Syed Fariduddin: ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: నల్లగొండ జిల్లా కేంద్రానికి చెందిన ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమ నాయకులు సయ్యద్ ఫరీదోద్దీన్ (Syed Fariduddin )తీవ్ర అనారోగ్యంతో చికిత్స పొందు తూ మంగళవారం సాయంత్రం మరణించారు. ఆయన మృతి పట్ల నల్గొండ మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి తీవ్ర సంతా పాన్ని వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కొరకు అనేక ఉద్యమాలలో పాల్గొని క్రియాశీలకంగా వ్యవహరించారని గుర్తు చేశారు. ఫరీదోద్దీన్(Syed Fariduddin) మరణం బి ఆర్ ఎస్ పార్టీకే (BRS party)కాకుండా తనకు వ్యక్తిగతంగా తనకు తీవ్ర మైన లోటని తనతో అత్యంత సన్నిహి తంగా ఉండేవారని అన్నారు. మైనార్టీ వర్గాలను పార్టీ వైపు మొగ్గు చూపే విధంగా తీవ్రమైన కృషి సలిపారని, పార్టీ కోసం నిస్వార్ధంగా పనిచేసిన వ్యక్తి అని కొనియాడారు. ఏనాడూ తనకోసం ఏదీ అడగని నిజాయితీ కలిగిన నాయకుడని అన్నారు. ఫరీదొద్దీన్ మరణం తీవ్రంగా కలిచి వేసిందని, ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తు న్నామని, వారి కుటుంబ సభ్యుల కు ప్రగాఢ, సానుభూతిని సంతా పాన్ని తెలియచేస్తున్నామని తెలియజేశారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.