–మొదట్లో లాస్యనందిత మృతికి సంతాప తీర్మానం, రేపటికి వాయి దా
–సభలో తీర్మానం ప్రవేశపెట్టిన సిఎం రేవంత్ రెడ్డి, ఏకగ్రీవంగా ఆమో దించిన శాసనసభ్యులు
Telangana assembly meetings:ప్రజా దీవెన హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు (Telangana assembly meetings) తొలి రోజు దివంగత ఎమ్మెల్యే లాస్య (lasya) నందిత మృతికి సంతాప తీర్మానం తో ముగిశాయి. మంగళవారం ఉద యం ప్రారంభం అయిన వెంటనే తొలుత కంటోన్మెంట్ దివంగత ఎమ్మెల్యే లాస్యనందిత మృతికి సభ నివాళులర్పించింది. తదనంత రం సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాప తీర్మానం ప్రవేశ పెడు తూ మాట్లాడారు. సామాన్య కు టుంబంలో జన్మించిన సాయన్న ప్రజా జీవితంలోనే మరణించారని చెప్పారు. సాయన్న వారసురాలిగా లాస్యనందితను కంటోన్మెంట్ ప్రజ లు ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారని, కానీ ప్రమాద వశాత్తు లాస్యనందిత మరణించడం బాధాకరం అన్నారు. వారు మన మధ్య లేకపోయినా ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని తెలిపారు. వారి ఆశయాలను మా ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుందని స్పష్టం చేశారు. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తూ తీర్మా నాన్ని ప్రవేశ పెడుతున్నానన్నారు. కాగా సంతాప తీర్మానాన్ని శాసనస భ ఏకగ్రీవంగా ఆమో దించింది. అనంతరం స్పీకర్ (speaker) సభను రేపటికి వాయిదా వేశారు.
ఏడాదిలోపే కుటుంబంలో విషాదo : కేటీఆర్
కంటోన్మెంట్ ఎమ్మెల్యే గా సాయన్న మరణించిన ఏడాదిలోపే ఆయన కూతురు లాస్యనందిత ఎమ్మెల్యేగా మరణించడం ఎంతో విషాదకర మని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ (ktr) అన్నారు. లాస్య సంతాప తీర్మానం సందర్భంగా సభలో మాట్లాడిన ఆయన సాయన్న మాదిరిగానే ప్రజాసేవ చేయాలనుకున్న లాస్య నందితకు మంచి అవకాశం వచ్చిం దన్నారు. కానీ ఆమెను విధి పగబ ట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. క్లిష్ట పరిస్థితుల్లో ఆ కుటుం బానికి పార్టీ అండగా నిలిచిందని చెప్పారు.
లాస్య మరణం లోటు భర్తీ చేయలేనిది: ఏలేటి
లాస్యనందిత అకాల మరణం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసిం దని, ఆమె మన మధ్య లేకపోవడం బాధా కరమని బీజేఎల్పీ నేత ఏలే టి మహేశ్వర్ రెడ్డి (Maheshwar Reddy)పేర్కొన్నారు. ఆమె మరణం పట్ల సంతాపం తెలిపారు.
సాయన్న కుటుంబానికి ప్రగాఢ సానుభూతి…అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనేముందు బీఆర్ఎస్ ఎమ్మె ల్యేలు గన్ పార్క్ వద్ద తెలంగాణ అమరవీరుల స్థూపానికి నివాళుల ర్పించారు. ఈ కార్యక్రమానికి బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (ktr), హరీశ్ రావు లతో పాటు ఆ పార్టీ ఎమ్మెల్యేలు (mlas) హాజరయ్యారు.
కేసీఆర్ చాంబర్ పై కేటిఆర్ అసంతృప్తి… అసెంబ్లీలో ప్రతి పక్షనేత కేసీఆర్ కు కేటాయించిన చాంబర్పై కేటీఆర్ అసంతృప్తి వ్య క్తం చేశారు. రెండు రూమ్ లను కలిపి ఒకే రూమ్ మాదిరిగా మార్చా రని, రూమ్ మధ్యలో టా యిలెట్ పెట్టి వాడుకోవడానికి అనుకూలం గా లేకుండా చేశారని మండిపడ్డా రు. ఈ అంశాన్ని బీఏసీ సమావేశం లో లేవనెత్తాలని హరీశ్ రావుకు సూచించారు.
విడిగా కూర్చున్న పార్టీ మారిన ఎమ్మెల్యేలు …బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలు సభలో వెనుక సీట్లలో కూర్చుకున్నా రు. పోచారం శ్రీనివాస్ రెడ్డి, కడి యం శ్రీహరి, గూడెం మహిపాల్ రెడ్డి, కాలే యాదయ్య సభకు హాజరయ్యారు. వీరు ఏ పార్టీ కండువా కప్పుకోకుండా వెనుక వరుసలో కూర్చున్నారు.
స్పీకర్ ఛాంబర్ లో ప్రారంభమైన బీఏసీ సమావేశం
ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగా ణ అసెంబ్లీ సమావేశాలకు సంబం దించి బిఎసి (bac) సమావేశం ప్రారంభ మైంది. స్పీకర్ ప్రసాద్ రావు అధ్య క్షతన ఛాంబర్ లో ప్రారంభమైన ఈ సమావేశం లో సభ నిర్వహణ తో పాటు ఎన్ని రోజులు సమావేశాలు నిర్వహించాలని అఖిలపక్ష సభ్యుల సమక్షంలో నిర్ణయం తీసుకోనున్నా రు. ఇదిలా ఉండగా శాసన సభ సమావేశాలు పది రోజుల పాటు జరుపాలని సూత్ర ప్రాయంగా అంగీకారానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ లు, బీఆర్ నుంచి హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి, బీజేపీ నుంచి మహేశ్వర్ రెడ్డి, సీపీఐ నుంచి కూనమానేని సాంబశివరావు, ఎంఐఎం నుంచి బలాల తదితరులు హాజరయ్యారు.