Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Telangana household survey : సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే పై టామ్ టామ్

-- నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి

సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే పై టామ్ టామ్

— నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి

ప్రజా దీవెన, హాలియా: నల్లగొండ జిల్లాలో ఈనెల 6 నుండి చేపట్ట నున్న సామాజిక ,ఆర్థిక, విద్య , ఉపాధి, రాజకీయ మరియు కుల సర్వే సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే(A comprehensive household survey) పై టామ్ టామ్ వేయిం చాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు.

సోమవారం ఆమె నల్గొండ జిల్లా, హలియా( haliya) మున్సిపాలి టీలో సామాజిక ,ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ మరియు కుల సర్వే సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే పై సూపర్వైజర్లు, ఎన్యుమ రేటర్లకు ఉద్దేశించి ఏర్పాటు చేసిన శిక్షణా కార్యక్రమానికి హాజర య్యా రు. సర్వే ఎన్యుమరేటర్లు (Enumerators) నిర్లక్ష్యంగా ఉండవద్దని, పూర్తి జాగ్రత్తగా వివరాలు సేక రించాలని కలెక్టర్ అన్నా రు.

కేటాయించిన ప్రతి ఇంటి నుండి వివరాలు సేకరించాలని, సర్వే కి వెళ్లిన సమయంలో ఒకవేళ ఎవరైనా ఇంట్లో లేనట్లయితే మరోసారి ఆ ఇల్లును సందర్శించాలని, వివరాలు సేకరించిన తర్వాత ఇండ్లకు స్టిక్కర్ అతికించాలని చెప్పారు. ఎన్యుమరేటర్లు 6 తేదీ నుండి సర్వే కు వస్తున్నందున జిల్లాలోని గృహ కుటుంబ యజమానులందరు( All household owners)  ఆధారాలతో సహా అందుబాటులో ఉండాలని కోరారు.

సమగ్ర సర్వేను వివరాలను గోప్యంగా(The surve y details are confidential) ఉంచాలని, పూర్తి శ్రద్ధగా పనిచేసి సర్వే కార్య క్రమాన్ని పూర్తి చేయా లని, ఉపా ధ్యాయులు ( teachers) గతంలో ఎన్నికల విధులు నిర్వ హించిన అనుభ వాన్ని దృష్టిలో ఉం చుకొని రాష్ట్ర ప్రభుత్వం సమ గ్ర సర్వే బాధ్యత ఉపాధ్యాయుల కు ఇవ్వడం జరిగిం దని, అందువల్ల బాధ్యతగా సర్వే చేయాలని చెప్పా రు.

ఈ సర్వే కేవలం రాష్ట్రం లో సమాచార నిమిత్తం ,ప్రస్తుత పరి స్థితిని తెలుసుకునేందుకు మాత్ర మే అని స్పష్టం చేశారు.ఈ సంద ర్భంగా జిల్లా కలెక్టర్ సర్వే ఫారా లలోని ఖాళీలను ఎలా పూరించాలో తెలి యజేయడమే కాకుండా ప్రశ్నావలి పై ఎన్యుమరే టర్లకు వివరంగా తెలియజేశారు. హలి యా మున్సి పల్ కమిషనర్ రామ్ దుర్గారెడ్డి , మండల ప్రత్యేక అధికారి బిక్షపతి తదితరులు ఉన్నారు.

Telangana household survey