Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Telangana New Energy Policy : తెలంగాణ రాష్ట్రంలో కొత్త ఎనర్జీ పాలసీ

--విద్యుత్ నిష్ణాతులు, మేధావులు, ప్రజాభిప్రాయాలతో నిర్ణయిస్తాం -- అసెంబ్లీలో చర్చించి నూతన పాలసీని ప్రకటింస్తాం --రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క

తెలంగాణ రాష్ట్రంలో కొత్త ఎనర్జీ పాలసీ

–విద్యుత్ నిష్ణాతులు, మేధావులు, ప్రజాభిప్రాయాలతో నిర్ణయిస్తాం
— అసెంబ్లీలో చర్చించి నూతన పాలసీని ప్రకటింస్తాం
–రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క

ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం, వీర్ల పాలెం వద్ద ఉన్న యాదాద్రి థర్మల్ పవర్ స్టేషషన్ ( yadhadhri dhar mal power station) లో ఆది వారం రాష్ట్ర ఉప ము ఖ్య మంత్రి, విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క( batti Vikra marka) మల్లు, నీటి పారు దల ,పౌరస రఫరాల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి,రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంక టరెడ్డిలతో కలిసి యూనిట్ -1 సింక్రనైజేషన్ ( sinc ranaigation) కార్యక్ర మాన్ని ఆయన ప్రారంభించారు.

గతంలో వై టి పి ఎస్ యూనిట్- 2 సింక్రనైజే షన్ కార్యక్రమాన్ని విజయవంతంగా ప్రారంభించిన విష యం తెలిసిందే.ఈ సందర్భం గా ఉప ము ఖ్య మంత్రి మల్లు భట్టి విక్రమార్క మీడియా ప్రతిని ధులతో మాట్లాడుతూ 202 5 మే నాటికి యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ ద్వారా పూర్తి స్థాయి లో 4 వేల మెగావాట్ల విద్యు త్ ను గ్రిడ్ ( power grid) కు అనుసం ధానం చేస్తామని తెలిపారు.

త్వర లోనే తెలంగాణ రాష్ట్ర నూతన ఎనర్జీ పాలసీని (New Ener gy Policy) ప్రవేశపెట్ట బోతున్నామ ని, ఇందుకుగాను రాష్ట్ర వ్యా ప్తంగా ఉన్న విద్యుత్తు నిష్ణాతులు (elect ricity Profic ient) మేధావులు, అన్ని వర్గాల ప్రజలందరి ప్రజాభి ప్రాయ సేకరణ (Re ferendum) తీసుకొని, అసెంబ్లీలో చర్చించిన తర్వాత అందరి అభి ప్రాయాలతో నూతన ఎనర్జీ పాల సిని ప్రకటిం చనున్నట్లు ఆయ న వెల్లడించారు.

రాష్ట్రవ్యాప్తంగా పవర్ డిమాం డ్ ను దృష్టిలో ఉంచుకొని విద్యుత్ ఉత్పాద నను( power genera tion) చేపడుతున్నామని, 20 28 -29 నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 22,4 88 మెగావాట్ల విద్యుత్తు డిమాండ్ ఉండవచ్చని అంచనాలు రూపొం దించడం జరిగిందని, ఇది 2034- 35 నాటికి 31,809 మెగావాట్ల డిమాండ్ కు పెరిగే అవకాశం ఉన్న ట్లు అంచనా వేసినట్లు తెలిపారు.

 

డిమాండ్ కనుగుణంగా విద్యుత్తు ఉత్పాదన పెంచుతూ (Increas ing power generation) తెలం గాణ రాష్ట్రం ముందుకు వెళు తున్న దని,రాష్ట్ర పురోభివృద్ధిని, వ్యవ సాయ ,పరిశ్రమ, గృహ అవ సరా లను అన్నిటిని దృష్టిలో ఉంచుకొని ఏ రంగంలో విద్యుత్ సమ స్య రాకుండా పూర్తిస్థాయిలో విద్యుత్తు అందించే విధంగా ప్రణా ళిక లతో ముందుకు పోతున్నట్లు ఆయన చెప్పారు. పరిశ్రమలు, ఇత ర అవసరాలకు విద్యుత్తు లేదు అని అని పించుకోకుండా అన్ని అవ సరాలు తీర్చేలా పూర్తిస్థాయిలో నాణ్యమైన విద్యుత్ అందిస్తామని ఆయన వెల్లడించారు.

మారుతున్న పరిస్థి తులకు అనుగుణంగా గ్రీన్ ఎనర్జీ ని( Green energy) రాష్ట్రంలో ప్రవేశపెట్టనున్నామని, ఇందుకు తగ్గట్టుగా విద్యుత్తు ఉత్పాదన చేపట్టి రాష్ట్రాన్ని క్లీన్ అండ్ గ్రీన్ గా ఉంచుతా మని తెలిపారు.ఇందులో భాగంగా సాంప్రదాయేతర ఇంధన వన రుల ద్వారా 20 వేల మెగావా ట్ల విద్యుత్ ఉత్పత్తికి ప్రణాళిక రూ పొందిస్తున్నట్లు తెలిపారు.

ప్రపంచంలోని బహుళ జాతి కంపెనీలు (Multinational com panies) తెలంగాణ రాష్ట్రానికి వచ్చి పరిశ్ర మలు ఏర్పాటు చేయ డంతో పాటు, మార్కెటింగ్, ఇతర అంశా లను దృష్టిలో ఉంచుకుని వారు ఆశించిన గ్రీన్ పవర్ ( green power) ను అందించేందు కు, ఆ విధమైన విద్యుత్ ఉత్పాదనకు చర్యలు తీసుకుంటున్నా మని ఉప ముఖ్యమంత్రి తెలిపారు. థర్మ ల్, సోలార్, హైడ్రో, పంప్ ఎనర్జీ వంటి రకరకాల విద్యుత్ ఉత్పాదన చేపట్టనున్నా మని, భవి ష్యత్తులో తెలంగాణ విద్యుత్ రంగం దేశా నికి ఆదర్శంగా ఉండబోతున్నదని చెప్పారు.

అంతకుముం దు ఉప ముఖ్యమంత్రి, మంత్రులు దామర చర్ల వద్ద యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ కు బొగ్గు అందించే ర్యాకుల రైల్వే వ్యాగన్( railway wagon) ను ప్రారంభించారు. రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ మరియు వై టి పి ఎస్ చైర్మన్ సందీప్ కుమా ర్ సుల్తానియా, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి,జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి, నాగార్జు నసాగర్ శాసనసభ్యులు కే.జయవీర్ రెడ్డి ,వైటీపీఎస్ టెక్నికల్ డైరె క్టర్ అజయ్, ప్రాజెక్ట్స్ డైరెక్టర్ సచ్చిదానంద, చీఫ్ ఇంజనీర్ సమ్మ య్య, టి పి సి సి ఈ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.

Telangana New Energy Policy