Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Telangana DGP: తెలంగాణ డీజీపీగా జితేందర్

–1992 బ్యాచ్ కు చెందిన సీనియర్ ఐపిఎస్ అధికారి

Telangana DGP:ప్రజా దీవెన, హైదరాబాద్: తెలం గాణ కొత్త‌ డీజీపీగా సీనియర్‌ ఐపీ ఎస్‌ అధికారి జితేందర్ (Jitender) నియ‌మితు ల‌య్యారు. ఈ మేర‌కు ప్ర‌భుత్వ ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శాంతి కుమారి (Shanti Kumari) ఉత్త‌ర్వులు జారీ చేశారు. ప్ర‌స్తుత డిజిపి ర‌వి గుప్తాను హోం శాఖ‌కు బ‌దిలీ చేయగా ఆయ‌న‌కు హోం శాఖ (Home Department)ప్ర‌త్యేక కార్య‌ద‌ర్శిగా బాధ్య‌త‌లు అప్ప‌గించారు. ఇదిలా ఉంటే తెలంగాణ డీజీపీగా జితేం దర్ ప్రస్తుతం ఆయన డీజీపీ హోదా లోనే హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు. విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫో ర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ జనరల్‌గా అదన పు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు

. పంజాబ్‌ రాష్ట్రం జలంధర్‌లో రైతు కుటుంబంలో జన్మించిన జితేందర్‌ (Jitender) 1992 ఐపీఎస్‌ బ్యాచ్‌కు చెందిన ఆయ‌న ఆంధ్రప్రదేశ్‌ కేడర్‌కు ఎంపి కయ్యారు. తొలుత నిర్మల్‌ ఏఎస్పీ గా పనిచేసిన అనంతరం బెల్లంపల్లి అదనపు ఎస్పీగా (sp) విధులు నిర్వర్తిం చారు. అప్పట్లో నక్సల్స్‌ ప్రభావం ఎక్కువగా ఉన్న మహబూబ్‌నగర్, గుంటూరు జిల్లాల ఎస్పీగా ఉన్నా రు. ఢిల్లీ సీబీఐలో 2004-06 వరకు గ్రేహౌండ్స్‌లో పనిచేశారు. అనంత రం డీఐజీగా (dig)పదోన్నతి పొంది విశా ఖ రేంజ్‌లో బాధ్యతలు నిర్వర్తించా రు. అప్పాలో కొంతకాలం పనిచేసి తెలంగాణ ఉద్యమం సమయంలో వరంగల్‌ రేంజ్‌ డీఐజీగా కొనసా గారు. ఆంధ్రప్రదేశ్‌ సీఐడీ, ఎంక్వ యిరీ కమిషన్, విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌లో బాధ్యతలు నిర్వర్తించిన అనంతరం హైదరాబా ద్‌ కమిషనరేట్‌లో ట్రాఫిక్‌ అదనపు కమిషనర్‌గా పనిచేశారు. తర్వాత తెలంగాణ శాంతిభద్రతల విభాగం అదనపు డీజీపీగా (dgp), జైళ్లశాఖ డీజీగా పనిచేశారు. ప్రస్తుతం హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న ఆయన 2025 సెప్టెంబరులో పదవీవిరమణ చేయనున్నారు.