–మహమ్మారి,అగ్నిప్రమాదాలు సంభవిస్తాయి
–భవిష్యవాణిని వినిపించిన స్వర్ణలత
Bonal Fair : ప్రజా దీవెన, హైదరాబాద్: జంట నగరాల్లోని సికింద్రాబాద్ లో శ్రీ ఉజ్జయిని మహాకాళి ఆలయంలో బోనాల జాతర అత్యంత వైభవంగా కొనసాగింది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల కు ప్రతీకగా నిలిచే ఈ ఉత్సవంలో లక్షలాది మంది భక్తులు పాల్గొన్నారు. ఆషాఢమా సంలో జరిగే ఈ జాతరలో భక్తులు పట్టు చీరలు. నగలతో అలంక రిం చుకొని, తలపై బోనాలు మోస్తూ అ మ్మవారికి సమర్పించారు. జాతర లో భాగంగా సోమవారం భక్తురాలు మాతంగి స్వర్ణలత రంగం భవిష్య వాణి వినిపించారు. ఈ సందర్భం గా ఆలయంలో భక్తులు అధిక సం ఖ్యలో తరలివచ్చారు. స్వర్ణలత తనభవిష్యవాణిలో నా బిడ్డలను కడుపులో పెట్టుకొని కాపాడుకుం టాను. అయితే నా పూజలు సక్ర మంగా జరపకపోతే రక్తం కక్కుకొని మరణాలు సంభవిస్తాయి. రక్త బలి ఇవ్వడం లేదని, దీని వల్ల మరణా లు పెరుగుతున్నాయని హెచ్చరిం చారు.
రాబోయే రోజుల్లో మహమ్మారి, అ గ్నిప్రమాదాలు సంభవించవచ్చని. ఈ ఏడాది వర్షాలు బాగా కురు స్తా యి. ఐదు వారాలు పాటు నాకు పూజలు, సాకపోసి ఆనంద పరచా లి లేకపోతే అల్లకల్లోలం జరు గు తుందని ఆమె తెలిపారు. అమ్మవా రి రూపాన్ని ప్రతిష్ఠించడానికి కూడా అడ్డంకులు ఉన్నాయని పే ర్కొన్నా రు. జాతరలో భాగంగా రంగం, అం బారీపై అమ్మవారి ఊరేగింపు, పో తరాజుల విన్యాసాలు, ఫలహార బండ్ల ఊరేగింపు జరిగాయి. ఈ ఉత్స వాలు తెలంగాణ సంస్కృతి ని, స్త్రీ శక్తిని, భక్తిని ప్రతిబింబిస్తా యి. రాష్ట్రం నలుమూలల నుంచి, పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలివచ్చారు.