Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Telangana duputy CM batti vikramaarka : హరిత నిర్మాణం ఓ విధానంగా మారాలి

--సగటు మనిషి కొనుగోలు చేసే విధంగా నిర్మాణాలు ఉండాలి --పెట్టుబడులకు హైదరాబాద్ స్వర్గధామం --రీజినల్ రింగ్ రోడ్ తో తెలంగాణ పట్టణ రాష్ట్రంగా రూపుదిద్దుకుం టుంది -- హరిత నిర్మాణాలకు రాష్ట్ర ప్రభు త్వ ప్రోత్సాహం ఉంటుంది -- గ్రీన్ ప్రాపర్టీ షో ముగింపు సమావే శంలో డిప్యూటీ సీఎం బట్టి విక్ర మార్క మల్లు

హరిత నిర్మాణం ఓ విధానంగా మారాలి

–సగటు మనిషి కొనుగోలు చేసే విధంగా నిర్మాణాలు ఉండాలి
–పెట్టుబడులకు హైదరాబాద్ స్వర్గధామం
–రీజినల్ రింగ్ రోడ్ తో తెలంగాణ పట్టణ రాష్ట్రంగా రూపుదిద్దుకుంటుంది
— హరిత నిర్మాణాలకు రాష్ట్ర ప్రభు త్వ ప్రోత్సాహం ఉంటుంది
— గ్రీన్ ప్రాపర్టీ షో ముగింపు సమావే శంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్ర మార్క
ప్రజా దీవెన, హైదరాబాద్: పర్యా వరణాన్ని కాపాడే విధంగా భవన నిర్మాణాలు తెలంగాణ రాష్ట్రంలో ఓ జీవన విధానం మారాలని డి ప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ( duputy CM mallu ba tti vikramaarka) పేర్కొన్నారు. ఆదివారం హైటెక్స్ లో ఏర్పా టు చేసిన గ్రీన్ ప్రాపర్టీ షో ముగింపు సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఆకుపచ్చ జీవనం మనకు ఓ విధా నంగా మారాలి, పచ్చని వారసత్వాన్ని మన తర్వాత తరాలకు అందించాలన్నారు.

50% నీరు, 40 శాతం విద్యుత్తు ఆదా చేసే రీతిలో నిర్మించే గ్రీన్ బిల్డింగ్స్ కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకాలు, సం పూర్ణ సహకారం ఉంటుందన్నారు. సగటు మానవుడు కొనుగోలు చేసే విధంగా గ్రీన్ బిల్డింగ్స్ నిర్మాణాలు ఉండాలని డిప్యూటీ సీఎం బిల్డర్లను కోరారు.

హైదరాబాద్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పెట్టుబడి దారులకు స్వర్గ ధా మం లాంటిదని అభివర్ణించారు. ఇక్కడి వాతావరణం, నీటి వసతి, నిరంతర విద్యుత్ సరఫరా, కావలసినంత భూమి, శాంతి భద్రత లు, ఫ్రెండ్లీ గవర్నమెంట్ అన్ని అందు బాటులో ఉన్నాయన్నారు.

రీజినల్ రింగ్ రోడ్డు (RRR) నిర్మాణం పూర్తయితే తెలంగాణ రాష్ట్రం పట్టణ రాష్ట్రంగా రూపుదిద్దుకుంటుందని అన్నారు. వ్యాపారం తో పాటు సామాజిక బాధ్యతతో కూడిన ఓ అద్భు తమైన కార్యక్రమంలో పాల్గొ నడం సంతోషకర అంశంగా భావిస్తున్నాను అన్నారు.

భారతదేశం లోని ఏకైక గ్రీన్ ప్రాపర్టీ షోను నిర్వహించేందుకు తెలం గాణ ప్రభుత్వం IGBC తో భాగస్వామ్యం కావడం ఆనందకరమైన అంశం, కాన్ఫరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీలో(CII)ని ఇండియన్ గ్రీన్ బిల్డిం గ్ కౌన్సిల్ (IGBC) 2001 నుంచి దేశంలో గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్ కు నాయకత్వం వహించడం, 11.67 బిలియన్ చదరపు అడుగుల నిర్మాణ లక్ష్యాన్ని సాధించడం అభినందనీయమన్నారు.

ఈ కాన్సెప్ట్ లో ప్రపంచంలోని మొదటి మూడు దేశాల్లో భారతదేశం ఒకటి కావడం శుభ సూచకం. ఇక మన రాష్ట్ర విషయా నికొస్తే 1.46 బిలియన్ చదరపు అడుగుల మేరకు నిర్మాణం జర గడం, 2.50 లక్షల రెసిడెన్షియల్ యూనిట్లను గ్రీన్ గా మార్చడం అదే సందర్భం లో IGBC గ్రీన్ బిల్డింగ్ సర్టిఫికెట్ ను స్వీకరించడం ఓ పెద్ద ముంద డుగు అని భావిస్తున్నాను తెలిపారు.

గ్రీన్ బిల్డింగ్ ప్రాజెక్టులకు ప్రోత్సాహకాలను అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది, రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో విద్యు దీకరణ, పారిశుద్ధ్యం, ఆరోగ్య సంరక్షణ, పంచాయతీల్లో, మున్సి పాలిటీల్లో వ్యర్ధాల నిర్వహణను మెరుగుపరచడానికి వీలుగా పటి ష్టమైన మౌలిక సదుపా యాలను నిర్మించడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టిపెడుతోందని వెల్లడించారు.

తెలంగాణలోని అన్ని గ్రామాల్లో గ్రీన్ మరియు నెట్ జీరో కాన్సెప్ట్ లను సులభతరం చేయడంలో మాకు సహకరించాల్సిందిగా CII -IGBC ని కోరుతున్నాం అన్నారు. రాష్ట్రంలో రాబోయే కొద్ది రోజుల్లో 50 శా తం జనాభా పట్టణ ప్రాంతాల్లో నమోదు కానుంది. హైదరాబాదును విశ్వ నగరంగా నిలబెట్టడానికి అన్ని రకాల ప్రయత్నాలు కొనసాగిస్తు న్నాం. రెప్పపాటు సమయం కూడా కరెంటు కోతలు లేకుండా నాణ్య మైన విద్యుత్తును నిరంతరంగా అందస్తున్నాం.

రాబోయే కొద్ది రోజుల్లో సమగ్ర ఇంధన పాలసీని తీసుకరాబోతున్నా మని తెలిపారు. పర్యావరణాన్ని పరిరక్షించడంలో భాగంగా కొత్తగూ డెంలో రూ. 56 కోట్లతో నిర్మించిన 10.5 మెగాపట్ల సోలార్ పవర్ ప్లాంట్ ను ఇటీవల ప్రారంభించాము. రాబోయే సంవ త్సర కాలంలో నల్లగొండ జిల్లాలోని యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ ద్వారా 4000 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయనున్నాం.

సింగరేణి ఆధ్వర్యం లోని ఖాళీ స్థలాల్లో సోలా ర్ పవర్ ప్లాంట్లను నె లకొల్పడం, భారీ మద్దతు సాగునీటి ప్రాజెక్టులపై ఫ్లూటింగ్ సోలార్, సోలార్ పవర్ ప్లాంట్లను నిర్మించేందుకు ప్రయ త్నాలు ప్రారంభించిన ట్టు వివరిం చారు. హైదరాబాద్ కు గ్లోబల్ సిటీ సదుపాయాలు కల్పి స్తున్నాం, ఈ ప్రయత్నం పెట్టుబడిదారులను ఆకర్షిస్తుంది. పెట్టుబడు లను ఆకర్షించేందుకు అవసరమైన అన్ని చర్యలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందన్నారు.

గత కాంగ్రెస్ ప్రభుత్వ పాలకుల దూర దృష్టి మూలంగానే ప్రస్తుతం హైదరాబా దులో ప్రపంచ స్థాయి సదుపాయా లు అందుబాటులోకి వచ్చాయి. ఔటర్ రింగ్ రోడ్డు, శంషాబాద్ ఎయిర్ పోర్టు, హైదరాబాద్ కు కృష్ణ జలాలు, మెట్రో రైలు, హైటెక్ సిటీ కి శంకుస్థాపన ఒంటి కా ర్యక్రమాలు గతంలోని ప్రాణం పోసుకున్నాయి. రాష్ట్ర ప్రజలు కుటుం బ పాలనకు స్వస్తి పలికారు ప్రజా ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు.

ప్రజలు, పెట్టుబ డిదారులు, వ్యాపారులు అందరికీ ఈ ప్రభుత్వం 24 గంటలు అందు బాటులో ఉంటుంది. రీజనల్ రింగ్ రోడ్ నిర్మిం చేం దుకు రాష్ట్ర ప్రభు త్వం కృషి చేస్తోంది. జిల్లాలను, అక్కడి ఉత్పత్తు లను హైదరాబాద్ నగరానికి అనుసంధానం చేయ డంలో రీజనల్ రింగ్ రోడ్డు తోడ్పడు తుంది. రీజినల్ రింగ్ రోడ్డు, ఔటర్ రింగ్ రోడ్డు మధ్య పారిశ్రామిక క్లస్టర్లు నిర్మించనున్నాం అని తెలిపారు.

ఈ రెండిటి మధ్యలో పరిశ్రమలు పెద్ద ఎత్తునరానున్నాయని ఫలితం గా వేలాది మంది కార్మికులు, ఉద్యోగులు, పెట్టుబడి దారులు ఈప్రాం తంలో నివసించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అన్నారు. వీటి మధ్య లో పెద్ద ఎత్తున ఇళ్ల నిర్మాణం జరుగుతుంది. గతంలో కూకట్ పల్లి ,ECIL హౌసింగ్ బోర్డ్ వంటివి ఈ తరహా లోనే రూపుదిద్దుకున్నాయి అని వివరించారు.

ఈ తరుణంలో రాష్ట్రం లో IGBC కీలక పాత్ర పోషించాల్సిన అవస రం ఉంది. మూసీ నదిని లండన్ లోని తే మ్స్ నది మాదిరిగా ప్రపం చ ప్రమాణాల తో రివర్స్ అండ్ ప్రైవేటుగా తీర్చిది ద్దుతామని ఇప్ప టికే ప్రకటించాం. నగరం నలుమూలల మెట్రో రైలు ను విస్తరించి ఆలోచనలో ఉన్నాం. తమది బిజినెస్ ఫ్రెండ్లీ ప్రభుత్వం ఈ రంగంలో నైనా పెట్టుబడులను సాధరంగా ఆహ్వానిస్తున్నామన్నారు.రాష్ట్ర ఆర్థి క అభివృద్ధిలో బిల్డ ర్లు కూడా భాగస్వాములే గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్ ను అందరం కలిసి ముందుకు తీసుకెళ్తామని తెలిపా రు.