*కోదాడ తాసిల్దార్ పై బదిలీ వేటు
*ఇద్దరు రెవెన్యూ అధికారుల సస్పెండ్
Tejas Nandalal Power: ప్రజా దీవెన, కోదాడ: వివిధ ప్రభుత్వ శాఖలలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు రైతులను (Government employees are farmers_ఇబ్బందులకు గురిచేసినట్లయితే కఠిన చర్యలు తప్పవని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందాలాల్ పవర్ (Tejas Nandalal Power) హెచ్చరించారు కోదాడ మండల పరిధిలోని కాపుగల్లు గ్రామానికి చెందిన రైతు పౌతి విషయములో రెవిన్యూ అధికారులుఅవినీతికి పాల్పడటంతో విచారణ చేపట్టి చర్యలు తీసుకున్న జిల్లా కలెక్టర్ కోదాడ తాసిల్దార్ సాయి గౌడ్ పై బదిలీ వేటు వేస్తూ అలాగే ఇద్దరు రెవిన్యూ అధికారులను సస్పెండ్ చేస్తూ సోమవారం ఆదేశాలు జారీ చేశారు