Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Telangana High Court: ఆరేళ్లకు ఆశలు నెరవేరిన సందర్భం..!

–సాధారణ బదిలీలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
–ఈనెల 5వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఉద్యోగుల బదిలీలు
–ఆప్షన్లు ఇచ్చి కౌన్సెలింగ్‌ ద్వారా ప్రక్రియ, ఒక్కో ఉద్యోగికి ఐదు ఆప్ష న్లు
–ఫోకల్‌ నుంచి నాన్‌ ఫోకల్‌ పాయింట్లకు అవకాశం
–80 వేల నుంచి లక్ష మందికి స్థానచలనం
–ఉద్యోగ సంఘాలు టీజీవో, టీఎన్‌ జీవో లు హర్షం
–ఆదాయ శాఖలు, పోలీసు, రవాణా, అటవీ శాఖలకు ప్రత్యేక మార్గదర్శకాలు

Telangana High Court:ప్రజా దీవెన, హైదరాబాద్‌: సుదీర్ఘ కాలం పాటు ఆరేళ్ల తర్వాత ఉద్యో గుల్లో ఆశలు కల్పిస్తూ ప్రభుత్వం (govt) శుభవార్త అందించింది. చాలా కాలం తర్వాత దాదాపు ఆరేళ్లకు సా ధారణ బదిలీల కు గ్రీన్ సిగ్నల్ (green signal) ఇచ్చింది. బదిలీలపై ఉన్న నిషే ధాన్ని ఎత్తి వేయడం ద్వారా ఈ నెల 5 నుంచి 20వ తేదీ వరకు బదిలీలు చేపట్టనున్నట్లు ప్రకటించింది. ఈమేరకు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృ ష్ణారావు బుధవారం బదిలీల ఉత్త ర్వుల(జీవో నంబర్‌ 80)ను జారీ చేశారు. ఉద్యోగుల నుంచి ఆప్షన్లు స్వీకరించి, కౌన్సెలింగ్‌ ద్వారా బదిలీలు చేయనున్నారు. దీనికి సంబంధించి బదిలీల షెడ్యూలు, మార్గదర్శకాలు జారీ చేశారు. బది లీలు చేపట్టే సాధికారత గల అధి కారులను కూడా ప్రకటించారు. ఫలితంగా రాష్ట్రంలోని గెజిటెడ్‌, నాన్‌–గెజిటెడ్‌, నాల్గో తరగతి ఉద్యోగుల బదిలీలు జరగనున్నా యి. టీచర్లు (teachers) మినహాయించి ఈ మూడు కేడర్లకు సంబంధించి రాష్ట్రంలో ప్రస్తుతం 2.5 లక్షల మంది ఉద్యోగులున్నారు. వీరిలో దాదాపు 80 వేల నుంచి లక్ష మంది వరకు ఉద్యోగులు, అధికారులు బదిలీ అవుతారని అంచనా. సుదీర్ఘ కాలం తర్వాత నిషేధాన్ని ఎత్తివేసి, బదిలీలకు అవకాశం కల్పించడం పట్ల వివిధ ఉద్యోగ, అధికార సంఘాలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నాయి. అయితే… ఒక ప్రదేశంలో రెండేళ్ల సర్వీసు పూర్తయిన ఉద్యోగి… బదిలీ కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హుడవుతాడని ప్రభుత్వం ప్రకటించింది. ఒకే ప్రదేశంలో నాలుగేళ్లకు మించి పని చేస్తున్న ఉద్యోగులను తప్పనిసరిగా బదిలీ చేయాలని ఆదేశించింది. ప్రతి కేడర్‌లో 40 శాతానికి మించి బదిలీలు చేయవద్దని తెలిపింది. బదిలీ ఉత్తర్వులు అందుకున్న మూడోరోజు నుంచి ఉద్యోగి రిలీవ్‌ (Employee Relieved) అయినట్లుగానే భావిస్తామని ప్రకటించింది. ఈ నెల 21 నుంచి సాధారణ బదిలీలపై తిరిగి నిషేధం అమల్లోకి వస్తుందని ప్రకటించింది.ఆరేళ్ల కిందట బదిలీలు

రాష్ట్రంలోని ఉద్యోగులు చాలా కాలం నుంచి బదిలీల కోసం ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా 317 జీవో కింద బదిలీ (tranfer) అయి, రెండేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న ఉద్యోగులు సొంత ప్రాంతాలకు వెళ్లాలని ఆశ పడుతున్నారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఉద్యోగుల బదిలీలను పెద్దగా పట్టించుకోలేదు. తన పదేళ్ల కాలంలో ఒకేఒకసారి 2018లో సాధారణ బదిలీలు చేపట్టింది. అది కూడా శాసన సభ ఎన్నికలకు ముందు హడావుడిగా బదిలీలు చేపట్టి, కేవలం 20 శాతం మందినే బదిలీ చేసింది. అప్పట్లో అందరికీ సరైన అవకాశాలు రాలేదని ఉద్యోగ సంఘాలు విరుచుకుపడ్డాయి. ఆ తర్వాత 2021లో కొత్త జిల్లాలకు ఉద్యోగుల సర్దుబాటులో భాగంగా 317 జీవోను తెచ్చింది. ఈ జీవో ఇప్పటికీ వివాదాస్పదంగానే ఉంది. ఉమ్మడి జిల్లాల నుంచి కొత్త జిల్లాలకు చాలా మంది ఉద్యోగులను సర్దుబాటు చేశారు. దాంతో తాము సొంత జిల్లాలను వదులుకోవాల్సి వచ్చిందని, సీనియారిటీ (Seniority) దెబ్బ తిన్నదంటూ ఉద్యోగులు వాపోయారు. అప్పటి నుంచి సాధారణ బదిలీలపై నిషేధాన్ని ఎత్తివేయాలంటూ ఉద్యోగ సంఘాలు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసినా కనికరించలేదు. ఇప్పుడు కాంగ్రెస్‌ పార్టీ (congress party) అధికారంలో ఉండటంతో సాధారణ బదిలీలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసింది. అంటే ఆరేళ్ల తర్వాత ఉద్యోగులకు మళ్లీ బదిలీల అవకాశం లభించింది.

ముందుగానే జాబితాలను ప్రదర్శనకు పెట్టాలిముందుగా విభాగాధిపతులు, బదిలీ చేసే అధికారమున్న అధికారులు(కాంపిటెంట్‌ అథారిటీ)… తమ శాఖ, విభాగంలోని బదిలీలకు అర్హులైన ఉద్యోగుల జాబితాలను (Lists of employees)కేడర్లవారిగా ప్రదర్శనకు పెట్టాలి. ఉద్యోగుల నుంచి ఆప్షన్లు స్వీకరించడానికి ముందుగానే తమ శాఖల్లోని ఖాళీల వివరాలను ప్రకటించాలి. తప్పనిసరిగా బదిలీ చేయాల్సిన ఉద్యోగుల వివరాలను కూడా ముందుగానే వెల్లడించాలి. బదిలీ కోరుకునే ప్రదేశాలకు సంబంధించి ఒక్కో ఉద్యోగికి ఐదు ఆప్షన్లు ఇవ్వాలి. ప్రతి ప్రాంతంలో కనీసమాత్రంగా ఉద్యోగులు (employees)ఉండేలా చూసుకున్న తర్వాతే బదిలీలకు అవకాశం కల్పించాలి. సమస్యాత్మక ప్రాంతాలకు ఎక్కువ దరఖాస్తులు రాని సందర్భంలో లాటరీ పద్ధతిని అనుసరించాలి. అన్ని రకాల బదిలీలు కౌన్సెలింగ్‌ ద్వారానే నిర్వహించాలి.

రాబడుల శాఖకు ప్రత్యేక మార్గదర్శకాలు

రాబడుల శాఖలైన వాణిజ్య పన్నులు, ఎక్సైజ్‌, స్టాంపులు–రిజిస్ట్రేషన్లలోని (Trade taxes, excise, stamps – registrations) బదిలీలకు ప్రత్యేక మార్గదర్శకాలను అనుసరించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఆ శాఖల్లో 2007లో జారీ చేసిన జీవో 143 ప్రకారం ఈ బదిలీలు చేపట్టాలని తెలిపింది. రవాణా, అటవీ శాఖల బదిలీల కోసం 2007, 2008లలో జారీ చేసిన జీవోలు 147, 81లలోని మార్గదర్శకాలను అనుసరించాల్సి ఉంటుంది. పోలీసు బదిలీల కోసం ప్రత్యేక మార్గదర్శకాలను జారీ చేసుకోవాలని సూచించింది.

ఉద్యోగ సంఘాల హర్షం

సాధారణ బదిలీలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసి, బదిలీలకు ప్రభుత్వం అవకాశం కల్పించడం పట్ల తెలంగాణ గెజిటెడ్‌ అధికారుల(టీజీవో) సంఘం, తెలంగాణ నాన్‌–గెజిటెడ్‌ అధికాల(Telangana Non-Gazetted Powers)(టీఎన్‌జీవో) సంఘం హర్షం వ్యక్తం చేశాయి. పార్లమెంటు ఎన్నికల సందర్భంలో బదిలీ అయిన ఎంపీడీవోలు, తహసిల్దార్లు, ఇతర ఉద్యోగులను తిరిగి తమ పాత ప్రాంతాలకు పంపించిన తర్వాతనే వారి నుంచి సాధారణ బదిలీల ఆప్షన్లు స్వీకరించాలని టీజీవోల సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఏలూరి శ్రీనివాసరావు, సత్యనారాయణ డిమాండ్‌ చేశారు. బదిలీలకు అవకాశం కల్పించినందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి టీఎన్‌జీవోల సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మారం జగదీశ్‌, ముజీబ్‌ కృతజ్ఞతలు తెలిపారు.

బదిలీల ప్రక్రియను ఖరారు చేయడం, ఆయా శాఖల్లో ఉన్న ఖాళీలు, తప్పనిసరిగా బదిలీ చేయాల్సిన ఉద్యోగుల జాబితాల ప్రదర్శన

కోరుకున్న ప్రదేశాలకు ఆప్షన్‌ ఇస్తూ ఉద్యోగులు దరఖాస్తు చేసుకోవాలి

దరఖాస్తుల పరిశీలన, కౌన్సెలింగ్‌ ద్వారా మాస్టర్‌ జాబితా తయారీ

బదిలీల ఉత్తర్వుల జారీ. ఈ ఉత్తర్వులు అందినప్పటి నుంచి మూడో దినాన్ని పాత స్థానం నుంచి ఉద్యోగి రిలీవ్‌ అయినట్లుగానే భావిస్తారు.
బదిలీల మార్గదర్శకాలు ఇవీ

* ఒకే చోట 30.6.2024 నాటికి రెండేళ్ల సర్వీసు పూర్తయిన ఉద్యోగి బదిలీకి అర్హుడు. రెండేళ్ల లోపు సర్వీసు ఉన్నవారిని బదిలీ చేయడానికి వీల్లేదు. భార్యాభర్తల(స్పౌజ్‌) కేసులకు ఈ నిబంధన వర్తించదు.

* జూన్‌ 30 నాటికి ఒక చోట నాలుగేళ్ల సర్వీసు పూర్తయిన ఉద్యోగిని తప్పనిసరిగా బదిలీ చేయాలి. 2025 సంవత్సరం జూన్‌ 30లోపు పదవీ విరమణ పొందే ఉద్యోగులను బదిలీ చేయొద్దు. ఒకవేళ వారు ఏదైనా కారణంతో బదిలీ కోరుకుంటే మాత్రం అంగీకరించాలి.

* ఒక కేడర్‌లో 40 శాతానికి మించి బదిలీలు చేయొద్దు. అలా చేస్తే… పనిపై ప్రభావం పడుతుంది.

* ఒక ప్రదేశం(గ్రామం, పట్టణం, నగరం) కావాలంటూ ఒకరికంటే ఎక్కువ మంది దరఖాస్తు చేసుకుంటే… ప్రాధాన్య క్రమంలో అవకాశం కల్పించాలి. అంటే… స్పౌజ్‌ కేసులు, 2025 సంవత్సరం జూన్‌ 30కు ముందు రిటైర్‌ అయ్యేవారు, 70 శాతానికి మించి అంగవైకల్యం ఉన్నవారు, మానసిక దుర్భలత పిల్లలున్నవారు, వితంతువులు, క్యాన్సర్‌, న్యూరోసర్జరీ, కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌, లివర్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌, ఓపెన్‌ హార్ట్‌ సర్జరీ, బోన్‌ టీబీ సంబంధిత చికిత్సలు/శస్త్ర చికిత్సలు పొందుతున్నవారు, సమస్యాత్మక ప్రాంతాల్లో దీర్ఘకాలికంగా పని చేస్తున్నవారికి వరుస క్రమంలో బదిలీలకు అవకాశం కల్పించాలి.

* గుర్తింపు పొందిన ఉద్యోగ, అధికార సంఘాల ఆఫీస్‌ బేరర్ల బదిలీల విషయంలో 2012లో జారీ చేసిన సర్క్యులర్‌ నిబంధనలను అమలు చేస్తారు.

* బదిలీలు తప్పనిసరిగా ఫోకల్‌ పాయింట్‌ నుంచి నాన్‌–ఫోకల్‌ పాయింటుకు, నాన్‌–ఫోకల్‌ పాయింటు నుంచి ఫోకల్‌ పాయింటుకు జరగాలి.