–సురక్షితమైన ఇంటర్నెట్ దినోత్స వం పోస్టర్ ని ఆవిష్కరణ
Tejas Nand Lal Pawar : ప్రజా దీవెన, సూర్యాపేట: సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. మంగళవారం కలెక్టర్ ఛాంబర్ నందు సురక్షితమైన ఇంటర్నెట్ దినోత్సవం సందర్బంగా పోస్టర్ ని జిల్లా అదనపు కలెక్టర్ పి రాంబాబు తో కలిసి జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఆవిష్కరించారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సెఫర్ ఇంటర్ నెట్ డే అనేది ఆన్ లైన్ భద్రత, డిజిటల్ సంరక్షణ ప్రాధాన్యతను ప్రజలకి అవగాహన కల్పించటానికి చేపడుతున్న కార్యక్రమం అని అన్నారు.ఆధార్, పాన్ లేదా బ్యాంక్ వివరాలకు సంబందించిన ఓ టి పి ని ఎవరైనా ఫోన్ లో అడిగితె చెప్పవద్దని, డబ్బులు చెల్లించ్చేటప్పుడు QR కోడ్ ద్వారా స్కాన్ చేసి చెల్లించాలని, ఆన్ లైన్ లో ఎవరికి వ్యక్తగత సమాచారం పంచుకోరాదని,తెలియని వారు ఏమైనా ఆన్ లైన్ లింక్ లు పంపితే వాటిని వెంటనే తొలగించాలని,ఆన్ లైన్ లో తక్కువ పెట్టుబడి పెడితే ఎక్కువ ఆదాయం వస్తదనే అఫర్లను నమ్మవద్దని ఈ సందర్బంగా సూచించారు. సైబర్ నేరాల వళ్ళ ఎవరికైనా సమస్య ఏర్పడితే వెంటనే టోల్ ప్రి నెంబర్ 1930 కి కాల్ చేసి పిర్యాదు చేయాలని తదుపరి అధికారులు సమస్యని పరిష్కరించటం జరుగుతుందని తెలిపారు.
సైబర్ హైజీన్ అనేది వ్యక్తులు తమ ఫోన్, కంప్యూటర్ తదితర పరికరాలలో వ్యక్తిగత సమాచారాన్ని హ్యాకింగ్, మాల్వేర్ వంటి వాటి నుండి సంరక్షించుకోవచ్చు అని తెలిపారు.
ఈ కార్యక్రమం లో పరిపాలన అధికారి సుదర్శన్ రెడ్డి, సూపర్ టిడెంట్లు శ్రీనివాస రాజు , పద్మారావు, యల్ డి యం బాపూజీ, ఈ డి యం గఫార్,NIC సిబ్బంది అర్షద్, లావణ్య, విజయ్ తదితరులు పాల్గొన్నారు.