కాగా మిగతా ముగ్గురి తో కలిసి పార్టీ చేసుకున్నాడు. అలా ఒకే బైక్ పై నలుగురు వెళ్తున్న సమ యంలో ఈ ఘటన చోటుచేసు కుంది. ఘటనా స్థలం వద్ద మలుపు ఉండటం రెండు వాహనాలు వేగం గా రావడంతో ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు.
Suryapet Warangal Vardhanna Peta Kodada