Damodar Rajanarsimha : ప్రజా దీవెన, హైదరాబాద్: రాష్ట్రం లో మే నెల నుంచే వర్షాలు ప్రారంభ మయ్యాయని, వాతవరణంలో వ చ్చిన ఈ మార్పుల వల్ల మే, జూన్ నుంచే అక్కడక్కడ సీజనల్ వ్యాధు లు ప్రారంభమయ్యాయని వైద్య ఆ రోగ్యశాఖ మంత్రి దామోదర రాజ నర్సింహ పేర్కొన్నారు.కేసులు ఎ క్కువగా నమోదవుతున్న జిల్లాలు, గ్రేటర్ హైదరాబాద్‌లో యాంటిలా ర్వల్ ఆపరేషన్‌ను విస్తృతం చేయా లన్నారు. సీజనల్ వ్యాధుల నివా రణ, నియత్రణపై సీరియస్ గా పని చేయాలని మంత్రి దామోదర రాజ నర్సింహ అప్పీల్ చేశారు. శనివారం ఆయన ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సం దర్భంగా మాట్లాడారు.
గతేడాదితో పోలిస్తే ఈసారి చాలా జిల్లాల్లో డెంగీ కేసులు తక్కువగా న మోదయ్యాయని, గ్రేటర్ హైదరా బాద్‌లో స్వల్పంగా కేసులు పెరిగా యని తెలిపారు.19 జిల్లాల్లో పది కంటే తక్కువ కేసులు నమోదవగా, మిగిలిన జిల్లాల్లో పదికంటే ఎక్కువ కేసులు నమోదయ్యాయన్నారు.
గతేడాదితో పోలిస్తే టైఫాయిడ్ కే సులు చాలా తక్కువగా నమోద య్యాయన్నారు.
వ్యాధుల తీవ్రత ఎక్కువగా ఉన్న
జీహెచ్‌ఎంసీ జోన్లకు స్పెషల్ ఆఫీ సర్లను నియమించాలని జీహెచ్ ఎంసీ అధికారులను ఆదేశించారు.
సీజనల్ వ్యాధుల నియంత్రణపై క లెక్టర్లతో రివ్యూ చేయాలని హెల్త్ సెక్రటరీకి మంత్రి సూచించారు.
ట్రైబల్ ఏరియాలపై ఎక్కువగా ఫో కస్ చేయాలని, ఐటీడీఏ పీవోలతో సమన్వయం చేసుకోవాలన్నారు.
క్షేత్రస్థాయిలో పనిచేసే వైద్య సిబ్బం ది ఇంటింటి సర్వే చేసి, ప్రజలకు అ వగాహన కల్పించేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.కేసులు ఎక్కువగా నమోదవుతున్న జిల్లా ల్లో ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు పర్యటించాలని మంత్రి ఆదేశించా రు.సీజనల్ వ్యాధుల బారిన పడిన పేషెంట్లకు చికిత్స అందించేందుకు హాస్పిటళ్లలో అవసరమైన అన్ని వసతులతో సిద్ధంగా ఉండాలని అధికారులను మంత్రి ఆదేశించారు.
అన్ని హాస్పిటల్స్‌లో అవసరమైన అన్నిరకాల మెడిసిన్‌ను అందుబా టులో ఉంచుకోవాలని మంత్రి సూ చించారు.డెంగీ, ప్లేట్‌లెట్స్ పేరిట పే షెంట్లను దోచుకునే ప్రైవేట్ హాస్పి టల్స్‌పై కఠిన చర్యలు తీసుకోవాల ని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్‌ను మంత్రి ఆ దేశించారు.సీజనల్ వ్యాధులపై ప్ర తి సోమవారం నివేదిక ఇవ్వాలని మంత్రి ఆదేశించారు.సీజనల్ వ్యా ధులపై ప్రజలకు అవగాహన కల్పిం చేందుకు ఆరోగ్యశాఖ రూపొందించి న కరపత్రాలను ఈ సందర్భంగా మంత్రి ఆవిష్కరించారు.ఇండ్లను పరిశుభ్రంగా ఉంచుకున్నట్టే, ఇంటి పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలను ప్రజలకు మంత్రి విజ్ఞప్తి చేశారు.
ఇంట్లో, ఇంటి పరిసరాల్లో నీటి నిల్వ లేకుండా చూసుకోవాలని మంత్రి సూచించారు.ఒకవేళ సీజనల్ వ్యా ధుల బారినపడితే, ప్రభుత్వ దవా ఖాన్ల వైద్య సేవలను ఉపయోగిం చుకోవాలని మంత్రి కోరారు. ప్రభు త్వ దవాఖాన్లలో అవసరమైన అ న్ని సౌకర్యాలు అందుబాటులో ఉ న్నాయన్నారు.
ఈ సమావేశంలో హెల్త్ సెక్రటరీ క్రిస్టినా జడ్ చొంగ్తు, పబ్లిక్ హెల్త్ డై రెక్టర్ రవిందర్ నాయక్, మెడికల్ ఎ డ్యుకేషన్ డైరెక్టర్ నరేంద్ర కుమార్, వైద్య విధాన పరిషత్ కమిషనర్ అ జయ్ కుమార్, మెడికల్ కార్పొరే షన్ ఎండీ ఫణీంద్ర రెడ్డి, జీహెచ్‌ఎం సీ అడిషనల్ కమిషనర్ రఘు ప్ర సాద్, పబ్లిక్‌హెల్త్ అడిషనల్ డైరెక్టర్ అమర్ సింగ్ నాయల్, జాయిట్ డై రెక్టర్ శివబాలాజీ ఇతర ఉన్నతా ధికారులు పాల్గొన్నారు.