Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Suspension of BRS MLAs: క్షమాపణతోనే క్షమిస్తాం

–సీఎం చాంబర్‌ వద్ద బిఆర్ఎస్ ఎమ్మెల్యేల బైఠాయింపు
–అసెంబ్లీ నుంచి మోసుకుంటూ బయటకు తెచ్చిన మార్షల్స్‌
–అరెస్టు చేసి తెలంగాణ భవన్‌కు తరలింపు

Suspension of BRS MLAs: ప్రజా దీవెన, హైదరాబాద్‌: బి ఆర్ ఎస్ మహిళా ఎమ్మెల్యేలపై (BRS women MLAs) సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy)అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల నిరసనలతో రెండో రోజూ అసెంబ్లీ హోరెత్తింది. గురువారం ఉదయం కేటీఆర్‌, హరీశ్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, ఇతర ఎమ్మెల్యేలు (KTR, Harish Rao, Vemula Prashant Reddy and other MLAs) నల్లబ్యాడ్జీలు ధరించి సభలోకి వచ్చారు. సభ ప్రారంభం కాగానే స్పీకర్‌ పోడియం వద్దకు దూసుకెళ్లి నినాదాలు చేశారు. ముగ్గురు మహి ళా సభ్యులు సబితా ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మారెడ్డి, కోవా లక్ష్మి సభ జరుగుతున్నంత సేపు శాసన సభా కార్యదర్శి టేబుల్‌ ఎదుట నిల్చొని నిరసన తెలిపారు. సీఎం రేవంత్‌రె డ్డి క్షమాపణ చెప్పాలి, సీఎం డౌన్‌ డౌన్‌, సీఎం అహంకారపూరిత వైఖ రి నశించాలoటూ నినదించారు.

ఈ అరుపులు, కేకల మధ్యనే ‘స్కిల్‌ యూనివర్సిటీ బిల్లు’(The Skill University Bill)ను మంత్రి శ్రీధ ర్‌బాబు సభలో ప్రవేశపెట్టారు. బిల్లు సారాంశాన్ని మంత్రి వివరిస్తుండగా వివరణ అక్కర్లేదంటూ హరీశ్‌రావు, కేటీఆర్‌ లేచి నిలబడి, నినాదాలు చేశారు. దీంతో స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌ (Prasad Kumar) జోక్యం చేసుకొని సభ నడవాలని లేదా సభా మర్యాదను కాపాడాలని లేదా అంటూ మండిపడ్డారు. బీఆర్‌ ఎస్‌ సభ్యులపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. యువత భవిష్యత్తు కోసం స్కిల్‌ వర్సిటీ బిల్లు పెడితే స్వాగతించ కుండా నిరసనలేంటని ఆక్షేపించా రు. పదేళ్లు అధికారంలో ఉన్న వా రు నిబంధనలకు విరుద్ధంగా సభలో నినాదాలు చేయడం తగదని మం త్రి శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి మాట్లాడు తూ బీఆర్‌ఎస్‌ సభ్యుల ఆందోళన మంచి పద్ధతి కాదని అన్నారు. దీం తో బీజేపీ, కాంగ్రెస్‌ను ఉద్దేశించి బడే భాయ్‌, చోటా భాయ్‌ ఏక్‌ హోగయా అంటూ బీఆర్‌ఎస్‌ సభ్యు లు నినదించారు. ఆ తర్వాత ఎస్సీ వర్గీకరణపై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌రావు (Harish Rao)మాట్లాడుతూ ఇది పూర్తి గా కౌరవ సభగా మారిందని, అంతి మంగా పాండవులదే విజయమని అన్నారు. స్కిల్‌ వర్సిటీ ఏర్పాటుకు తమ పార్టీ మద్దతు ఇస్తుందన్నారు.

సీఎం చాంబర్‌ (CM Chamber)వద్ద బైఠాయిం పు …సభలో నిరసన తర్వాత కేటీఆర్‌ ఆధ్వర్యంలో హరీశ్‌రావు, ప్రశాంత్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, గంగుల కమలాకర్‌, పద్మారావు, పాడి కౌశిక్‌ రెడ్డి, అనిల్‌జాదవ్‌, పల్లా రాజేశ్వర్‌ రెడ్డి సీఎం చాంబర్‌ వద్ద బైఠాయిం చారు. దీంతో మార్షల్స్‌.. వారందన్నీ మోసుకుంటూ వెలుపలకు తీసుకు రాగా పోలీసులు అరెస్టు చేసి తెలం గాణ భవన్‌కు తరలించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ సీఎంగా రేవంత్‌ అన్‌ఫిట్‌ అని విమ ర్శించారు. కాగా, సీఎం చాంబర్‌ ఎ దుట నిరసన వీడియో బయటకు రావడంపై సీరియస్‌ అయ్యారని వినికిడి.