–నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమ ర్తి లింగయ్య
BRSChirumarthiLingaiah : ప్రజా దీవెన, నల్లగొండ: నకి రేకల్ ని యోజకవర్గంలో లా అండ్ ఆర్డర్ గా డితప్పిందని నకిరేకల్ మాజీ శాసన సభ్యులు చిరుమర్తి లింగయ్య ఆరో పించారు. శనివా రం నల్లగొండ ఎస్పి కార్యాలయంలో ఎస్పి శరత్ చంద్ర పవార్ ని కలిసి నకిరేకల్ నియోజ కవర్గంలో జరుగుతున్న ఆగడాల గురించి వివరించారు.గత ఐదేండ్లు ప్రశాంతంగా ఉన్న నకిరేకల్ నియో జ కవర్గంలో కొంత మంది వ్యక్తులు కావాలని అలజడులు సృష్టిస్తున్నా రని ఆరోపించారు. బిఆర్ఎస్ నా యకులనే టార్గెట్ చేసి గ్రామాల్లో కాంగ్రెస్ గుండాలు దాడులు చేస్తున్నారనీ మండిపడ్డారు.
నకిరేకల్ మండంలోని తాటికల్ గ్రా మంలో బిఆర్ఎస్ సోషల్ మీ డియా కార్యకర్త మనోహర్ రెడ్డి అనే వ్యక్తి ఇందిరమ్మ ఇండ్లు గతం లో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ గా పనిచేసిన వ్యక్తికే మంజూరు చేయడం పట్ల సోషల్ మీడియాలో ప్రశ్నించిందుకు మాజీ సర్పంచ్, అతని అనుచరులు విచ క్షారహితంగా దాడి చేస్తే ఆ వ్యక్తి నకిరేకల్ పోలీ సులకు ఫిర్యాదు చేయ గా పోలీసులు అతనిపైనే వేరే ఫిర్యాదు పేరిట కేసులు చేస్తామని బెదిరించడం శోచనీయమన్నారు.
స్థానిక ఎమ్మెల్యే ప్రోద్భలంతో వేదిం పులకు గురిచేస్తున్నారని ఆగ్ర హం వ్యక్తం చేశారు. కడపర్తి గ్రామంలో గోర్ల బిక్షమయ్య అనే రైతు భూ వి వాదంలో ప్రత్యర్ధి ఎమ్మెల్యే గన్మెన్ అవ్వడంతో ఆ సమస్యను స్థానిక పోలీసులు సంవత్సరం నుండి ప ట్టించుకోవడం లేదని విమర్శించా రు.
మండలాపురంలో ఏర్పుల నా గమ్మ, వల్లభాపురం గ్రామంలో మా ద రమేష్, కడపర్తి గ్రామంలో గోర్ల మహేష్ ల సమ స్యలు నెలల తరబ డి పోలీస్ స్టేషన్ లలో మగ్గుతున్నా యని ఆరోపించారు.ఎస్పి నకిరే కల్ నియోజకవర్గంపై ప్రత్యేక శ్రద్ద తీసు కొని బాధితులకు న్యాయం జరిగే లా చూడాలని కోరారు. ఆయన వెం ట బాధితులతో పాటు పలువురు నాయకులు ఉన్నారు.