Taekwondo 13 : ప్రజా దీవెన, హైదరాబాద్: టైక్వాం డో13 ఓపెన్ స్టేట్ లెవెల్ కాంపిటీ షన్ లో గోల్డ్ మెడల్ టైక్వాండో13 ఓపెన్ స్టేట్ లెవెల్ కాంపిటీషన్ లో గోల్డ్ మెడల్ సాధించారు నల్లగొండ జిల్లా వాసులు. హైదరాబాదులోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం లో హైదరాబాద్ జిల్లా టైక్వాండో అ సోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వ హించిన 13 ఓపెన్ స్టేట్ లెవెల్ కాంపిటీషన్ లో నల్లగొండ పట్టణం మీర్ కాలనీకి చెందిన మహమ్మద్ మాలిక్ ముగ్గురు కుమారులు గోల్డ్ మెడల్స్ సాధించారని కోచ్ యూనుస్ కమాల్ తెలిపారు.
37 కిలోల విభాగంలో సులేమాన్ మాలిక్, 30 కిలోల విభాగంలో యౌషా ఫజల్, 22 కిలోల విభాగంలో అబ్దుల్ రెహమాన్ జకారియా గోల్డ్ మెడల్ సాధించారు. ఓకే కుటుంబంలో ముగ్గురు అన్నదమ్ములు గోల్డ్ మెడల్ సాధించడం పట్ల పలువురు వారికి అభినందనలు తెలిపారు.