Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Telangana minister komatireddy venkatreddy : భవన నిర్మాణ పనుల్లో అలసత్వం అవాంఛనీయo

--నిధుల కొరత లేకున్నా నిర్మాణ జాప్యంపై ఆగ్రహం --పనుల్లో మాత్రం అలసత్వo లేకుం డా పనులు పూర్తి చేయాలి --రోడ్లతో ప్రజలు ఇబ్బందులు పడ కుండా పకడ్బందీగా పనులు -- నిమ్స్ హాస్పిటల్ కొత్త భవన నిర్మాణ స్థితిగతులపై ఆరా --హైదరాబాద్ కలెక్టరేట్ నిర్మాణ పనుల పురోగతి పరిశీలన --సిఆర్ఐఎఫ్, టిమ్స్ ఆసుపత్రుల నిర్మాణాలపై సమీక్షించిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి --రేపటి నుంచి 6 రోజుల పాటు అమెరికాకు వెళ్తున్న మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి

భవన నిర్మాణ పనుల్లో

అలసత్వం అవాంఛనీయo

–నిధుల కొరత లేకున్నా నిర్మాణ జాప్యంపై ఆగ్రహం
–పనుల్లో మాత్రం అలసత్వo లేకుం డా పనులు పూర్తి చేయాలి
–రోడ్లతో ప్రజలు ఇబ్బందులు పడ కుండా పకడ్బందీగా పనులు
— నిమ్స్ హాస్పిటల్ కొత్త భవన నిర్మాణ స్థితిగతులపై ఆరా
–హైదరాబాద్ కలెక్టరేట్ నిర్మాణ పనుల పురోగతి పరిశీలన
–సిఆర్ఐఎఫ్, టిమ్స్ ఆసుపత్రుల నిర్మాణాలపై సమీక్షించిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
–రేపటి నుంచి 6 రోజుల పాటు అమెరికాకు వెళ్తున్న మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి
ప్రజా దీవెన, హైదరాబాద్: హైదరాబాద్ తో పాటు వివిధ తెలంగాణ జిల్లాల నుంచి వచ్చే రోగుల కోసం నగరం నలుమూలల నిర్మిస్తున్న నాలుగు టిమ్స్ హాస్పిటల్స్  ( tims  hospitals) తో పాటు, రాష్ట్ర వ్యాప్తంగా రూ. 2 వేల కోట్లతో నిర్మిస్తున్న సిఆర్ఐఎఫ్ మరియు ఇత ర ఆర్&బీ రోడ్ల నిర్మాణాలు, సచివాలయ పార్కింగ్ ఏర్పాటు, నిమ్స్ హాస్పి టల్ భవనం, హైదరాబాద్ నూతన కలెక్టరేట్ నిర్మాణ స్థితిగతు లపై మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ( minister komati red dy venkatreddy) ఆర్ అండ్ బీ ఉన్నతాధికారులతో బుధవా రం సమీక్ష సమావేశం నిర్వహించారు.

గత ఐదేండ్లలో రోడ్ల నిర్మాణం జరగకపోవడం వల్ల ఏ రోడ్డు చూసినా అధ్వన్నంగా మారి పోయి ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నా రని. ఎక్కడ చూసినా రోడ్డు (roads) ప్రమాద వార్తలే కనిపిస్తున్నా యని ఆయ న ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వచ్చిన వెంటనే రివ్యూ కూడా చేసుకొనే సమయం లేకుండానే ఎన్నికల కోడ్ రావడం వల్ల పనులన్ని పెండింగ్ లో పడిపోయాయని ప్రజల జీవితాలను ప్రభావితం చేసే ఈ రోడ్ల నిర్మాణ ప్రక్రియను వెంటనే ప్రారంభించి ప్రజ లకు అం దుబాటులోకి తీసుకురావాలని మంత్రి అధికారులకు సూ చించారు.

అందుకోసం 24/7 పనిచేసేలా యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకుందా మ ని సూచించారు. ఇక రాష్ట్ర సచివాలయంలో పార్కింగ్ లేక మం త్రులు, నాయకులు, ఉద్యోగులు, సిబ్బంది ఇబ్బందులు దృష్ట్యా పా ర్కింగ్ నిర్మాణంపై ప్రత్యేకంగా చర్చించారు. రూ. 30 కోట్ల రూపాయ లతో నిర్మించ తలపెట్టిన పార్కింగ్ పనులకు వెంటనే టెండర్లు పిలిచి నిర్మాణం చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీచేశారు.

సగటున రోజుకు 750 నుంచి 1000 వాహనాలు పార్కింగ్ చేయా ల్సిన రాష్ట్ర సచివాలయంలో (state secretariat) పార్కింగ్ షెడ్స్ లేకుండా బిల్డింగ్ ప్లాన్ కు ఎలా అనుమతులు ఇచ్చారని మం త్రి అధికారులను ప్రశ్నించారు. మంత్రి ప్రశ్నతో మిన్నకుండిపోయిన అధికారులు వెంటనే పనులు ప్రారంభించి వేగంగా నిర్మాణం పూర్తి చేస్తామని తెలిపారు.

సోలార్ పార్కింగ్ కు ప్లాన్ సిద్ధం చేశామని, ఉత్పత్తి అవుతున్న వి ద్యుత్తును గ్రిడ్ లకు ఇవ్వ డం గానీ, లేదా సచివాలయ అవసరాల కు వాడు కునే విధంగా నిర్మా ణం చేపడుతున్నామని అధికారులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. మనం ఏం చేసినా అంతిమంగా సచివాలయ ఉద్యోగులకు, సిబ్బందికి ఉపయోగపడితేనే మనం చేసి న పనికి గుర్తింపు ఉంటుందని, ఆ విధంగా నిర్మాణం చేపట్టాలని చెప్పారు.

అధికారులు చూపించిన సచివాలయ పార్కింగ్ ( parkinkig) లో పలు సూ చనలు చేసిన మంత్రి సచివాలయంలో టాయిలెట్లు లేకుం డా వాహనాల డ్రైవర్ల ఇబ్బందులు పడుతున్నారని వారి కోసం రెం డు వైపుల టాయిలెట్ల నిర్మాణం చేపట్టాలని మంత్రి ఆదేశించారు. ఇవి కాకుండా హైదరాబాద్ ( hyderabad) కలెక్టర్ భవన నిర్మా ణంపై అధికారులను ఆరాతీశారు.

హైదరాబాద్ నలు మూలల నిర్మిస్తున్న నాలుగు టిమ్స్ హాస్పిటల్ భవనాల నిర్మాణంపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. 50 వేల స్క్వేర్ ఫీట్ల స్థలంలో, 14 అంతస్తులుగా నిర్మిస్తున్న టిమ్స్ భవ నాల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. భవనాల నిర్మాణాలకు బ్యాంకులు లోన్లు ఇస్తున్నందున నిధుల కొరత లేనప్ప టికి పనుల్లో జాప్యం జరగడం పట్ల మంత్రి ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎల్.బీ నగర్, ఆల్వాల్ టిమ్స్ హాస్పిటల్ కు సంబంధించిన ఎన్.ఓ.సీ లను అడిగిన నాలుగు రోజుల్లోనే ఇప్పించానని ఏదైన సమస్య ఉం టే తన దృష్టి కి తీసుకు వస్తే వెంటనే పరిష్కరిస్తానని పనుల్లో మా త్రం అలసత్వానికి తావు లేకుండా పనులు పూర్తి చేయాలని అధి కారులకు తేల్చిచెప్పారు. ఇప్పటికే ఉస్మానియా, నిమ్స్ (nims), గాంధీ ( gandhi hospitals)  పత్రుల్లో రోగుల తాకిడి ఎక్కు వగా ఉందని వెంటిలేటర్ బెడ్స్ లేక సామాన్యులు ఇబ్బందులు పడుతు న్నారని, వీలునుబట్టి వెంట నే సగం భవనమైన అందుబాటులోకి తీసుకువచ్చి సమాంతరంగా పనులు చేపట్టాలని అధికారుల కు మార్గనిర్ధేశం చేశారు.

దాదాపు రూ. 5 వేల కోట్ల పైచిలుకు నిధులతో నిర్మి స్తున్న నాలుగు టిమ్స్ పనుల్లో జాప్యం జరగడంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. అనం తరం రాష్ట్ర వ్యాప్తంగా రూ. 2 వేల కోట్ల నిధులతో నిర్మిస్తున్న సిఆర్ఐఎఫ్ పనుల పురోగతి గురించి అధికారులను అడిగి తెలు సుకున్నారు. ఇప్పటికే దాదాపు 70 శాతం పనులకు టెండర్లు పిలిచా మని, మిగిలిన పనులకు టెండర్ ప్రక్రియను రెడీ చేసుకున్నామని ఎన్నికల (elections) నియమావళి కారణంగా టెండర్లు పిలవలేక పోయామని కోడ్ ముగిస్తున్నందున జూన్ 6వ తేదీ నుంచి టెండర్ల ప్రక్రియ ప్రారంభిస్తామని మంత్రికి అధికారులు తెలియజేశారు.

అమెరికన్ తెలుగు అసోసియేషన్ ( american Telugu asso ciation) ఆహ్వానంతో పాటు వివిధ అధి కారిక కార్యక్రమాల్లో పా ల్గొనేందుకు ఈ నెల 6వ తేది నుంచి ఆరు రోజుల పాటు అమెరికాకు వెళ్తున్నందున తిరిగి వచ్చేలోపు పెండింగ్ లో ఉన్న పనులన్నింటిని పూర్తి చేయాలని అధికారులకు చెప్పారు.

అమెరికా నుంచి రాగానే జిల్లాల్లో పర్యట నలు చేపడతామని తెలిపి న ఆయన తెలంగాణవ్యాప్తంగా ఎక్కడ రోడ్లతో ప్రజలు ఇబ్బందులు పడ కుండా పకడ్బందీగా పనులు చేప ట్టాలని అధికారులకు మార్గ నిర్ధేశనం చేశారు. ఈ సమావేశంలో ఆర్&బి సెక్రెటరీ విజయేందిర బోయి, ఈఎ న్సీ గణపతిరెడ్డి, ఛీఫ్ ఇంజనీర్ శారద, ఎస్ఈ శ్రీనివాస్ రెడ్డి, హఫీజ్ తో పాటు తదితరలు పాల్గొన్నారు.