Telangana Cabinet white ration cards : అర్హులందరికీ తెల్లరేషన్ కార్డులు
గ్రామీణ ప్రాంతాలలో వార్షిక ఆదాయం లక్షన్నర ప్రామాణికం -- స్థిరాస్తి పరంగా మాగాణి 3.50 ఎకరాలు,చెలక 7.5 ఎకరాలు --పట్టణ ప్రాంతాల్లో వార్షిక ఆదాయం రెండు లక్షలు వరకు --పట్టణ ప్రాంతాల్లో వార్షిక ఆదాయం ఆధారంగా మంజూరు --విధి,విధినాల రూపకల్పనలో రాజకీయాలకతీతంగా ప్రజాప్రతి నిధుల భాగస్వామ్యం --లోకసభ, రాజ్యసభ, శాసనసభ, శాసనమండలి సభ్యుల అభిప్రా యాలను పరిగణ --వారందరికీ సమాచారం చేరేలా లేఖలు రాయాల్సి ఉంటుంది --సక్సేనా కమిటీ సిఫారసుల పరిశీలనకు అంగీకారం --దేశంలోని మిగిలిన రాష్ట్రాలలో తెల్లరేషన్ కార్డుల అర్హత ప్రమా ణాలు పరిశీలన --అంతర్ రాష్ట్రాలలో తెల్ల రేషన్ కార్డు ఉండి ఇక్కడా ఉంటే ఏరివేత --కొత్త రేషన్ కార్డుల మంజూరీ పై సచివాలయంలో సమావేశమైన మంత్రివర్గ ఉపసంఘం --ఉపసంఘం చైర్మన్ ఉత్తమ్ కుమా ర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావే శం --హాజరైన ఉప సంఘము సభ్యు లు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దామో దర రాజనరసింహలు
అర్హులందరికీ తెల్లరేషన్ కార్డులు
—గ్రామీణ ప్రాంతాలలో వార్షిక ఆదాయం లక్షన్నర ప్రామాణికం
— స్థిరాస్తి పరంగా మాగాణి 3.50 ఎకరాలు,చెలక 7.5 ఎకరాలు
–పట్టణ ప్రాంతాల్లో వార్షిక ఆదాయం రెండు లక్షలు వరకు
–పట్టణ ప్రాంతాల్లో వార్షిక ఆదాయం ఆధారంగా మంజూరు
–విధి,విధినాల రూపకల్పనలో రాజకీయాలకతీతంగా ప్రజాప్రతి నిధుల భాగస్వామ్యం
–లోకసభ, రాజ్యసభ, శాసనసభ, శాసనమండలి సభ్యుల అభిప్రా యాలను పరిగణ
–వారందరికీ సమాచారం చేరేలా లేఖలు రాయాల్సి ఉంటుంది
–సక్సేనా కమిటీ సిఫారసుల పరిశీలనకు అంగీకారం
–దేశంలోని మిగిలిన రాష్ట్రాలలో తెల్లరేషన్ కార్డుల అర్హత ప్రమా ణాలు పరిశీలన
–అంతర్ రాష్ట్రాలలో తెల్ల రేషన్ కార్డు ఉండి ఇక్కడా ఉంటే ఏరివేత
–కొత్త రేషన్ కార్డుల మంజూరీ పై సచివాలయంలో సమావేశమైన మంత్రివర్గ ఉపసంఘం
–ఉపసంఘం చైర్మన్ ఉత్తమ్ కుమా ర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావే శం
–హాజరైన ఉప సంఘము సభ్యు లు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దామో దర రాజనరసింహలు
ప్రజా దీవెన, హైదరాబాద్: రాష్ట్రంలో అర్హులందరికీ తెల్ల రేషన్ కా ర్డుల మంజూరీ ఉంటుందని మం త్రివర్గ ఉప సంఘం స్పష్టం చేసిం ది.అయితే అందుకు విధివిధానాలను పరిశీలిస్తున్నట్లు మంత్రివర్గ ఉప సంఘం సభ్యులు నిర్ణయించారు.
శనివారం ఉదయం రాష్ట్ర సచివాలయంలో కొత్త తెల్ల రేషన్ కార్డుల( white ration car ds) కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేసిన మంత్రివర్గ ఉప సంఘo సమావేశమై తెల్లరేషన్ కార్డు మంజూరీ పై నిశితంగా చర్చించారు. మంత్రివర్గ ఉపసంఘం ( Cabinet Subc ommittee) చైర్మన్ రాష్ట్ర నీటిపారుదల మరియు పౌర సర ఫరా ల శాఖామంత్రి యన్. ఉత్త మ్ కుమార్ రెడ్డి (uttam kumar re ddy) అధ్యక్షతన జరిగిoది.
ఈ సమావేశంలో ఉపసంఘము స భ్యులు రాష్ట్ర ఆరోగ్యశాఖా మం త్రి దామోదర రాజనరసింహా ( damodara rajanarsihma), రెవిన్యూ శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ( pingulati sri nivas reddy) పౌర సరఫరాల కార్య దర్శి డి.యస్ చౌహన్, ఆరో గ్య శా ఖా కార్యదర్శి చిరిస్తినాజ్ చొంగతి తదితరులు పాల్గొన్నారు.
తెల్ల రేషన్ కార్డుకు గ్రామీణ ప్రాంతా లలో వార్షిక ఆదాయం (Ann ual income) లక్షన్నరకు లోపు ఆదాయం, మాగాణి 3.50 ఎక రాలు, చెలక 7.5 ఎకరాలు అదే పట్టణ (town arias) ప్రాంతాల్లో వార్షిక ఆదాయం రెండు లక్షలు మించకుండా ఉండాలన్న ప్రతిపాద న ఉపసంఘము ముందుకు వచ్చిందన్నారు. కొత్త తెల్ల రేషన్ కార్డు ల మంజూరీలో దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న వారెవరూ ఈ అవకా శం కోల్పోకోకుండా ఉండేలా లోతైన అధ్యయనం జరుపుతున్నామ న్నారు.
అందులో భాగంగా రాష్ట్రంలో రాజకీయాలకు అతీతంగా అధికా ర,ప్రతిపక్షాలకు చెందిన ప్రజాప్రతినిధులందరి (public represe ntatives ) నుండి కొత్త తెల్ల రేషన్ కార్డుల మంజూరీలో వారి సలహాలు,సూచనలు తీసు కోనున్నట్లు ఉపసంఘము చైర్మన్ ఉత్త మ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. తక్షణమే రాజ్యసభ, లోకసభ, శాస నసభ, శాసనమండలి సభ్యులందరికీ లేఖలు రాసి విధివిధినాల లో వారి నుండి సూచనలు తీసుకో వాల ని పౌరసరఫరాల శాఖ (civil suplies) కార్య దర్శి డి.యస్ చౌహన్ కు మంత్రి ఉత్త మ్ కుమార్ రెడ్డి సూ చించారు.
అంతే గాకుండా డాక్టర్ ఎన్.సి.సక్షే నా కమిషనర్ గా ఉన్న సక్సేనా కమిటీ సిఫారసులను కొత్త తెల్ల రేషన్ కార్డుల మంజూరీలో పరిగ ణనలోకి తీసుకోబోతున్నట్లు ఆయ న తెలిపారు. ఈ కమిటీలో సు ప్రీం కోర్టు స్పెషల్ కమిషనర్ హర్ష మండర్ సభ్యుడిగా ఉన్నారు. అం తే గాకుండా రాష్ట్ర ప్రభుత్వం (state government) సూచన మేరకు దిగువ పేద మధ్యతరగతి ప్రజలకు మంజూరు చేసునున్న తెల్లరేషన్ కార్డుల మంజూరీ విషయంలో అధికారుల బృందం ఇప్ప టికే దేశంలోని మిగితా రాష్ట్రాలలో తెల్ల రేషన్ కార్డుల మంజూరీలో అవలంబిస్తున్న విధి విధానాలను అధ్యయనం చేసినట్లు ఆయన వెల్లడించారు.
అయితే అదే సమయంలో అం తర్ రాష్ట్రాల నుండి తెలంగాణాకు వలస వచ్చిన వారికి అక్కడ ఇక్క డ రెండు చోట్లా తెల్లకార్డులు ఉన్న ట్లు తేలిందని అటువంటి వారికి అక్కడో ఇక్కడో అన్న అప్షన్ ఇవ్వా లనే ప్రతిపాదనపైఉప సంఘ ము చర్చించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 89. 96 లక్షల రేషన్ కార్డులు ఉన్నా యన్నారు.కాగా రాష్ట్ర ప్రభు త్వం అధికారం లోకి వచ్చిందే తడవుగా కొత్త తెల్ల రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఇవ్వడం తో పది లక్షల దరఖాస్తులు వచ్చా యాన్నారు.
Telangana Cabinet white ration cards