Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Jagadeesh reddy: బిఆర్ఎస్ చేతుల్లోనే తెలంగాణ భవితవ్యం

ప్రాణాలు పణంగా పెట్టి కోట్లాడి సాధించుకు న్న తెలంగాణా రాష్ట్ర భవిష్యత్ బి ఆర్ యస్ పార్టీ చేతుల్లోనే ఉందని మాజీ మంత్రి, సూర్యాపేట శాసన సభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు.

తెలంగాణా రాష్ట్రానికి బి ఆర్ యస్ చారిత్రాత్మక అవసరం
లోక్ సభ ఎన్నికలు తెలంగాణ ప్రజల జీవన్మరణ సమస్య
బస్సు యాత్రలతో కాంగ్రెస్,బిజెపి లలో భయo ప్రారంభమైంది
లోకసభ ఎన్నికల్లో బి ఆర్ యస్ కు డబుల్ డిజిట్ ఖాయం
గోదావరి జలాలను చెన్నై కు తరలించేందుకు మోది కుట్ర
రిజర్వేషన్ల తొలగింపును సమర్ధిం చే ప్రసక్తేలేదు
ముస్లిం మైనారిటీల రిజర్వేషన్లపై శాసనసభ లోనే తీర్మానం చేశాం
గ్యారెంటిల అమలులో రేవంత్ రెడ్డి మోసం బట్టబయలు
బి ఆర్ యస్ టార్గెట్ గా ఒక్కటైన కాంగ్రెస్,బిజేపి లు
మోడీ, రేవంత్ లు ఒక్కటయ్యార నడానికి వంద ఆధారాలు
శాసనసభ ఎన్నికలకు ముందే ఇద్దరి మధ్యన ఒప్పందం
బడే బాయి, చోటా బాయికి మధ్య వర్తిత్వం నెరుపుతున్న రాహుల్
మిడ్ ది ప్రెస్ కార్యక్రమంలో మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీ ష్ రెడ్డి

ప్రజా దీవెన, హైదరాబాద్: ప్రాణాలు పణంగా పెట్టి కోట్లాడి సాధించుకు న్న తెలంగాణా రాష్ట్ర(Telangana Future) భవిష్యత్ బి ఆర్ యస్ పార్టీ చేతుల్లోనే ఉందని మాజీ మంత్రి, సూర్యాపేట శాసన సభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి(Jagadeesh reddy) స్పష్టం చేశారు. తెలంగాణా రాష్ట్రా నికి బి ఆర్ యస్ పార్టీ చారిత్రాత్మక అవసరమని ఆయన అభివర్ణించా రు. రేపు జరగబోయే లోకసభ ఎన్నికలు తెలంగాణా ప్రజలకు జీవన్మరణ సమస్య గా మారిందని ఆయన పేర్కొన్నారు.ఈ ఎన్నికల్లో బి ఆర్ యస్ కు డబుల్ డిజిట్ ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గురువారం ఉదయం హైదరాబాద్ సోమాజిగూడా ప్రెస్ క్లబ్ లో జరిగిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.

బడెబాయ్, ఛోటాబా యి అంటూ అటు ప్రధాని నరేంద్ర మోడీ(modi) ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిల పై సంచలనాత్మక ఆరోప ణలు గుప్పించారు. ఇక్కడి ప్రజల హక్కులను కాపాడగలిగేది కేవలం బి ఆర్ యస్ పార్టీతో మాత్రేమే సాధ్యమౌతుందాన్నారు.తెలంగాణా రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, గులాబీ బాస్ కేసీఆర్ చేపట్టిన బస్ యాత్ర లతో కాంగ్రెస్-బిజెపి లలో భయం జొరబడిందన్నారు. గోదావరి జలాల ను అప్పనంగా తమిళనాడు కు అప్పగించేందుకు ప్రధాని మోడీ(pm modi) కుట్రలు చేస్తున్నారని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు.కృష్ణా, గోదావ రి జలాలపై ఇక్కడి ప్రజాలకున్న హక్కులను కాపాడగలిగేది ఒక్క బి ఆర్ యస్ పార్టీ తో మాత్రమే సాధ్యం అవుతుంద న్నారు.

తెలంగాణా రాష్ట్రం తో పాటు సరిహద్దు రాష్ట్రాలలో ఉన్న కాంగ్రెస్ బిజెపి లు అక్కడి వారిని ఎదుర్కొ నలేక ఇక్కడి వారిని ఒప్పించ లేక ఇక్కడి రైతాంగంలో అయోమయం సృష్టిస్తు న్నారని ఆయన తేల్చిచెప్పారు. అందుకే రేపటి ఎన్నికల్లో తెలంగాణా ప్రజలు బి ఆర్ యస్ వైపు చూస్తున్నార న్నారు. రిజర్వేషన్ల తొలగింపును సమర్ధించే ప్రసక్తే లేదని,అయితే అదే సమయంలో ముస్లిం మైనారిటీలకు సంబంధించిన రిజర్వేషన్లపై బి ఆర్ యస్ పాలనలో జరిగిన శాసనసభ తీర్మానానికి కట్టుబడి ఉన్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. కేంద్రం నిధులు ఇస్తే గ్యారెంటీ లను అమలు పరుస్తా అన్న రేవంత్ రెడ్డి మాటలను ఆయన ఉటంకిస్తూ మరోసారి ఆయన చేయబోయే మోసం బట్ట బయలు అయిందని జగదీష్ రెడ్డి ఎద్దేవాచేశారు.

రాష్ట్ర బడ్జెట్ పబ్లిక్ డాక్యుమెంట్(State budget public document) అని ఇందులో పొందుపరిచిన విదంగానే కేటాయింపులు ఉంటాయాన్నారు.అటువంటి పరిస్థితి లలో ఇచ్చిన హామీలు అమలు చెయ్యలేక ఇప్పుడు ఆ నేపాన్ని కేంద్రం మీదకు నెట్టేసి చేతులు దులుపుకో చూస్తున్నారని అయం విమర్శించారు.అధికార పార్టీ నేతల మాటలు ఎక్కడ కుడా ప్రజాఉపయోగరంగ లేవన్నారు. అందుకు కోమటిరెడ్డి మాట్లాడుతు న్న చెత్త మాటలే నిదర్శనమ న్నారు.తెలంగాణా రాష్ట్రంలో బి ఆర్ యస్(BRS) టార్గెట్ గానే ప్రధాని మోడీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లు ఒక్కటయ్యారని ఆయన సంచలనాత్మక ఆరోపణలు సంధించారు.అందుకు సంబంధిం చిన వంద ఆధారాలు ఉన్నాయ న్నారు. ఇటీవలే జరిగిన శాసనసభ ఎన్నికలకు ముందు మోడీ సారధ్యంలోనీ కేంద్ర ప్రభుత్వం(Central Government) ఆ ఎన్నికల్లో రేవంత్ రెడ్డికి లబ్ది చేకూర్చే విదంగా నిర్ణయాలు తీసుకున్నారన్నారు. ఏనాడు కాళేశ్వరం వైపు కన్నెత్తి చూడని కేంద్ర నిపుణుల కమిటీ ఢిల్లీలో కూర్చుని రూపొంచిన నివేదికను బయట పెట్టడమే ఇందుకు తార్కాణమన్నారు.

ఆర్ ట్యాక్స్ అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై ఆరోపణలు గుప్పిస్తున్న ప్రధాని మోడీ ఆ దిశగా ఎందుకు విచారణ జరిపించడం లేదని ఆయన ప్రశ్నిం చారు. ఢిల్లీకి డబ్బుల సంచు లు మోస్తున్నారని రేవంత్ రెడ్డి పై ప్రధాని మోడీ ఆరోపిస్తున్న మాటల్లో నిజం ఉండి ఉంటే కేంద్ర ప్రభుత్వం అధీనం లో ఉన్న ఈ డి,సి బి ఐ లు ఎందుకు మిన్నకుండి పోయి ఉన్నాయో ప్రధాని వివరణ ఇవ్వాలని జగదీష్ రెడ్డి డిమాండ్ చేశారు.బడే బాయి చోటే బాయికి నడుమ మధ్యవర్తిత్వం నెరిపిదే ప్రధాని మోడీ అని ఆయన వ్యంగ్యంగా దుయ్యబట్టారు.
ఫోన్ ట్యాపింగ్ మొదలు పెట్టిందే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమ న్నారు.ఎన్నికల కు ముందు ఇచ్చిన గ్యారెంటిలను అమలు చెయ్యలేకనే ట్యాపింగ్ కధనాలు వండి వారుస్తున్నారన్నారు.

అసలు సమస్యలనుండి ప్రజల దృష్టి మరల్చేందుకే ట్యాపింగ్ ఎపిసోడ్(Tapping episode) ను తెర మీదకు తెచ్చారన్నారు.యస్ ఎల్ బి సి విషయంలో ఆయన స్పందిస్తూ కాంగ్రెస్ పాలనలో నీర్ణిత మూడు సంవత్సరాల వ్యవధిలో పూర్తి చేయాలి అంటూ టైంబౌండ్ ప్రోగ్రాం పెట్టుకుని తొమ్మిదేళ్ళ కాంగ్రెస్ పాలనలో ఎందుకు పూర్తి చెయ్యలేక పోయారో అంటూ ఆయన నిలదీశారు. ఎక్కడా ఉపయోగించని సాంకేతిక పరిజ్ఞానం ఇక్కడ ఉపయోగించినందున పనులు నత్తనడకన సాగడంతో పాటు ఇది పూర్తి అయితే నల్లగొండ జిల్లా ప్రజలకు సమృద్ధిగా నీళ్లు ఇవ్వాలిసి వస్తుందన్న అక్కసుతోటే నాటి సీమాంధ్ర పాలకులు ఈ కుట్రకు తెర లేపరన్నారు.

Telangana future in BRS Party hands