Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Tehsildar Srinivas : మార్చ్ లో డబుల్ బెడ్ రూమ్ ప్రొసీడింగ్స్

Tehsildar Srinivas : ప్రజాదీవెన, నల్గొండ :లాటరీ ద్వారా ఎంపికైన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల లబ్ధిదారులకు మార్చి 8 తర్వాత ప్రొసీడింగ్స్ ఇస్తామని నల్గొండ తాసిల్దార్ శ్రీనివాస్ హామీ ఇచ్చారు.గురువారం డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల సాధన పోరాట కమిటీ ఆధ్వర్యంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలోకి సుమారు రెండు వందల కుటుంబాలు గృహప్రవేశాలు చేయడానికి వెళ్లారు. ఆ సందర్భంలో పోలీసుల తో కలిసి నల్గొండ తాసిల్దార్ డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల దగ్గరికి వచ్చి లబ్ధిదారులతో కలిసి మాట్లాడారు. మార్చి 8 వరకు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్నందున ప్రభుత్వం ఎలాంటి సంక్షేమ పథకాలు చేపట్టలేకపోతుందని అన్నారు. గత రెండు సంవత్సరాల క్రితమే లాటరీ ద్వారా ఎంపిక చేసినందున ఎన్నికల కోడ్ అయిపోయిన వెంటనే ప్రొసీడింగ్ ఆర్డర్స్ ఇచ్చి మౌలిక సదుపాయాలు కల్పించి స్వాధీనం చేస్తామని లబ్ధిదారులకు హామీ ఇచ్చారు.


గతంలో ఆర్డిఓ లాటరీ ద్వారా ఎంపికైన వారికి మాత్రమే డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు, ఎలాంటి మౌలిక సదుపాయాల కోసం పనులు చేపట్టకుండా అలాగే వదిలేయడంతో ఈ రోజు లబ్ధిదారులు ఇల్లు కిరాయిలు కట్టుకోలేక ప్రభుత్వం కేటాయించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో ఉండడానికి కోసం వచ్చారని డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పోరాట సాధనా కమిటీ కన్వీనర్ అవుట రవీందర్ తెలిపారు. తాసిల్దార్ శ్రీనివాస్ ఇచ్చిన హామీ మేరకు మార్చి 8 నాటికి ప్రొసీడింగ్స్ ఇవ్వని ఎడల మార్చి 10న తాసిల్దార్ కార్యాలయం ముందు డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల లబ్ధిదారుల కుటుంబ సభ్యులతో సహా ధర్నా చేస్తామని తెలిపారు.


ఈ కార్యక్రమానికి సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎండి సలీం, పట్టణ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య హాజరై సంఘీభావం ప్రకటించారు. పేదల కు ఇల్లు దక్కే వరకు వారికి అండగా ఉంటామని తెలిపారు.ఈ కార్యక్రమంలో మహేష్, జహంగీర్, ఇలియాస్ నగీన, లక్ష్మి, శిల్ప,ప్రభాకర్, రాణమ్మ, పూల నాగయ్య,పావని తదితరులు పాల్గొన్నారు.