Agriculture Admissions : తెలంగాణ ప్రభుత్వం తీపికబురు, అగ్రికల్చర్ అడ్మిషన్లలో వ్యవసాయ కూలి పిల్లలకు 15శాతం ప్రత్యేక కోటా
Agriculture Admissions : ప్రజా దీవెన,హైదరాబాద్: రాష్ట్రం లోని వ్యవసాయ కూలీ కుటుంబా లకు తెలంగాణ ప్రభుత్వం తీపిక బురు అందించింది. అగ్రికల్చర్ అ డ్మిషన్లలో భూమిలేని నిరుపేద వ్య వసాయ కూలీల పిల్లలకు 15 శా తం శాతం రిజర్వేషన్లు కల్పించా లని ఆచార్య జయశంకర్ అగ్రికల్చ ర్ యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌ న్సిల్ నిర్ణయించింది. యూనివర్సి టీ పరిధిలోని కాలేజీల్లో ప్రస్తుతం రైతన్నల కుటుంబాల పిల్లలకు 4 0% శాతం రిజర్వేషన్ ఇస్తుండగా అందులో 15% రిజర్వేషన్లు వ్యవ సాయ కూలీల పిల్లలకు వర్తింపజే యనున్నారు.
రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనలకు అ నుగుణంగా తొలిసారిగా వ్యవసా య కూలీల పిల్లల కోసం బీఎస్సీ అ గ్రికల్చర్, బీటెక్ ఫుడ్ టెక్నాలజీ, కో ర్సుల్లో 15శాతం సీట్లను ప్రత్యేక కో టాగా కేటాయించామని రిజిస్ట్రార్ విద్యాసాగర్ వెల్లడించారు.ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ వర్సిటీ, హా ర్టికల్చర్, వెటర్నరీ యూనివర్సిటీల పరిధిలోని వ్యవసాయ, అనుబంధ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకోసం మంగ ళవారం19 వ తేదీ నుంచి 23వ తే దీ వరకు ఫస్ట్ ఫేజ్ జాయింట్ కౌ న్సె లింగ్ నిర్వహిస్తున్నామని విద్యాసా గర్ తెలిపారు. రాజేంద్రనగర్ లోని అగ్రికల్చర్ వర్సిటీ ఆడిటోరియంలో పైన తెలిపిన తేదీల్లో ఉదయం 9. 30గంటలకు కౌన్సెలింగ్ జరగనుం దని చెప్పారు.
ప్రభుత్వం కల్పించిన అవకాశం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి
1) నాల్గో తరగతి నుంచి 12వ తరగతి వరకు కనీసం నాలుగేళ్లు ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీలు లేదా రెసిడెన్షియల్ స్కూళ్లలో చదివిన విద్యార్థులు ఈ కోటాకు అర్హులు.
2) విద్యార్థి లేదా వారి తల్లిదండ్రుల పేరిట రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన గ్రామీణ ఉపాధి హామీ పథకం కార్డు ఉండాలి.
3)విద్యార్థి, వారి తల్లిదండ్రులు లేదా తాతల పేరిట ఎలాంటి వ్యవసాయ భూమి ఉండకూడదు. అయితే, ఒక ఎకరం భూమి ఉన్నవారు పైన పేర్కొన్న అర్హతలు కలిగి ఉంటే ఈ కోటాకు అర్హులు.
4)కౌన్సెలింగ్ కు హాజరయ్యే విద్యార్థులు అర్హతలకు సంబంధించి అన్ని సర్టిఫికెట్లు తప్పనిసరిగా వెంట తెచ్చుకోవాలి.
5)బీఎస్సీ (అగ్రికల్చర్), బీటెక్ (ఫుడ్ టెక్నాలజీ) కోర్సుల మొదటి సెమిస్టర్ ఫీజు రూ.49,560గా నిర్ణయించామని రిజిస్ట్రార్ విద్యాసాగర్ తెలిపారు.
6)పూర్తి వివరాలకోసం విశ్వవిద్యాలయ వెబ్ సైట్ www.pjtsau.edu.in లో చూడొచ్చు.