Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Telangana CM Revanth Reddy:ఢిల్లీకి సీఎం రేవంత్ పయనం

–నేడు, రేపు రెండు రోజుల పర్య టన నిమిత్తం

Telangana CM Revanth Reddy ప్రజా దీవెన, హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Telangana CM Revanth Reddy )రెండు రోజుల ఢిల్లీ పర్యటనకు (Delhi tour)వెళ్లను న్నారు. ఆది, సోమవారాల్లో ఆయన హస్తినలో (Hastina)ఉండనున్నారు. ఆదివారం మధ్యాహ్నం హైదరాబా ద్ నుంచి రేంవత్ రెడ్డి ఢిల్లీకి ప్రత్యేక విమానంలో బయలు దేరనున్నట్టు ఆయన కార్యాలయ వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్ పార్టీ అగ్రనే తలతో పాటు పలువురు కేంద్ర మంత్రులను రేవంత్రెడ్డి కలవను న్నారు. ముఖ్యంగా మంత్రివర్గ విస్తరణతో పాటు కొత్త పీసీసీ అధ్యక్షుడి ఎంపికపై అధిష్టానంతో ఆయన చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొన్ని నామినే టెడ్ పదవుల పంపకం పూర్తవ్వ డంతో మిగిలిన పదవులు ఎవరెవ రికి కేటాయించాలి పదవులు దక్కని సీనియర్లను ఎలా గౌర వించాలనే అంశంపై కూడా అధిష్టా నంతో రేవంత్ చర్చించనున్నారు. మరోవైపు వరంగల్లో ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఈ నెల చివరిలో ఏర్పా టు చేయతలపెట్టిన భారీ బహిరంగ సభకు పార్టీ అగ్రనేత రాహుల్ గాం ధీని ఆహ్వానించను న్నారు. ఎన్ని కల్లో ఇచ్చిన హామీ ప్రకారం రైతు రుణమాఫీ అమలు చేయడంతో రాహుల్తో సభ పెట్టిస్తే బాగుంటుం దనే ఉద్దేశంలో పీసీసీ నేతలు (PCC leaders)ఉన్నా రు. ఈ విషయాన్ని హైకమాండ్కు ముఖ్యమంత్రి రేవంత్ తెలియ జేయనున్నారు. వరంగల్ వేదికగా రాహుల్ గాంధీ ప్రకటించిన రైతు డిక్లరేషన్లో రుణమాఫీ అంశాన్ని ప్రస్తావించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఏకకాలంలో రెండు లక్షల రూపా యల రుణమాఫీ చేస్తామని ఆ డిక్లరేషన్లో ప్రకటించారు. ఇచ్చిన హామీ మేరకు గురువారం రైతుల ఖాతాల్లో లక్ష రూపాయల రుణ మాఫీ మొత్తాలను ప్రభుత్వం జమ చేసింది.

ఢిల్లీ చేరుకున్న ఉప ముఖ్య మంత్రి భట్టి …ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క (Mallu Bhattiwickramarka)ఢిల్లీ చేరుకు న్నారు. ఆదివారం మధ్యాహ్నం సీ ఎం రేవంత్ ఢిల్లీ వెళ్తుండడంతో ఒకరోజు ముందే భట్టి పయనమ య్యారు. ఇప్పటికే నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రెడ్డి ఢిల్లీలోనే ఉన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై శనివారం మంత్రి ఉత్తమ్ ఇతర అధికారులు నేషనల్ డ్యాం సేఫ్టీ అధికారులను కలిసి సమాలో చనలు జరిపారు. పార్టీ అగ్రనేతలు ఖర్గే, రాహుల్ గాంధీలను (Kharge, Rahul Gandhi) ఉత్తమ్ కలిసే అవకాశం ఉన్నట్టు తెలు స్తోంది. మంత్రి పదవులు, పీసీసీ చీఫ్ పదవి, నామినేటెడ్ పదవు లను ఆశిస్తున్న ఎమ్మెల్యేలు, ఎమ్మె ల్సీలు, సీనియర్లలో కొందరు శని వారం రాత్రి ఢిల్లీ బయలుదేరి వెళ్ల గా మరికొంతమంది ఆదివారం ఉదయం పయనమవుతున్నట్టు సమాచారం.మరికొన్ని రోజుల్లో లక్షన్నర రూపాయలు, ఆగస్టు 15వ తేదీ లోపు రెండు లక్షల రుణమాఫీ మొత్తాన్ని రైతుల ఖాతాల్లో జమ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇచ్చిన హామీని అమలు చేయడంతో వరంగల్లో కృతజ్ఞత సభను నిర్వహించి ఈ సభకు అగ్రనేత రాహుల్ గాంధీని ఆహ్వానించనున్నామని ఇప్పటికే రేవంత్ (revanth)ప్రకటించారు.