Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Dharani portal: రెవెన్యూ ప్రక్షాళనకు శ్రీకారం

బీఆర్ ఎస్ ప్రభుత్వం తెచ్చిన ధరణి పోర్ట ల్ వల్ల రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది కుటుంబాలు భూ సమస్యలను ఎదుర్కొంటున్నారని, ఎన్నో కుటుం బాలు ఛిన్నాభిన్నం అయ్యాయని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాలశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.

సామాన్యులకు దగ్గరగా ధరణి పోర్టల్
గత బిఆర్ఎస్ ప్రభుత్వ ధరణితో లక్షలాది కుటుంబాలు ఛిన్నాభిన్నం –ధరణి కమిటీతో సమావేశమైన మంత్రి పొంగులేటి
ప్రజా దీవెన, హైదరాబాద్: బీఆర్ ఎస్(BRS) ప్రభుత్వం తెచ్చిన ధరణి(Dharani portal) పోర్ట ల్ వల్ల రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది కుటుంబాలు భూ సమస్యలను ఎదుర్కొంటున్నారని, ఎన్నో కుటుం బాలు ఛిన్నాభిన్నం అయ్యాయని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాలశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి( Revenue Housing, Information and Civil Relations minister Ponguleti Srinivas Reddy) అన్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత స్వయంగా తాను ఖమ్మం జిల్లాలో క్షేత్ర స్థాయిలో పర్యటించినప్పుడు ప్రతి గ్రామంలో రెండు వందల కుటుంబాలకు పైగా భూ సంబంధిత సమస్యలను ఎదుర్కొంటున్న విషయం తన దృష్టికి వచ్చిందన్నారు.

ఈ సమస్యల నుంచి ఉపశమనం కలిగించడానికి ధరణి పోర్టల్ ను పునర్ వ్యవస్థీ కరించి భూ సంబంధిత వ్యవహా రాలను అందుకు సంబంధించిన చట్టాలలో మార్పులు తేవాల్సిన అవసరం ఏర్పడిందని ఈ దిశగా ఇప్పటికే అవసరమైన చర్యలు చేపట్టామని వెల్లడించారు. శుక్ర వారం డా.బీ.ఆర్.అంబేద్కర్ సచివా లయంలోని తన కార్యాల యంలో మంత్రి శ్రీనివాస్ రెడ్డి(minister Ponguleti Srinivas Reddy) ధరణి కమిటీ సభ్యులు ఎం. కోదం డ రెడ్డి, ఎం.సునిల్ కుమార్, మధు సూదన్ లతో సమావేశమ య్యా రు. ఈ సంధ ర్భంగా మంత్రి మాట్లా డుతూ గత ప్రభుత్వం ఎంతో హడా విడిగా ఎలాంటి అధ్యయనం చేయ కుండా తీసుకువచ్చిన ధరణి పోర్టల్ కారణంగా ప్రజలు ఎన్నో సమస్య లు ఎదుర్కొన్నారని, ఈ సమస్య లను పరిష్కరించేందుకు తమ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతను ఇస్తోందని అన్నారు.

ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రెవెన్యూ వ్యవస్థ(Revenue system) (ధరణి) ప్రక్షాళన చేసేందు కు సత్వర చర్యలు తీసుకుంటు న్నామని, ధరణి పోర్టల్ అమలు కారణంగా వచ్చిన సమస్యలను అధ్యయనం చేయడానికి అయిదు గురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేశామని, ఈ కమిటీ చేసిన సిఫార సులపై శుక్రవారం జరిగిన సమావే శం లో సుధీర్ఘంగా చర్చించామని, ఈ కమిటీ తుది నివేదిక ప్రభుత్వా నికి సమర్పిం చేకంటే ముందు అన్నీ జిల్లా కలెక్టర్లతో సమావేశం నిర్వ హించాలని నిర్ణయించినట్టు వెల్లడిం చారు. ఈ కమిటీ రాష్ట్రంలో భూ సంబంధిత నిపుణులు, అధికారుల తో చర్చించడంతో పాటు 18 రాష్ట్రాలలోని RoR యాక్ట్ ను క్షుణ్ణంగా పరిశీలించింది. భూమి వివాదాల పరిష్కారం కోసం రెవె న్యూ ట్రిబ్యునల్(Revenue Tribunal) లను ఏర్పాటు చేయాలని, భూమికి సంబంధించిన ముఖ్యమైన చట్టాలను కలిపి ఒకే చట్టంగా రూపొందించాలని కమిటీ సూచించిందని మంత్రి వెల్లడిం చారు.

లోపభూయిష్టమైన 2020 RoR చట్టాన్ని తద్వారా రూపొం దించిన ధరణి పోర్టల్ను బలో పేతం చేయడంతో పాటు సామాన్య ప్రజల కు అందుబాటులో ఉండేలా అంద రికీ సులువుగా అర్థమయ్యే రీతిలో ధరణి పోర్టల్ లో మార్పులు చేర్పు లు చేపట్టబోతున్నామని మంత్రి వెల్లడించారు. గత ప్రభుత్వం పార్ట్ బి లో ఉంచిన భూ సమస్యలను పరిష్కరించడానికి ఇప్పటికే స్పష్ట మైన ఆదేశాలు జారీ చేయడం జరి గిందని, ఈ సమస్యల పరిష్కా రాని కి మరింత వేగంగా చర్యలు చేప ట్టాలని సూచించారు.

Telangana people problem faced with Dharani portal