స్వచ్ఛతనం, పచ్చదనం కార్యక్రమం .
Tara Singh: ప్రజా దీవెన, కోదాడ: మానవ మనుగడకు మొక్కలు జీవనాధారం అని కందగట్ల ప్రభుత్వ ఆస్పటల్ వైద్యాధికారి బంకా వీరేంద్రనాథ్ గ్రామ స్పెషల్ ఆఫీసర్ తారాసింగ్ (Tara Singh) అన్నాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛతనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఆత్మకూరు ఎస్ మండల పరిధిలోనిన కందగట్ల గ్రామంలోని మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు అలాగే గ్రామములో నీరు నిలువ ఉన్న ప్రదేశాలలో ఆయిల్ బాల్స్ (Oil balls) వేయడం జరిగింది.
ఈ సందర్భంగా గ్రామ ప్రజలను పాఠశాల విద్యార్థులను ఉద్దేశించి వారు మాట్లాడుతూ ప్రజలు సీజనల్ వ్యాధుల (Seasonal diseases) పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలిపారు పరిసర ప్రాంతాలను వారి నివసించే ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకున్నట్లయితే వ్యాధులు (Seasonal diseases) రాకుండా జాగ్రత్త తీసుకోవచ్చు అని తెలిపారు మొక్కలు నాటి వాటిని సంరక్షించినట్లయితే అవి పెరిగి పెద్దవయి మంచి ఆక్సిజన్ ఇస్తాయని ఈ మొక్కలు మానవ కోటికి జీవనాధారానికి ఎంతగానో దోహదపడతాయని తెలిపారు ఈ కార్యక్రమములో ప్రైమరీ పాఠశాల ప్రిన్సిపల్ రామాంజనేయులు, గ్రామ సెక్రెటరీ భాస్కర్ రెడ్డి ,ఐసిటి గ్రీన్ క్రాస్ కోఆర్డినేటర్ రవీందర్ కృష్ణారెడ్డి, ఏఎన్ఎం అరుణ ,ఆశాలు ,వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు