–పిఆర్ టియూ రాష్ట్ర ప్రధాన కార్య దర్శి సుంకరి బిక్షం గౌడ్ డిమాండ్
FRS Issue : ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: ఉపా ధ్యాయులు ఎదుర్కొంటున్న ఆర్థిక, ఆర్దికేతర సమస్యల పరిష్కారమే ధ్యేయంగా రాష్ట్ర శాఖ పనిచేస్తుం దని పిఆర్ టియూ రాష్ట్ర ప్రధాన కా ర్యదర్శి సుంకరి బిక్షంగౌడ్ తెలిపా రు. రాబోయే కొన్ని రోజుల్లో అన్ని స మస్యలను పరిష్కరించే విధంగా రాష్ట్ర శాఖ పనిచేస్తుందని తెలియ జేశారు. ప్రధానంగా 317 G.O. స మస్య కోసం తీవ్రంగా కృషి చేస్తు న్నానన్నారు. ఆదివారం పిఆర్ టి యు టిఎస్ జిల్లా సర్వసభ్య సమా వేశo పటేల్ గార్డెన్స్ లో నిర్వహించ డం జరిగినది. ఈ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.
తప్పకుండా రాబోయే రోజుల్లో సిపి ఎస్ అంతమయ్యే వ రకు కృషి చే స్తామని, నెలకు కనీసం రూ. 700 కోట్లని విడుదల చేయాలని త ద్వా రా బకాయిలను చెల్లించేందుకు అ నుకూలంగా ఉంటుందని గుర్తు చే శారు. రాబోయే రోజుల్లో సిపిఎస్ అంతమయ్యే వరకు పిఆర్ టి యు పోరాటం ఆగబోదని తెలిపారు.
అంతకు ముందు ఈ సమావేశానికి సభాధ్యక్షత వహించిన ఏటుకూరి శ్రీనివాసరావు జిల్లాలోని పలు స మస్యలను రాష్ట్ర శాఖకి నివేదించ డం జరిగినది. 317 సమస్య వల్ల నష్టపోయిన అందరికి అనగా డిస్లో కేటెడ్ మరియు నాన్-డిస్లోకేటెడ్ వారి పట్ల అనుకూలమైన నిర్ణయా న్ని ప్రకటించాలని, సిపిఎస్ రద్దు, ఉపాధ్యాయులకు తలనొప్పిగా మా రిన ఎఫ్ఆర్ఎస్ సమస్య పట్ల వెం టనే చర్యలు తీసుకోవాల్సిందిగా రాష్ట్ర శాఖకి నివేదిoచారు.ఆర్థిక పరమైన సమస్యలు వెంటాడుతు న్న నేపథ్యంలో ఉపాధ్యాయులకు హక్కుగా రావలసిన జిపిఎఫ్ బకా యిలు దానితో పాటుగా బాకీ పడి న డి. ఎ.లను వెంటనే రాష్ట్ర ప్రభు త్వం విడుదల చేసే విధంగా ప్రభు త్వంపై ఒత్తిడి తీసుకురావలసింది గా రాష్ట్ర శాఖాన్ని కోరారు.
పిఆర్సి నివేదికను తొందరగా తె ప్పించుకోని వెంటనే అమలు చేయా ల్సిందిగా డిమాండ్ చేయడం జరి గింది. కేజీబీవీ, గురుకులాల్లో ఉన్న సమస్యల పరిష్కారం కోసం వెంట నే చర్యలు తీసుకోవాల్సిందిగా నివే దించడం జరిగినది. అనంతరం జి ల్లా ప్రధాన కార్యదర్శి అనిల్ కుమా ర్, ప్రధాన కార్యదర్శి నివేదికను స మర్పించి దానిపైన చర్చ చేసి ఆమో దాన్ని తెలిపే కార్యక్రమాన్ని చేపట్ట డం జరిగినది అనంతరం అనేక మండల రాష్ట్ర జిల్లా బాధ్యులు వా రు ఎదుర్కొంటున్న సమస్యలను జిల్లా శాఖ కి, రాష్ట్ర శాఖకి తెలియ జేశారు. ఈ కార్యక్రమంలో ఇటీవల పదోన్నతి పొందిన ఉపాధ్యాయు ల కి అదే విధంగా పదవి విరమణ పొందిన, పొందబోతున్న ఉపాధ్యా యులకి సన్మాన కార్యక్రమం నిర్వ హించారు.
ఈ కార్యక్రమంలో అధ్యక్షులు శ్రీని వాసరావు, ప్రధాన కార్యదర్శి సు నార్కర్ అనిల్ కుమార్,జిల్లా గౌరవ అధ్యక్షులు ఉప్పుల నరసింహ చా రి, జిల్లా సహాధ్యక్షులు టి రాకేష్ కు మార్, శ్రావణ్, గంగాభవాని, రాష్ట్ర సహధ్యక్షులు హనుమంతు, ఉద య్ బాబు, డి. వేణు గోపాల్ రావు, ఇందారపు ప్రకాష్ ముంజంపల్లి ర మేష్, అనురాధ భాయి, వరలక్ష్మి శ్రీలత, సమతల, మండల అధ్యక్ష కార్యదర్శులు ఎనగంటి బిక్షపతి, దేవాజీ మరియు అన్ని మండలాల అధ్యక్ష కార్యదర్శులతో పాటుగా రా ష్ట్ర జిల్లా ప్రాథమిక సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.