సరిహద్దులో రాకపోకలు నిలిపివేత
ప్రజా దీవెన/ అదిలాబాద్: ఉత్తర తెలంగాణ ఆదిలాబాద్ జిల్లా లో గత నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు పెనుగంగ ఉగ్రరూపం దాల్చింది. తెలంగాణ సరిహద్దులో ఉన్న పెనుగంగా వంతెనను ముద్దాడుతూ వరద నీరు ప్రవహిస్తుండడంతో అప్రమత్తమైన జిల్లా అధికారులు పెనుగంగ బిడ్జ్ మీదుగా వెళ్లే భారీ వాహనాలను ఎక్కడికక్కడ నిలిపివేశారు.
దీంతో ఎక్కడికక్కడ వాహనాలు స్తంభించి కిలోమీటర్ల మేరకు ట్రాఫిక్ నిలిచిపోయింది. టిప్పర్ వాడ టోల్ ప్లాజా దగ్గర వాహనాలను నిలిపివేయడంతో మహారాష్ట్ర వెళ్లే ప్రయాణికులు ఇబ్బందులకు గురి అయ్యారు.